ఔషధ మొక్క… కలబంద

కలబంద ఒక గుత్తి వలే పత్రాలు వచ్చే బహువార్షిక మొక్క. దాదాపు 60 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. ఆకులు జిగటగా ఉన్న గుజ్ౙు కలిగి, అంచులకు ముండ్ల వంటి దంతాలుంటాయి. ఆకులు 50 సెం.మీ. వరకు పెరిగి చాకుల వలె ఉంటాయి. పూవులు నారింజ పసుపు రంగులో ఒక మీటరు పొడవు గల కాడపై గొట్టాల వలే వ్రేలాడబడి ఉంటాయి. ఈ మొక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యాన వనాలలోను, పొలంగట్ల పైన పెంచబడుతుంది. ఇది వేరు పిలకల ద్వారా వ్యాప్తి చెందుతుంది.

సాధారణ నామం : ఇండియన్ అలో / బార్బడోనఅలో / ఘికుమార్/ఘ్రిత్‌కుమారి శాస్త్రీయ నామం: అలో బార్బడెన్స్ / అలో విర కుటుంబం: లిలియేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • ఆకులు, ఆకులలో వుండే గుజ్జు, పసుపు రంగు ద్రవం (మూసాంబ్రం) కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.
  • వీటిలో ఆంత్రాక్వినోన్లు (అలాయిన్, అలోఎమోడిన్), రెసిన్లు, టానిన్లు, పాలిశాకరైడ్లు, మొదలైన రసాయన పదార్థాలుంటాయి. కలబంద ఆకు చలవ చేస్తుంది. నేత్ర రోగాల చికిత్సలో దీనిని ఉపయోగిస్తారు.
  • దీని నుండి తీసిన గుజ్ౙుని మరియు పసుపు రంగు ద్రవాన్ని ఎండబెడితే మూసాంబ్రం అనే పదార్థం తయారవుతుంది. ఇది నొప్పులను, వాపులను, కుష్టువ్యాధి, మూలశంక, మానసిక వ్యాధులు, చర్మవ్యాధులు, కాలేయ వ్యాధులు, ఋతుసంబంధ వ్యాధుల చికిత్సకు, రక్తవిరేచనాలు అరికట్టడానికి ఉపయోగపడుతుంది.
  • తెగిన గాయాలకు, వడదెబ్బకి ప్రాధమిక చికిత్సగా బాగా పనిచేస్తుంది. కలబంద ఆకులలో ఉండే గుజ్ౙు సౌందర్య సాధనాల తయారీలో ప్రస్తుతం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
  • చంటి పిల్లల కడుపులో క్రిముల నివారణకు, విరేచనకారిగా కూడా ఉపయోగపడుతుంది.

వ్యవసాయరంగంలో

  • కలబంద చెదల వికర్షకంగా పని చేస్తుంది. కలబంద నీటి ద్రావణం చెదలను వికర్షిస్తుంది.
  • కలబందలో సహజ అలాయిన్ అనే రసాయనముంది. అందువలన కలబందను ఎటువంటి పురుగులు, తెగుళ్ళు ఆశించవు (పంత్, 2016). దీనిని జీవ ఎరువుగా కూడా ఉపయోగించవచ్చు.
  • కలబంద ద్రావణంలోని అలోయిన్ ఎ (0.02%) మొక్కజొన్న గింజల నిల్వ సమయంలో ఆశించే సైటోఫిలస్ ఒరైజెపై బలమైన వికర్షక చర్యను ప్రదర్శించింది (మల్లావధాని, అతని అనుచరులు, 2016).
  • కలబంద ఒక శక్తివంతమైన మొక్కల పెరుగుదల కారకం. కలబంద బయట పొరలో ఆంత్రాక్వినోన్ గ్లైకోసైడ్ మిశ్రమాలు “అలాయిన్స” వుంటాయి. అలాయిన్ వాల్లబీస్, కంగారూలు, ఎలుకలు, పంటలను తినకుండా వికర్షిస్తుంది.
  • కలబంద క్రూడ్ ద్రావణం ఈగల లార్వాలను సమర్ధవంతంగా నివారిస్తుంది (జెసిఖ, 2012)
  • కలబంద ద్రావణం వగరు రుచి కలిగి ఉండటం వలన పురుగులను వికర్షిస్తుంది కాని చంపదు (మెలెస్, అతని అనుచరులు, 2012).
  • కలబంద గుజ్ౙు (జెల్) డ్రెష్లరా హవాయిఎన్సిస్, ఆల్టర్టేరియా ఆల్టర్నేట శిలీంద్రపెరుగుదలను పూర్తిగా అరికడుతుంది (సితార, ఆమె అనుచరులు, 2011).
  • 4 కి. కలబంద { 500 మి.లీ. వేపనూనె { 500 మి.లీ. పొగాకు పొడి కషాయం 20 లీ. నీటికి కలిపి 3 నుండి 4 గంటలు మరగబెట్టాలి. కుండలో నీరు 5 లీ. మిగిలినపుడు చల్లార్చి, వడపోయాలి. ఈ కషాయాన్ని ప్రత్తి, బెండ మొదలగు పంటలపై పిచికారి చేసి పొగాకులద్దె పురుగు, శనగపచ్చ పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు. ఈ జీవ పురుగు మందుకి “నీకుంచి (వేప{కలబంద{పొగాకు పొడి డికాక్షన్)” అని పేరు పెట్టారు. 100 నుండి 150 మి.లీ. కషాయాన్ని 15 లీ. నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. 10 రోజుల తర్వాత ఇంకొకసారి పిచికారి చేయాలి. (రజనీకాంత్ భాయ్ పటేల్, గుజరాత్ రైతు, 2001).
  • అలో ఫెరాక్స్‌ని పంటల చుట్టూ జీవకంచెగా నాటితే పంటలనాశించే పురుగులను వికర్షిస్తుంది.
  • అలో మార్లోతి ఆకుబూడిద (5%)ని మొక్కజొన్న లేదా అలసంద గింజలపై చల్లి నిల్వ సమయంలో ఆశించే పురుగులను వికర్షింపవచ్చు.
  • 5 కి. కలబందను ముక్కలుగా చేసి 1 కి. పొగాకు పొడి కలిపి 3 లీ. నీటిలో కలిపి మరిగించి చల్లార్చి, వడపోసి 2 లీ. పుల్లటి మజ్ౙిగ కలిపి 100 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఇది జీవ పురుగు వికర్షిణిగా పనిచేస్తుంది.

ఐ.పి.యం రెసిపి1 :

  • 4.5 లీ. నీరు, 1 చెంచా వేపనూనె, 12 చెంచాలు 78% పొటాషియం సిలికేట్ ద్రావణం, 15-30 మి.లీ. యూకలిప్టస్/ జింజర్/ లెమన్‌గ్రాస్/ థైమ్/ క్లోవ్/సిన్నమోన్/పెప్పర్‌మింట్, 1/4 కప్పు అలోవిరా రసం
  • వేపనూనె నీటిలో కరగడానికి 12 చెంచాల పొటాషియం సిలికేట్ ద్రావణం కలపాలి. ఈ మిశ్రమాన్ని వారానికొకసారి పిచికారి చేసి పురుగులను నివారించవచ్చు. వారం వారం ఎసెన్షియల్ మార్చి వాడాలి.

ఐ.పి.యం. రెసిపి2 :

  • 4.5లీ. నీటిలో 2 చెంచాల కలబంద గుజ్ౙు కలిపి 24 గంటలుంచాలి. తర్వాత వడపోసి పిచికారి చేయాలి.
  • ఈ రెసిపీలలో నీటికి బదులు ‘బొటానికల్ టీ’ని కూడా ఉపయోగించవచ్చు. ఈ టీని తయారు చేయడానికి లావెండర్, స్పియర్‌మింట్, పెప్పర్‌మింట్, ఒరిగానో, థైమ్, బోరేజ్, కామ్‌ఫ్రీ, యారో తాజా ఆకులను (2 కప్పులు) నూరి లీ. నీటిలో కలిపి 23 రోజులుంచాలి. మధ్యమధ్య ఈ ద్రావణాన్ని కలుపుతుండాలి. తర్వాత వడపోసి పై రెసిపిలను తయారు చేయడానికి నీటికి బదులు దీనిని ఉపయోగించాలి.
  • కలబంద ద్రావణం కోత అనంతరం పండ్లను ఆశించి కుళ్ళజేయు పెనిసిలియం డిజిటేటం, పెనిసిలియం ఎక్స్‌పాన్సమ్, బోట్రైటిస్ సినరియా, ఆల్టర్నేరియా ఆల్టర్నేటపై శిలీంద్రనాశక చర్యను ప్రదర్శించింది (బార్కాయ్‌గోలన్, 2001)
  • పురుగులు, తెగుళ్ళ నివారణకు కలబందనుపయోగించి హెర్బల్ టీ తయారు చేసి ఉపయోగించవచ్చు.

తయారీకి కావలసిన పదార్థాలు : 200 లీ. ప్లాస్టిక్ డ్రమ;్ గ్రైండర్ / చాపర్, రోలు, పత్రం; స్ట్రెనర్ / స్క్రీన్ / గుడ్డ; కొయ్యకర్ర; తాజా శుభ్రమైన నీరు;

మొక్కల పదార్థాలు : 10 కి. అల్లం, 5 కి. వెల్లుల్లి, 5 కి. కలబంద, 10 కి. మిర్చి, 30 కి. వేపఆకులు, 30 కి. కోకోఆకులు, 5 కి. డెర్రిస్, 5 కి. మకాబుహే, కీటకనాశన, శిలీంద్రనాశక వికర్షణ లక్షణాలున్న ఇతర మొక్కలు.
పైన పేర్కొన్న ఆకులను విడివిడిగా నూరాలి.

తయారు చేసే విధానం : నూరిన ఆకులను ప్లాస్టిక్ డ్రమ్ములో వేయాలి. డ్రమ్ములో నీరు నింపాలి. డ్రమ్ములోని పదార్థాలన్నింటినీ కర్రతో కలియత్రిప్పాలి.

హెర్బల్‌టీ తయారవడానికి ఒకరోజు నిల్వఉంచాలి. డ్రమ్‌లోని హెర్బల్ టీని వడపోయాలి. హెర్బల్‌టీకి సమానంగా నీరు కలపాలి. స్ప్రేయర్‌లో నింపి పంటపై పిచికారి చేయాలి. మొక్కలపైన పిచికారి చేయాలి. మొక్కల మొదళ్ళలో డ్రెంచింగ్ చేయాలి. అవసరాన్ని బట్టి 3 లేదా 7 రోజుల కొకసారి మొక్కలపై పిచికారి చేయాలి. క్యాబేజిలో డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లా క్ౙెåలోస్టెల్లాని వేపగింజ పప్పు (నీమ్ సీడ్‌కెర్నల్) + కలబంద+జిల్లేడు+క్లీరోడెండ్రాన్ ఆకు ద్రావణం మరియు వేపకాయలు+ ఎర్రమిరప+సీతాఫలం ఆకు ద్రావణం సమర్థవంతంగా నివారించాయి. (చంద్రశేఖరయ్య అండ్ సన్నవీరప్పనవర్, 2013).

ప్రత్తి, చామంతి పంటలలో పురుగుల నివారణకు కానుగ{కలబంద{వేప ద్రావణం పిచికారి చేయాలి. దీని తయారీకి 1కి. కానుగ చెక్కపొడి, 1 కి. వేప చెక్క పొడి, 250 గ్రా. విషముష్టి గింజలను ఒక మస్లిన్ సంచిలో వేసి ఒక రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మర్నాడు ఉదయం సంచిని పిండి రసాన్ని సేకరించాలి. దీనిని అరలీటరు కలబంద ఆకు రసంతో కలపాలి. దీనికి 15 లీ. నీరు కలపాలి. దీనిని మరలా 23 లీ. ఆవుమూత్రంతో కలపాలి. పిచికారి చేసేముందు 1 లీ. మిశ్రమాన్ని 10 లీ. నీటిలో కలపాలి. ఎకరానికి 60-100 లీ. పిచికారి ద్రావణాన్ని ఉపయోగించాలి (శాయికట్‌మన్నా)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

భూమిలో సేంద్రియ కర్బనం పెంపుకు ‘రామబాణం’

విపరీతమైన రపాయనాల వాడకం వల్ల భూమిలో సేంద్రియ కర్బనం విపరీతంగా తగ్గిపోయింది. పత్తిపాటి రామయ్య బెంగుళూరు వైదిక విజ్ఞాన వర్సిటీలో పి.హెచ్.డి. చేసి “రామబాణం” అనే వ్యాసాన్ని ప్రచురించారు. అది 40 రోజుల ప్రోగ్రాం. చిత్తూరు జిల్లా రైతు మునిరత్నం నాయుడు రామబాణాన్ని తయారు చేసి తన భూమిలో వేసిన తర్వాత 0.5 ఉండే సేంద్రియ కర్బనం 0.75 కి పెరిగింది.

తయారు చేసే విధానం

  • మొదటి రోజు రెండున్నర కిలోల అల్లం, రెండున్నర లీటర్ల నీటితో కలిపి బాగా రుబ్బి ఒక కుండలో పోయాలి. పోసిన తరువాత గుడ్డతో కుండని కట్టాలి. కుండను గుంతలో పెట్టి మట్టి కప్పాలి.
  • ఆరవ రోజు ఉదయం 4 కి. ఆవుపేడ, 4 లీ. నీటితో కలిపి కుండకి గుడ్డకట్టి గుంతలో పెట్టాలి.
  • మొదటి రోజు పూడ్చిన అల్లం ద్రావణం కుండను 6వ రోజు సాయంత్రం 4 గంటలకు గుంతనుండి బయటకు తీసి అల్లం ద్రావణాన్ని 200 లీ. నీటిలో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
  • 11వ రోజు సాయంత్రం 6వ రోజు గుంతలో ఉంచిన ఆవుపేడ ద్రావణాన్ని బయటకు తీసి 200 లీ. నీటిలో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
  • 16వ రోజు 8 కి. బెల్లం 8 లీ. నీటిలో కలిపి కుండను గుంతలో పెట్టి మట్టి కప్పాలి. అదే రోజు 3 లీ. ఆవుమూత్రాన్ని 200 లీ. నీటిలో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
  • 21వ రోజు 21/4 కి. ముడి ఇంగువ 21/4 లీ. నీటిలో కలిపి కుండను గుంతలో పెట్టి మట్టి కప్పాలి. 16వ రోజు గుంతలో పెట్టిన బెల్లం ద్రావణాన్ని 200 లీ. నీటిలో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
  • 26 వ రోజు 4 కి. శనగపిండి 4 లీ. నీటిలో కలిపి కుండను గుంతలో పాతిపెట్టి మట్టి కప్పాలి. 21వ రోజు గుంతలో పెట్టిన ఇంగువ ద్రావణాన్ని 200 లీ. నీటిలో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
  • 31వ రోజు ఒకటిన్నర కిలోల ఆవుపెరుగు ఒకటిన్నర లీటర్ల నీటిలో కలిపి కుండను గుంతలో పాతి పెట్టి మట్టి కప్పాలి. 26వ రోజు పాతిపెట్టిన శనగ పిండిద్రావణాన్ని 200 లీ. నీటితో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
  • 36వ రోజున 31వ రోజున కుండలో ఉంచిన ఆవు పెరుగు ద్రావణాన్ని 200 లీ. నీటిలో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
  • అప్పటికి రామ బాణం ప్రయోగం పూర్తవుతుంది. తరువాత పొలాన్ని నాగలితో దున్నుకుని పైరు పెట్టుకుంటే సేంద్రియ కర్బనం 0.5 నుండి 0.75కి పెరిగి ఉంటుంది.
Read More

మొక్కకు పోషకాలనందించే సస్యామృతం

వివిధ రకాల ఔషధ మొక్కలు, ఆవు పేడ ఆవు మూత్రంలో పులియబెట్టడం ద్వారా దీనిని తయారు చేసుకోవచ్చు.

ప్రయోజనాలు : ఇది మొక్కకు పోషకాలను అందించడమే కాకుండా కీటకాలు, తెగుళ్ళను నివారిస్తుంది.

 తయారీకి కావలసిన పదార్థాలు : ఆవు పేడ - 30-40 కి.; ఆవు మూత్రం - 5 లీ.; పాలుకారే మొక్కల (పాలకొడిశ, జిల్లేడు, జట్రోఫా, బొప్పాయి మొదలైనవి) ఆకులు - 5 కి.; ఘాటైన వాసనగల మొక్కల (వయ్యారిభామ, అత్తాకోడలు, తంగేడు తదితరాలు) ఆకులు - 5 కి.; నూనె గింజల చెక్క (వేరుశనగ, ఆముదం, కానుగ, నువ్వులు, వేప) చెక్కలో ఏదైనా - 2 కి.; బెల్లం - 1కి.; నువ్వులు, కంది లేదా పొగాకు కట్టెలు కాల్చిన  బొగ్గు లేదా పిడకబూడిద; నీరు - 100 లీ.; పై పదార్థాలన్నీ పట్టే ప్లాస్టిక్ డ్రమ్ము లేదా తొట్టి. 

తయారీ విధానం :

  • ముందుగా సేకరించిన ఆకులను తరిగి పెట్టుకోవాలి.
  • వీటిని ఆవుపేడ, మూత్రాలతో కలిపి డ్రమ్ములో వేసుకోవాలి.
  • దీనికి నూనె చెక్క బూడిద, బెల్లం కలపాలి.
  • డ్రమ్ములో వేసిన ఈ పదార్థాలను రోజు కలుపుతూ ఉండాలి.
  • తొట్టి లేదా డ్రమ్ము పై గోనె పట్టా కప్పి వుంచాలి.
  • వారం రోజుల్లో పూర్తిగా పులిసిపోయిన తర్వాత తయారైన ద్రావణాన్ని వడపోయాలి. ఆకులు, ఇతర పదార్థాల పిప్పి ఏదైనా మిగిలి వుంటే మొక్కలకు మల్చింగ్గా ఉపయోగించాలి.
  • తయారైన ద్రావణాన్ని ఎకరాకు 200 లీటర్లు డ్రిప్పు ద్వారా లేదా కాలువ ద్వారా పారించాలి.
  • మొక్కల పూత, కాత, గింజకట్టే దశల్లో 5 శాతం ద్రావణాన్ని పిచికారి చేయాలి.
Read More

పచ్చని డాబా… ఆరోగ్యానికి బాట

పట్టణ ప్రాంతాలలో, జనాభా పెరుగుదలతో ఎక్కువ భూమి ఇంటి నిర్మాణానికి వినియోగించబడుతుంది. అందువలన కూరగాయలను పండించడానికి భూమి దొరకడం కష్టంగా మారింది. ప్రత్యేకంగా కుండీలను, కంటైనర్లను ఉపయోగించి పండ్ల మొక్కలను, కూరగాయలను ఇంటి ఖాళీస్థలంలో లేదా డాబాపై పెంచుకోవడం ఒక్కటే మార్గం. నలుగురు సభ్యులున్న కుటుంబానికి సరిపడే కూరగాయలను పండించడానికి 40-50చ.మీ. స్థలం సరిపోతుంది. కంటైనర్లలో మట్టిని సంవత్సరానికొకసారి మార్చాలి. పాటింగ్ మిశ్రమంలో మట్టి, ఇసుక, వేపపిండి, జీవన ఎరువులు సరైన పాళ్ళలో ఉండాలి. పెరటిలోను, ఇంటి పైకప్పుపైనా మొక్కలు సాగు చేసుకోవచ్చు. సేంద్రీయ ఎరువులతో కూరగాయలు, పండ్లు పండించి ఆరోగ్యంతో పాటు మానసిక ఆనందంపొందవచ్చు.

ఇంటి మిద్దెపై ఒక సెంటు స్థలం ఉన్నప్పటికీ ఇంటికి సరిపడా కూరగాయలు చాలా సులువుగా సాగు చేసుకోవచ్చు. పురుగు మందుల అవశేషాలు లేని చక్కని రుచికరమైన కూరగాయలన్నింటినీ స్వయంగా పండించవచ్చు.

మిద్దె తోటలో మొక్కల పెంపకము వల్ల లాభాలు: మిద్దె తోటలో మొక్కల పెంపకం ద్వారా ఏడాది పొడవునా పురుగు మందుల అవశేషాలు లేని తాజా ఉత్పత్తులు లభిస్తాయి. ఆహార, ఆరోగ్య భద్రత పొందవచ్చు. పచ్చదనాన్ని పెంపొందించడంతో ప్రాణవాయువు పెరిగి, గాలిలో హానికర బొగ్గుపులుసు వాయువు తగ్గుతుంది. ఉత్పత్తులు నాణ్యంగా పోషకాలతో నిండి ఉంటాయి. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. ఇంటి పై మిద్దె తోటలో మొక్కల పెంపకం వలన మంచి వ్యాయామం లభిస్తుంది. పండ్ల, కూరగాయల ఖర్చు తగ్గుతుంది. స్థలం, అపార్టుమెంట్ల విలువ పెరుగుతుంది. పైగా ఈ మిద్దె తోటల పెంపకం వలన వేసవిలో ఉష్ణోగ్రతలను కొంతవరకు తగ్గించుకోవచ్చు.

మిద్దె తోటను ఏర్పాటు చేసుకునే విధానం : పీవీసీ పైపులతో స్టాండ్లు ఏర్పాటు చేసుకొని, వాటిపై ఖాళీ ప్లాస్టిక్‌ డబ్బాలు పెట్టాలి. ఆ ఖాళీ డబ్బాల్లో ఎర్రమట్టి, వర్మీ కంపోస్టు, పశువుల పేడ నింపాలి.

మిద్దెపై వార్షిక కూరగాయల మరియు పండ్ల మొక్కల పెంపకం యొక్క ప్రణాళిక: మొక్కల పెంపకం చేపట్టే ముందు ప్రణాళిక తయారు చేసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ డాబాపై పెంచుతున్నదైతే ముందుగా ఇంజనీరు చేత డాబా పైకప్పు గట్టిదనాన్ని పరీక్షింపజేయాలి. అంటే మన ప్రణాళిక ప్రకారం కూరగాయలు, పండ్లు మొదలైనవి పెంచడానికి తట్టుకోగలదో లేదో పరీక్షించాలి. పైకప్పు కారకుండా ఉండాలి. మురుగు నీటి పారుదల సౌకర్యం తప్పని సరిగా ఉండాలి. ప్రణాళికబద్ధంగా మొక్కలను నాటాలి. కుండీల్లో నింపే మిశ్రమం తేలికపాటి బరువు కలిగి ఉండాలి. మొక్కలను పెంచడానికి ఎత్తైన మడులను ఏర్పాటు చేయాలి. ట్రెల్లీస్ ఏర్పాటుచేసి తీగలు పారించాలి. డాబాలపైన, బాల్కనీలలోనూ పెరిగే మొక్కలు ఎక్కువ గాలికి, ఎక్కువ వేడికి గురవుతాయి. ఎత్తులో అమర్చిన కుండీలు ఒకే వరుసలో ఉండాలి. వీటిని తేలికపాటి మట్టి మిశ్రమంతో నింపాలి. మట్టి మిశ్రమంతో నింపక ముందు సరైన మురుగునీటి పారుదల సౌకర్యం ఏర్పాటుచేయాలి. షేడ్ నెట్ కాని, పందిరికాని ఏర్పాటుచేసుకొని ఏడాది పొడవునా వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు మరియు పూలను కూడా పెంచుకోవచ్చు.

కుండీల ఎంపిక: కుండీలను ఎంచుకునేటప్పుడు మురుగునీరు పోవడానికి రంధ్రాలున్న వాటినే ఎంచుకోవాలి. కుండీలలోపల వైపు మెరుపులేని కుండీలు ఎంచుకోవాలి. మెరుపు ఉంటే సీసం, మట్టి మిశ్రమంలో కలుస్తుంది. కుండీలను బంకమట్టితో, ప్లాస్టిక్, చెక్క లేదా లోహంతో తయారుచేస్తారు. కుండీల ఎంపికలో మొక్కలు పెరిగే ఎత్తును కూడా దృష్టిలో ఉంచుకోవాలి.

తొట్టి/ప్లాస్టిక్ సంచులు: మనకున్న ఖాళీ స్థలాన్ని బట్టి కావలసినంత పొడవు 9-20″ లోతు సిమెంట్ తొట్లు నిర్మించుకొని /ప్లాస్టిక్ సంచులు ఉపయోగించుకొని మట్టి మిశ్రమాన్ని (2 భాగాలు ఎర్రమట్టి + 1 భాగం ఇసుక + 1 భాగం కంపోస్టు) నింపుకొని పండ్లు, కూరగాయల పంటలను పెంచుకోవచ్చు. పై అంచునుండి అంగుళం ఖాళీని నీరు పెట్టడానికి వీలుగా వదలాలి.

మట్టి కుండీలు: కుండీల ప్రక్క నిలువుగాను, పైభాగం వెడల్పుగాను ఉంటుంది. ఇటువంటి కుండీలలో ఎక్కువ మట్టి, ఎరువుల మిశ్రమాన్ని నింపవచ్చు.

ప్లాస్టిక్ కుండీలు: గుండ్రంగా, చదరంగా ఉన్న ప్లాస్టిక్ కుండీలను ఇంటిలో పెరిగే మొక్కలను పెంచడానికి ఉపయోగిస్తారు. ఇవి తేలికగా మరియు రంధ్రాలు కలిగి తిరిగి వాడుకోవడానికి అనువుగా ఉండి తక్కువ స్థలంలో నిల్వచేసుకోవడానికి వీలుగా ఉంటాయి.

కుండీలు నింపే పద్ధతి: మిద్దె తోటల పెంపకంలో మట్టి అతి ముఖ్యమైనది. మంచి మట్టి వాడితే మొక్కలు బాగా పెరుగుతాయి. మార్కెట్లో అనేక పాటింగ్ మిశ్రమాలు లభిస్తాయి. 3 భాగాల కంపోస్ట్ లేదా కంపోస్టు ఎరువును ఒక భాగం తేలిక బరువున్న పీట్ తో కలిపి పాటింగ్ మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. నాటే కూరగాయలకు నారు మొక్కల పెంపకానికి లోతు తక్కువ పళ్ళాలను /తొట్లను మట్టి, ఇసుక, కంపోస్ట్ (1:1:1) మిశ్రమంతో కలిపి విత్తనాలను చల్లాలి. మట్టి మిశ్రమాన్ని తొట్లు/బారిల్స్/బకెట్లు/ప్లాస్టిక్ సంచుల్లో నింపే ముందు వాటి అడుగున నీరుపోయే రంధ్రాన్ని ఏర్పర్చాలి. తొలుత నీరుపోయే రంధ్రాన్ని చిన్న చిన్న పెంకులతో కప్పాలి. దీని వలన నీరుపోయే రంధ్రం గుండా మట్టి మిశ్రమం జారిపోకుండా అదనపు నీరు మాత్రమే బయటకు పోతుంది. ఆ తర్వాత గరుకు ఇసుక పోసి సమం చేయాలి. దానిపై ఒక అంగుళం మందంతో ఎండుటాకులు లేదా కొబ్బరి పొట్టు పరిచి దానిపై మట్టి మిశ్రమాన్ని అంచువరకు నింపాలి. ఇంటి మేడపైన మొక్కలు పెంచే కంటైనర్లను ఒక పద్ధతిలో ఉంచాలి. నీరు పోయడం, కలుపు తీత అంతరకృషి కాయ/ఆకు కోతకు అనువుగా మనిషి నడిచేందుకు వీలుగా దారి వదలాలి. మిద్దెపై చుట్టూ ఉండే పెరాపెట్ గోడపై 6 అడుగుల దూరంలో ఇనుప చువ్వలు నాటి వాటికి ట్రెల్లీస్ లా బైండింగ్ వైర్ అల్లించాలి. వాటిపైకి తీగజాతి కూరగాయల్ని పాకించి, నిలువు స్థలంలోను ఫలసాయం పొందవచ్చు.

ఎరువుగా ఇంటి వ్యర్థాలు: మొక్కల ఎండిన ఆకులను తొలగించి ఓ బకెట్‌లో నిల్వ ఉంచాలి. కూరగాయల వ్యర్థాలను సైతం అందులో వేయాలి. వాటిపై కొద్దిగా మట్టి వేసి ఆవు మూత్రం చల్లితే కంపోస్టు ఎరువు వాటంతట అదే తయారవుతుంది. రోజూ కొంత సమయం కేటాయించగలిగితే కుటుంబానికి అవసరమైన కాయగూరలు, ఆకు కూరలు, పండ్లు డాబా పైనే పండించుకోవచ్చు.

డా. పోతురాజు ప్రదీప్ కుమార్, డా. మీగడ లక్ష్మి కమల, డా. యల్లపు రామ్ మోహన్
డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకట్రామన్నగూడెం. Ph: 9160477365

Read More

ఔషధ మొక్క… చెంగల్వకోష్టం

ఐలాంతస్ ఒక ఆకులు రాల్చే వేగంగా పెరిగే చెట్టు. పెద్ద చెట్లు 80 అడుగుల ఎత్తు పెరుగుతాయి. ఇది నున్నని కాండం, పాలిపోయిన బూడిద రంగుబెెరడు కలిగి ఉంటుంది. కాడలు లేత చెస్ట్‌నట్ గోధుమ రంగులో వుంటాయి. పెద్ద కాంపౌండ్ ఆకులు 1-4 అడుగుల పొడవుండి, ఒక దాని తర్వాత ఒకటి ఏర్పడుతుంది. ప్రతి పెద్ద ఆకు 10-41 చిన్న అకులు కలిగి వుంటుంది. ప్రతి చిన్న ఆకు అడుగు అంచున ఎక్కువ గ్రంథులు గల పళ్ళను కలిగి ఉంటుంది. ఆకుల అంచులు పూర్తిగా పళ్ళు లేకుండా ఉంటాయి. ఐలాంతస్‌లో మగ, ఆడ పూలు వేర్వేరు చెట్లలో ఏర్పడతాయి. పూలు పెద్ద గుత్తులలో ఏర్పడతాయి. పూలు చిన్నవిగా, పాలిపోయిన పసుపు నుండి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. బల్లపరుపు, మెలి తిరిగిన రెక్కలున్న కాయలు ఆడ చెట్లపై ఏర్పడతాయి ప్రతి కాయ ఒకే గింజను కలిగి ఉంటుంది. ఇవి చెట్లపై చాలా కాలముంటాయి. కొయ్య మొత్తగా, బలహీనంగా, క్రీంతో కూడిన తెలుపు నుండి లేత గోధుమ రంగులో ఉంటుంది. చెట్టు అన్ని భాగాలు ప్రత్యేకంగా ఆకులు, పూలు కాల్చిన గింజ వాసన కలిగి ఉంటాయి.

సాధారణ నామం : ఐలాంతస్ / గ్రీఆఫ్ హోవెన్ శాస్త్రీయ నామం : ఐలాంతస్ ఆల్టిస్సిమ కుటుంబం: సీమరూబేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • కాండం, వేరు ఎండిన బెరడుని ఔషధంగా ఉపయోగిస్తారు. ఐలాంతస్ చెట్టుని డయేరియా, ఆస్త్మా, మూర్ఛ రోగం, పోట్లు, వేగంగా గుండె కొట్టుకోవడం, గనోరియా, మలేరియా, టేప్ వర్మ్స్ చికిత్సలో ఉపయోగిస్తారు. దీనిని టానిక్‌గా కూడా ఉపయోగిస్తారు.
  • చైనాలో ఈచెట్టు బెరడుని డిసెంట్రి, ఇతర కడుపులో సమస్యల చికిత్సకు ఉపయోగిస్తారు. ఈ హెర్బల్ ద్రావణాన్ని త్రాగటం వలన 82 డిసెంట్రిరోగులలో 81 మందిలో డిసెంట్రి నివారించబడింది.
  • వేరు బెరడు టింక్ౘ్రుని కార్డియక్ పాల్పిటేషన్స్, ఆస్త్మా, మూర్ఛరోగం నివారణలో విజయవంతంగా ఉపయోగిస్తారు. ఆకులు, కాండం బెరడు, వేర్లను అల్సర్లు, దురదల చికిత్సలకు ఉపయోగిస్తారు. కొరియాలో వేరు బెరడుని దగ్గు, గ్యాస్ట్రిక్, ప్రేవులలో సమస్యల చికిత్సకు ఉపయోగిస్తారు.కాయలను డిసెంట్రి చికిత్సలో ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • ఐలాంతస్ నుండి తయారు చేసిన ద్రావణాలు అకారిసైడల్ చర్యలను కలిగి వుండి టెట్రానికస్ టెలోరియస్‌ని సమర్థవంతంగా చంపాయి (కోవ్‌టనెంకో, అతని అనుచరులు)
  • ఐలాంతస్ వేరు ద్రావణం నుండి వేరుచేసిన ఐలాంతోన్ బఠాణి పంటనాశించే పేనుబంక, అనిర్టోనిఫాస్ పైసంని అత్యధికంగా చంపింది (డిఫియో, అతని అనుచరులు, 2009)
  • ఐలాంతస్ ఆకు ద్రావణం నుండి వేరుచేసిన ఐలాంతోన్ హెర్బిసైడల్ చర్యను ప్రదర్శించి ఆల్ఫాల్సా (మెడికాగోసటైన) విత్తనాలను మొలకెత్తకుండా చేసింది. భవిష్యత్తులో ఐలాంతోస్‌ని ఒక సహజ ఉత్పత్తి కలుపుమందుగా ఉపయోగించవచ్చు. (బార్బారాస్లాడోంజ, అతని అనుచరులు, 2014).
  • ఐలాంతస్ ద్రావణం నుండి వేరు చేసిన క్వాసినాయిడ్స్ (అలియాంతోన్, చపార్రినోన్, గ్లాకారూబినోన్, 13 (18) డిహైడ్రోగ్లాకారూబినోస్, షినుజాలాక్టోన్ హెచ్ స్పోడోప్టెరా లిట్టొరాలిస్‌పై తీవ్ర విషప్రభావం, ఆహారాన్ని తీసుకోవడాన్ని అరికట్టడం ద్వారా అధిక సమర్ధవంతంగా చంపాయి. ఐలాంతస్ ఆకుల మిథనాల్ ద్రావణాలను సీతాకోకచిలుక జాతుల లార్వాలను నివారించే వృక్షసంబంధ పురుగుమందులను వృద్ధి చేయడానికి ఉపయోగించవచ్చని ఫలితాలు వెల్లడించాయి (పవేల, అతని అనుచరులు, 2014).
  • ఐలాంతస్ క్యూలెక్స్ క్వింక్విఫాసియేటస్‌పై లార్విసైడల్ ప్రభావాన్ని చూపింది. (పవేల, 2009, జేబ్రి అండ్ బాలియోఅమర్, 2014). ఐలాంతస్ బెరడు నూనె ట్రైబోలియం కాస్టానియం, ఒరైజీఫిలస్ సురినామెన్సిస్, సైటోఫిలస్ ఒరైజే, లైపోసెలిస్ పీట పెద్ద పురుగులను గణనీయంగా వికర్షించింది.
  • ఐలాంతస్ బెరడు నూనె సైటోఫిలస్ ఒరైజెపై బలమైన స్పర్శ, విషపూరిత చర్యను కూడా ప్రదర్శించింది. అంతేగాక, ఐలాంతస్ బెరడునూనె ఒరైజీఫిలస్ సురినామెన్సిస్, సైటోఫిలస్ ఒరైజెలపై ఫ్యూమిగెంట్ చర్యను కూడా ప్రదర్శించింది (లు అండ్ ఉ, 2009).
  • ఐలాంతస్ ముదిరిన చెట్లు ఒకటి లేదా ఎక్కువ విత్తనాలు మొలకెత్తడం, మొక్కలు పెరగడాన్ని అరికట్టే శక్తివంతమైన కాంపౌండ్స్‌ని ఉత్పత్తి చేస్తాయి. అరికట్టే చర్య వేర్ల బెరడులో ఎక్కువగాను, ఆకులలో మధ్యమంగాను, కొయ్యలో తక్కువగాను ఉంటుంది. వేరు బెరడులోని అరికట్టే పదార్థాలు మొక్కలు మొలవక ముందు, మొలచిన తర్వాత పిచికారి చేసినపుడు బలమైన హెర్బిసైడల్ ప్రభావాలను చూపాయి. మొక్కలు మొలిచిన తర్వాత పిచికారి చేస్తే ప్రభావాలు గణనీయంగా ఉంటాయి. ఐలాంతస్‌లోని అల్లెలో కెమికల్స్ శక్తివంతమైన సహజ ఉత్పత్తి కలుపు మందులను అభివృద్ధి చేయగల సామర్థ్యమున్నవని ఫలితాలు వెల్లడించాయి (హెల్సె, 1990)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

పశుపోషణలో మునగ ప్రాముఖ్యత

మన దేశంలో ప్రాచీనకాలం నుండి ప్రకృతిలో సహజంగా లభించే అనేక రకాలయిన చెట్లకు, వాటి ఆకులు, కాయలు, వేర్లు మరియు ఇతర భాగాలకు వైద్యపరంగా చాలా ప్రాముఖ్యతను ఇస్తున్నాము. కొన్ని రకాల మొక్కలకు ప్రత్యేక ఔషధ గుణాలు ఉండట, మరికొన్ని రకాల మొక్కల్లో మాంసకృత్తులు, విటమిన్లు మరియు ఖనిజ లవణాలు అధిక మోతాదులో ఉండటం వలన వీటి వినియోగం ఇటు మానవ మనుగడలోనే గాక, అటు పశువైద్యంలో కూడా గణనీయంగా పెరిగింది. నేటి కాలంలో పూల మొక్కల నుండి అటవీ వృక్షాల వరకు, వాటిలో ఉండే ఔషధ విలువలు మరియు ఆరోగ్యానికి అవి చేసే మేలు, వాటి ఇతర భాగాల్లో ఇమిడి ఉండే పోషక పదార్థాల గురించి అన్ని కోణాల్లో అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.

ప్రకృతి మనకు అందించిన అత్యంత పోషక విలువలు ఉన్న మొక్క ‘మునగ’. ‘పోషకాల గని’గా పేరొందిన మునగ అటు మానవ మనుగడలోనేగాక, పశుపోషణలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. మునగ చెట్టు యొక్క ఆకులు, కాయలు, విత్తనాలు మరియు ఇతర భాగాల్లో మాంసకృత్తులు, పిండిపదార్థాలు మరియు విటమిన్లు, ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి.

మునగ సాగు – వివరాలు:
మునగ సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. నేలల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా చూసుకోవాలి. జులై మొదటి వారం నుండి అక్టోబర్, చివరి వారం వరకు మునగను విత్తుకోవచ్చు. పి.కే.యం-1, పి.కే.యం.2 వంటి రకాలను పెంచుకున్నట్లయితే అధిక దిగుబడి వస్తుంది. కావున పశువుల మేతకు ఈ రకాలు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఉష్ణోగ్రత 20-25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు మునగ ఏపుగా పెరుగుతుంది. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ఎక్కువగా పెరగకపోవచ్చు. కావున దిగుబడి అధికంగా ఉన్నప్పుడు మునగ ఆకులను సేకరించి, నీడలో ఆరబెట్టుకొని నిల్వ చేసుకొని ఎండాకాలంలో ఇతర ప్రశుగ్రాసాలతో కలిపి ఇవ్వవచ్చు.
ప్రత్యేకంగా పశుగ్రాసం కోసం మాత్రమే మునగను సాగు చేసుకోవాలనుకున్నప్పుడు మునగ విత్తనాలను సాళ్ళల్లో 3-5 సెం.మీ. లోతులో నాటుకోవాలి. రెండు సాళ్ల మధ్య దూరం 30 సెం.మీ. మరియు రెండు మొక్కల మధ్య దూరం 20 సెం.మీ. ఉండేవిధంగా చూసుకోవాలి. ఈ విధానంలో ఎకరాకు 25-35 కిలోల విత్తనం సరిపోతుంది. నాటిన రెండు వారాల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. విత్తనాలు ఎక్కువగా లేనప్పుడు మునగ కొమ్మలను కత్తిరించి కూడా నాటుకోవచ్చు. నాటిన తరువాత 3 నెలలకు మొదటి కోతను తీసుకోవచ్చు.

పోషక విలువలు:
పచ్చి మునగ ఆకుల్లో 16% మాంసకృత్తులు, 18% పీచుపదార్థాలు ఉంటాయి. ఎండిన ఆకులు లేదా పొడిలో 28% వరకు మాంసకృత్తులు, 15% పీచు పదార్థాలు, 3.65% కాల్షియం, 0.3% ఫాస్ఫరస్, 0.5% మెగ్నీషియం, 1.5% పొటాషియం, 8.25% కాపర్ ఉంటాయి. అంతేగాక జింక్, మాంగనీస్, ఐరన్ వంటి మూలకాలు అధిక మోతాదులో ఉంటాయి. పచ్చి మునగ ఆకుల్లో కొద్ది మొత్తంలో ‘సపోనిన’ అనే పదార్థాలు ఉండటం వల్ల కొద్దిగా చేదుగా ఉంటాయి. పచ్చి మునగ ఆకులను పాడి పశువులకు ప్రతీరోజు 5-10 కిలోల వరకు, దూడలకు 1-2 కిలోల వరకు ఇవ్వవచ్చు. ఎండిన మునగ ఆకులను లేదా మునగ పొడిని పాడి పశువులకు రోజుకు 200 గ్రాముల వరకు మరియు దూడలకు 50 గ్రాముల వరకు ఇవ్వవచ్చు.

ప్రయోజనాలు:

  • పశులు జీర్ణవ్యవస్థలో మీథేన్ అనే గ్యాస్ వెలువడుతుంది. పశువుల కడుపులో ఉండే మిథనోజెనిర్ బ్యాక్టీరియా ఈ గ్యాస్‌ని విడుదల చేస్తాయి. ఈ మీథేన్ గ్యాస్ పరిమాణం అనేది పశువులు తీసుకునే ఆహారాన్ని బట్టి విడుదలవుతుంది. పశువుల మేతలో మునగ ఆకును లేదా పొడిని ఇచ్చినట్లయితే ఈ బ్యాక్టీరియా సంఖ్య తగ్గి మీథేన్ గ్యాస్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. దీనివల్ల వాతావరణంలో కొంతమేర మీథేన్ గ్యాస్ విడుదల తగ్గి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుంది.
  • పాడి పశువుల్లో పాల దిగుబడి పెరగడమే కాకుండా, పాలల్లో వెన్నశాతం పెరుగుతుంది.
  • పశువులు, దూడల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • పాడిపశువులు ఈనిని తరువాత మళ్ళీ త్వరగా ఎదకు రావడం మరియు చూడికట్టడం వంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
  • కాల్షియం అధికంగా ఉండటం వలన ఎదిగే దూడల్లో ఎముకలు పటిష్టంగా తయారవుతాయి.
  • అనేక పోషకాలు ఉండటం వల్ల పశువుల్లో పునరుత్పత్తి సమస్యలు రాకుండా ఉంటాయి.

డా.డి. వెంకటేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్, పశుగణ సముదాయం, పశువైద్య కళాశాల, కోరుట్ల, ఫోన్: 9951534076

Read More

నేల సారవంతానికి ‘గార్బేజ్ ఎంజైమ్‌’

గార్బేజ్ ఎంజైమ్‌ను థాయ్‌లాండ్‌కి చెందిన డా. రోసుకాన్ ఆవిష్కరించారు.

తయారీవిధానం : కూరగాయలు, పండ్ల తొక్కలు, ముక్కలు, మార్కెట్లో చెత్త కుప్పలో వేసిన మిగలపండిన పండ్లు, కూరగాయల వ్యర్థాలకు కొంచెం నల్లబెల్లం లేదా మొలాసెస్ లేదా సేంద్రియ పంచదార కలిపి 90 రోజులు మురగబెడితే గార్బేజ్ ఎంజైమ్ తయారవుతుంది.

కావలసిన పదార్థాలు :

  • మూత బిగుతుగా పెట్టడానికి వీలుపడే గాజు లేదా ప్లాస్టిక్/ఫైబర్ డ్రమ్ము
  • కూరగాయలు, పండ్ల వ్యర్థాలు (తొక్కలు, మొక్కలు కుళ్ళినవి 3 పాళ్ళు)
  • నల్లబెల్లం లేదా మొలాసెస్ లేదా సేంద్రియ (బ్రౌన్) సుగర్ – 1 పాలు
  • నీరు Ð 10 పాళ్ళు

పైవాటినిన్నంటినీ బాగా కలపాలి. దుకాణాల్లో మిగిలిపోయిన, కుళ్ళిపోయిన కూరగాయలు, పండ్లను ముక్కలు చేసి కలపవచ్చు. మిగిలిపోయిన అన్నం, కూరలు కూడా కలపవచ్చు. ఈ మిశ్రమాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి గాలిచొరబడకుండా గట్టిగా మూత బిగించాలి. ఎండ తగులకుండా సాధారణ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచాలి. మొదటి 30 రోజుల పాటు, రోజుకోసారి మూత తీసి వాయువులు బయటికి వెళ్ళాక, మరలా గట్టిగా మూత బిగించాలి. ఆ తర్వాత 60 రోజుల పాటు మూత తీయనక్కర్లేదు. 90 రోజులకు గార్బేజ్ ఎంజైమ్ సిద్ధమవుతుంది. ద్రావణం పులియటం వల్ల తెల్లటి పొర ఏర్పడుతుంది. మొత్తం 90 రోజులు గడిచాక ద్రావణాన్ని వడపోసి నిల్వ చేసుకుని 60 రోజుల వరకు వాడుకోవచ్చు. వడపోతలో వచ్చిన వ్యర్థాలను ఎండబెట్టి మొక్కలకు ఎరువుగా వాడవచ్చు. లేదా మళ్ళీ గార్బేజ్ ఎంజైమ్ తయారీకి వాడవచ్చు.

ప్రయోజనాలు : దీనిలో ఉన్న సూక్ష్మ జీవరాశులు, ఔషధ గుణాలు నేలను సారవంతం చేస్తాయి. ఇది సహజ ఎరువుగా, కీటకనాశినిగా, శిలీంద్ర, బాక్టీరియా, వైరస్ తెగుళ్ళ నివారణిగా పనిచేస్తుంది. దీనిని వాడితే పంటల్లో నత్రజనిని గ్రహించే శక్తి పెరుగుతుంది. దీనిని నీటిలో తగినపాళ్ళలో కలిపి వాడుకోవాలి.

  • ఎరువుగా : 1:1000 పాళ్ళలో కలిపి నేలలో పోయవచ్చు. లేదా పంటలపై పిచికారి చేయవచ్చు.
  • పురుగులు / తెగుళ్ళ నివారణకు : 1:100 పాళ్ళలో కలిపి పిచికారి చేయవచ్చు.
  • దిగుబడి పెంచడానికి : 1:500 పాళ్ళలో కలిపి పిచికారి చేయాలి.
  • పశుపోషణకు, కోళ్ళ పెంపకానికి ఉపయోగించవచ్చు.
  • ఇల్లు, మరుగుదొడ్డి పరిశుభ్రతకు వాడవచ్చు.
Read More

మొక్కల ఆరోగ్యానికి ‘వర్మివాష్’

వర్మి వాష్ తయారీ విధానం: 200 లీ. డ్రమ్ముని తీసుకుని, దాని అడుగు భాగం నుండి కొంచెం పైన కుళాయి బిగించాలి. డ్రమ్ములోపల 15 సెం.మీ. వరకు ఇసుకపోసి, ఇసుకపై డ్రమ్ముపై వరకు ఎర్రమట్టి పోయాలి. దానిపైన పేడ, కూరగాయల వ్యర్థాలను వేసి వానపాములను వదలాలి. ప్రతిరోజూ డ్రమ్ములో 2 లీ. నీటిని పోస్తూ ఉండాలి. ఇలా 15 రోజులు చేసిన తర్వాత డ్రమ్ములోని నీటిని కుళాయి ద్వారా పాత్రలో సేకరించి 15 రోజుల కొకసారి మొక్కలపై పిచికారి చేయాలి. డ్రిప్ ద్వారా వారానికొకసారి పంపించాలి. దీనివలన మొక్కలు ఆరోగ్యవంతంగా పురుగులు, తెగుళ్ళు సోకకుండా పెరుగుతాయి.

Read More

ఔషధ మొక్క – పిండిదొండ

సాధారణ నామం : కొండపిండి/పిండికూర శాస్త్రీయ నామం : ఏర్వ లానాట కుటుంబం: అమరాంథేసి

పిండి దొండ కొయ్యలాంటి కాండం కలిగి భూమిపై ప్రాకే మొక్క లేదా మెత్తగా వుండే బహువార్షిక మొక్క. కొన్నిసార్లు మొక్క మొదటి సంవత్సరంలోనే పూతకు వస్తుంది. పిండిదొండ సాధారణంగా భారతదేశంలో అన్ని చదరపు ప్రాంతాలలో పెరిగే కలుపు మొక్క. దీనివేరు కర్పూరం వంటి వాసన కలిగి ఉంటుంది. దీని ఎండిన పూలను బ్యూకల్లాన్, బూర్‌పేర్లతో అమ్ముతారు. దశపుష్పాలు అనే పవిత్ర పూలలో ఇది ఒకటి. ఇది కొమ్మలు, కొయ్యలాంటి వేరు వ్యవస్థ కలిగిన వార్షిక మొక్క. కాండాలు ఎక్కువగా పక్కకు ప్రాకుతూ దూరంగా విస్తరిస్తాయి. కొన్నిసార్లు 6 అ. పొడవు వరకు విస్తరిస్తాయి. కాడలు లేని ఆకులు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడతాయి. అవి కోడిగుడ్డు ఆకారంలో 0.5 అం. నుండి 1.5 అం. పొడవుంటాయి. ఆకు ఆండానికి అతికి వుండేచోట నుండి రెండు లేదా మూడు పూలతో చిన్న గుత్తులు ఏర్పడతాయి. పూలు 0.1 అం. పొడవుతో పింక్, ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ రంగులలో ఉంటాయి.

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • వేర్లతో సహా మొక్క అన్ని భాగాలు వివిధ ఉపయోగాలు కలిగి ఉన్నాయి., ఇది మనుషులకు, పశువులకు ఆహారంగా ఉపయోగపడుతుంది.
  • మొక్క ఆకులు సూప్ తయారీలో లేదా ఆకుకూరగా ఉపయోగపడుతుంది. ఈ మొక్క పశువులు, కోళ్ళకు మేతగా పనికి వస్తుంది. ఈ మొక్క యాంటి మైక్రోబియల్ లక్షణాలు కలిగి చర్మవ్యాధుల కారకాల నుండి రక్షిస్తుంది., మూత్ర వర్థకంగా పనిచేస్తుంది.
  • నొప్పి, వాపు తగ్గించడానికి సహాయపడుతుంది. కడుపులోని పరాన్నజీవి నులి పురుగులను నివారిస్తుంది.
  • మొలల నుండి రక్తం స్రవించడాన్ని అరికడుతుంది. మూత్ర పిండాలు, గాల్‌బ్లాడర్‌లోని రాళ్ళను తొలగిస్తుంది. ఈ మొక్క ఒక ఔషధ టానిక్‌లా ఉపయోగపడుతుంది. జ్ఞానశక్తిని పెంచుతుంది. తలనొప్పి, కడుపునొప్పి, జీర్ణ సమస్యల చికిత్సకుపయోగిస్తారు. మెడ, వెన్నునొప్పులు, జ్వరం, మూత్ర సమస్యలను సమర్ధవంతంగా నివారిస్తుంది.
  • హెపటైటిస్, లివర్ వాపులను సమర్ధవంతంగా నివారిస్తుంది. అనీమియా, ఆల్ౙిమర్, ఆర్థ్రెåటిస్, కొలెస్టరాల్, ఊపిరితిత్తుల సమస్యలు, రక్తప్రసరణ వంటి ఆరోగ్య సమస్యల చికిత్సలో ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • పిండి దొండ ఆకుల బెంజీన్ ద్రావణం ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్ శిలీంద్ర పెరుగుదలను గరిష్టంగా అరికట్టింది. పూల బెంజీన్ ద్రావణం ట్రైకోస్పరా అసాహిపై యాంటిఫంగల్ చర్యను ప్రదర్శించింది. వేరు అసిటోన్ ద్రావణం కాండిడా పారాప్సిలాసిస్, ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ట్రైకోస్పరా అసాహి, మ్యూకార్ ఇండికస్‌పై ఆకులు, పూల ద్రావణాల కన్నా అధిక యాంటి ఫంగల్ చర్యలను ప్రదర్శించింది (విద్య అండ్ ఉదయకుమార్, 2017).
  • పిండిదొండ, అకలైఫా ఇండికా, ఫిల్లాంతస్ అమర ఆకుల మిథనాల్ ద్రావణాలు పంటలలో బాక్టీరియా తెగుళ్ళు కల్గించే క్ఖా0తోమోనాస్ కాంపెస్ట్రిస్, మానవులలో వ్యాధులు కలిగించే యూరోనోమస్ హైడ్రోపిలా బాక్టీరియాల పెరుగుదలను సమర్ధవంతంగా అరికట్టాయి (బ్రిట్టో, అతని అనుచరులు, 2011).
  • పిండిదొండ వేరు ద్రావణం శనగ పంటనాశించే రూట్‌నాట్ నెమటోడ్, మెలాయిడోగైన్ ఇన్‌కాగ్నిటాపై నెమటిసైడల్ చర్యను ప్రదర్శించింది (మురుగేశ్వరి, ఆమె అనుచరులు, 2016).
  • పిండిదొండ, అబుటిలాన్ ఇండికం, అకలైఫా ఫ్రక్టికోసా, అకిరాంథస్ ఆస్పెరా, అడతోడ జీలానిక, మారేడు, ఆల్బిజియా అమర్, ఆండ్రోగ్రాఫిస్ లినియేట, ఆండ్రాగ్రాఫిన్ పానిక్యులేట, వేప, బుడ్డకాకర, క్యాసియా టోరా, బిళ్ళగన్నేరు, ఉమ్మెత్త, జిమ్నెమ సిల్వెస్టర్, తురకవేప, ఆసిమం కానమ్, ఆసిమం సాంక్టమ్, పెర్గులేరియండీమియా, ప్లెక్ట్రాంతస్ కోలియాయిడెస్ సొలానంనైగ్రం, సొలానం సురెట్రెన్స్, సొలానం ట్రైలోబేటం, ట్రిబ్యులస్ టెర్రెస్ట్రిస్, వావిలాకుల నీటి ద్రావణాలను శనగపచ్చ పురుగు, హెలికోవర్పా ఆర్మిజెరా 6వ దశ లార్వాలపై యాంటీఫీడెంట్ చర్యను పరీక్షించారు. 6వ దశ లార్వాలో చావు శాతం ఈ క్రమంలో ఉంది. తురకవేప > వేప > సొలానం ట్రైలోబేటం > నేలవేము > మారేడు > ఆండ్రోగ్రాఫిస్ లీనియేట > సొలానం సురెట్రెన్స్ > బిళ్ళగన్నేరు > అడతోడ జీలానిక > అకలైఫా ఫ్రక్టికోసా > ఉమ్మెత్త > సొలానం నైగ్రం > ఆసిమం కానమ్ > ప్లెక్ట్రాంతస్ కోలియాయిడెస్ > ఆసిమం సాంక్టం > పెర్గులేరియా డీమియా > ఆల్బిజియా అమర > జిమ్మెమ సిల్వెస్టర్ > బుడ్డకాకర > వావిలాకు > వేప > కాసియా టోర > ట్రిబ్యులెస్ టెర్రెస్ట్రిస్ > ఉత్తరేణి > పిండిదొండ (రమ్య అండ్ జయకుమార్ రాజ్, 2009).
  • పిండిదొండ ద్రావణం చెరకు పంటలో నారు మొక్కల మాడుతెగులు, విత్తన మొలక శాతం తగ్గించే కర్వులేరియాల్యునేటని సమర్ధవంతంగా నివారించింది (నందిని అండ్ అంజనా, 2015).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు 9676797777కు సంప్రదించండి

Read More

సాగు ఖర్చును తగ్గించే ‘మట్టికుండ రసాయనం’

తయారీ విధానం – కావల్సిన వస్తువులు :

  • 100 గ్రాముల విటెక్స్ నెగుండ ఆకులు (వావిలాకులు)
  • 100 గ్రాముల కలోట్రాపిస్ ఆకులు (జిల్లేడు)
  • 100 గ్రాముల వేపాకులు
  • 50 గ్రాముల పప్పు (ఏదైనా)
  • 1 లీటరు పెరుగు లేదా చిక్కటి మజ్జిగ
  • 1.5 లీటర్లు మంచి నీరు ముందుగా మూడు రకాల ఆకులను మెత్తటి గంధంలా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెరుగులో కలపాలి. దీనికి నీరును చేర్చాలి. దీనిని ఒక కుండలో పోసి మూతికి గుడ్డ కట్టాలి. కుండలోని మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు తిర్లమర్ల కలపాలి (కుడి నుంచి ఎడమకు ఎడమ నుంచి కుడికి). పదిహేను, ఇరవై రోజుల తరువాత సేంద్రియ జీవ రసాయనం తయారవుతుంది. తయారైన జీవ రసాయనాన్ని 20 లీటర్ల నీటిలో కలిపి పొలం మీద పిచికారి చేయాలి. ఇది ఒక ఎకరా పొలానికి సరిపోతుంది. పిచికారీని ఆకుల మీదే చేయాలి. తెల్లవారుజామున లేదా సాయంత్రం పొద్దు గూంకే వేళలో పిచికారి చేస్తే సత్ఫలితాలు సాధించవచ్చు. ఇది వివిధ రకాల కీటకాలనాశినిగానే కాక మొక్కలకు పోషకాలను అందించి పెరుగుదలకు దోహదపడుతుంది. ఇది సాగు ఖర్చును తగ్గించడమే కాకుండా రసాయనాల వలన వాతావరణం, నేల విషపూరితం కాకుండా కాపాడుతుంది.
Read More