మార్కెటింగ్‌, ఆయిల్‌ఫెడ్‌, వ్యవసాయ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష

నాబార్డ్‌, ఆర్‌ఐడిఎఫ్‌ నిధులను ఉపయోగించి మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో గోదాములు, కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణం చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈ రోజు సచివాలయంలో మార్కెటింగ్‌, ఆయిల్‌ ఫెడ్‌, వ్యవసాయశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి ఇప్పటికే ఉన్న గోదాముల సామర్థ్యం మరియు కోల్డ్‌ స్టోరేజీల సామర్థ్యాన్ని పెంచే విధంగా రాష్ట్రంలో మరిన్ని గోదాములు మరియు కోల్డ్‌ స్టోరేజీలు నిర్మించాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం నాబార్డ్‌, ఆర్‌ఐడిఎఫ్‌ నిధులను ఉపయోగించుకోవాలని సూచించారు. రైతులు మాత్రమే ఉత్పత్తులను అమ్ముకునేలా రైతుబజార్లను పకడ్భందిగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం అన్ని మార్కెట్లు మరియు రైతు బజార్లలో సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేయాలన్నారు. మార్కెట్లలో డిజిటల్‌ బోర్డుల ఏర్పాటుపై ఆరా తీశారు. మార్కెట్‌ యార్డుల పునర్విభజనకు ప్రజాప్రతినిధుల నుండి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా ఉన్నవాటిని వెంటనే ఏర్పాటు చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్‌ అధికారులకు మంత్రి తుమ్మల సూచించారు.
వానాకాలం సీజన్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఇప్పటికే 40 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లను జిల్లాల వారిగా సిద్ధం చేసామని, రానున్న 10,15 రోజుల్లో 2 కోట్ల విత్తన ప్యాకెట్లు రైతులకు అందుబాటులో ఉంచుతామని వ్యవసాయశాఖ సంచాలకులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుకోవాలని వ్యవసాయశాఖ అధికారులకు మంత్రి సూచించారు. పచ్చిరొట్ట విత్తనాల అందుబాటుపై మంత్రి ఆరా తీశారు. సరిపడా పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అలాగే మే నెలాఖరు వరకు 2 లక్షల మట్టి నమూనాల సేకరణ పూర్తి చేసి, వాటి ఫలితాలు రెండు నెలలలోపు రైతులకు అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అంతేగాక ప్రతి రైతుకు మట్టి నమూనా పరీక్ష ఫలితాలు అందేవిధంగా తగు ప్రణాళికలు సిద్ధం చేయాలని, అన్ని మార్కెట్‌ యార్డులలో, రైతు వేదికలలో ఈ సౌకర్యాన్ని కల్పించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మట్టి నమూనా పరీక్షల ఆధారంగా ఎలాంటి పంటలు వేయాలో రైతులకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.
మార్క్‌ ఫెడ్‌ ఆధ్వర్యంలో వివిధ రకాల పంట ఉత్పత్తుల సేకరణ గురించి ఆరా తీసిన మంత్రిగారు, గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి ఇప్పటికే లక్ష మెట్రిక్‌ టన్నుల జొన్నలను సేకరించామని, ప్రభుత్వానికి నష్టం వాటిల్లినా కూడా రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అదే సమయంలో జొన్నల సేకరణలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పిఏసిఎస్‌ సీఈఓల బదిలీలపై ప్రభుత్వం ఇప్పటికే వెసులుబాటు కల్పించిందని, తదనుగుణంగా స్టేట్‌ లెవల్‌ కమిటీ ద్వారా బదిలీలపై వెంటనే చర్యలు చేపట్టాలని మంత్రిగారు ఆదేశించారు. కొత్తగా ప్రతిపాదించిన పిఏసిఎస్‌ లను పరిశీలించి, రైతులకు ఉపయోగపడే విధంగా నిబంధనలకు అనుగుణంగా తుదిజాబితా తయారుచేయాలన్నారు. అలాగే 311 పిఏసిఎస్‌ లను ఎఫ్‌పిఓ లుగా మార్చే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. పిఏసిఎస్‌ మరియు డిసిసిబి లకు సంబంధించి ఎంక్వైరీ పూర్తయి, సర్‌ చార్జీ ఉత్తర్వులు జారీచేయడమైనదని, దానిలో భాగంగా ఇప్పటివరకు 6 కోట్ల 38 లక్షల రివకరి పూర్తి అయిందని, ఇంకా 19 కోట్లు రికవరీ చేయాల్సి ఉందని, అలాగే 74 సర్‌ చార్జ్‌ లు పెండింగ్‌ ఉన్నాయని అధికారులకు మంత్రికి తెలియజేయగా, మిగిలిన రికవరీని త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
గత పదిసంవత్సరాలుగా అపెక్స్‌ సహకార సంఘాల ఆడిట్‌ ఎందుకు జరగలేదని ఆడిట్‌ అధికారులపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. సంబంధిత ఆడిట్‌ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్‌సిఎస్‌ కమిషనర్‌ ను ఆదేశించారు. అదేవిధంగా అన్ని అపెక్స్‌ సహకార సంఘాలను ఆడిట్‌ చేయాలన్నారు.
2021 లో ఆయిల్‌ పాం ప్లాంటేషన్‌ చేసిన 2800 మంది రైతులనుండి పంట వస్తుందా? లేదా అని మంత్రిగారు ఆరా తీశారు. ఒకవేళ పంట రాకపోతే అందుకు గల కారణాలు తెలుసుకొని, దానికి నివారణ చర్యలను రైతులకు తెలియజేయాలన్నారు. రైతు పొలంలోకి ఎట్టిపరిస్థితులలో కూడా ఆఫ్‌ టైప్‌ మొక్కలు వెళ్లకూడదని మంత్రిగారు స్పష్టం చేశారు. ఆయిల్‌ఫెడ్‌ సంస్థ మిగతా అన్ని కంపెనీలకు మార్గదర్శకంగా ఉండేలా చూడాలన్నారు.
ఈ సమావేశంలో వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్‌ రావు, వ్యవసాయశాఖ డైరెక్టర్‌ గోపి, ఉద్యానశాఖ డైరెక్టర్‌ శ్రీమతి యాస్మిన్‌ బాషా, సహకార అడిషనల్‌ రిజిస్ట్రార్‌, మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ శ్రీమతి లక్ష్మీబాయి మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read More

అరటి నార, గుర్రపు డెక్కలతో కళారూపాలు

  • ఏపీహెచ్‌డీసీ, ఎన్‌ఐడీల మధ్య ఒప్పందాలు
  • బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడి

అరటి నార, గుర్రపుడెక్కతో కళారూపాల తయారీపై హస్తకళాకారులకు శిక్షణ అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్  బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడించారు. అనంతపురంలో అరటి నారతో, మచిలీపట్నంలో గుర్రపుడెక్కతో కళారూపాల తయారీకి సంబంధించిన శిక్షణ కేంద్రాలనుఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ (ఏపీహెచ్‌డీసీ), అహ్మదాబాద్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ మధ్య బుధవారం రెండు ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. మూడు నెలలపాటు శిక్షణ ఉంటుందని చెప్పారు. ఆయా వస్తువులకు మార్కెటింగ్‌ సదుపాయం… వాటి ప్యాకింగ్‌, బ్రాండింగ్‌లపై అవగాహన కల్పిస్తామని వివరించారు.

Read More

చిరుధాన్యాల సాగుకు సవాళ్లేమిటి?

వ్యవసాయ విశ్వవిద్యాయలం అధ్యయనం

పోషకాహారాలైన చిరుధాన్యాల సాగు పెంపుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. రాష్ట్రంలో ఏటా 2.10 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతుండగా.. ఇందులో 6 లక్షల ఎకరాల్లోనే (3%) చిరుధాన్యాలు పండుతున్నాయి. ఉత్పత్తులు 5.3 లక్షల టన్నుల వరకే ఉంటున్నాయి. ఈ క్రమంలో చిరుధాన్యాల సాగు, వినియోగం పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆదేశాలు ఇచ్చింది. దీంతో వర్సిటీ ఆహార, పోషకాల శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెస్సీ, బీఎస్సీ వ్యవసాయ, హోంసైన్స్‌ విద్యార్థులు సర్వే చేస్తున్నారు. ఈ నెలాఖరుకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.

సమగ్ర సమాచార సేకరణ
ప్రస్తుతం చిరుధాన్యాలు సాగు చేస్తున్న రైతులు, వారి స్థితిగతులు, సాగు విధానాలు, పంటలను ఆశిస్తున్న తెగుళ్లు, దిగుబడులు, మార్కెటింగ్‌, మద్దతు ధరలు, లాభనష్టాలు, రైతులు ఆశిస్తున్న సహకారం తదితర అంశాలపై సర్వే చేస్తున్నారు. రైతు ఉత్పత్తి సంఘాలు, ప్రభుత్వ శాఖలు, పారిశ్రామిక వేత్తలు, అంకుర వ్యవస్థాపకుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఇతర పంటలను సాగు చేస్తున్న రైతులు చిరుధాన్యాల వైపు ఎందుకు రావడం లేదు? నాబార్డు, రైతు ఉత్పత్తి సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు వారిలో అవగాహన కోసం ఏమైనా చర్యలు చేపడుతున్నాయా అనే కోణంలోనూ సర్వే సాగుతోంది. భారత చిరుధాన్యాల సంస్థ ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన కిసాన్‌ మేళాకు హాజరైన వివిధ రాష్ట్రాల రైతులు, అంకుర సంస్థల వ్యవస్థాపకులు, రైతు ఉత్పత్తి సంఘాల నుంచి వ్యవసాయ, హోంసైన్స్‌ కళాశాల విద్యార్థినులు సమాచారం తీసుకున్నారు.

Read More

సహకార శాఖ మరియు ఉద్యానశాఖ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష

సిద్దిపేట జిల్లా, నర్మెట్టలో ఆయిల్‌ పాం ఫ్యాక్టరీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, మే నెలాఖరు వరకు ఆయిల్‌ పాం గెలల ప్రాసెసింగ్‌ ప్రారంభించాలని, టిజి ఆయిల్‌ ఫెడ్‌లో అంతర్జాతీయ స్థాయి కంపెనీలలో ఉండే ఆర్గనైజేషన్‌ స్ట్రక్చర్‌ ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని ఈ రోజు సచివాలయంలో సహకార శాఖ మరియు ఉద్యానశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గద్వాల జిల్లా బీచుపల్లి ఆయిల్‌ పాం ఫ్యాక్టరీ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు కూడా చర్యలు తీసుకోవాలన్నారు.

టిజి ఆయిల్‌ ఫెడ్‌ను అంతర్జాతీయ స్థాయిలో ఉన్న సంస్థల మాదిరిగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. ఆయిల్‌ ఫెడ్‌ సంస్థలోని ఫ్యాక్టరీ, నర్సరీ, ప్లాంటేషన్‌, ఫైనాన్స్‌, మార్కెటింగ్‌ మరియు ఇతర విభాగాల్లో అత్యంత నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించి, సంస్థను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. మార్చి నాటికి ఆయిల్‌ పాం కంపెనీలు తమ నిర్దేశిత ప్లాంటేషన్‌ లక్ష్యాన్ని పూర్తి చేయించాలని డైరెక్టర్‌ గారికి సూచించారు. లక్ష్యాన్ని పూర్తి చేయనివారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సహకార సంఘాల నిర్వహణపై దృష్టి పెట్టాలని, గడువు ముగిసిన అన్ని సహకార సంఘాల ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు సరిచేసి సిద్ధంగా ఉంచాలని మంత్రిగారు అధికారులను ఆదేశించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న విచారణలను త్వరగా పూర్తి చేసి, తేలిన మొత్తాలను వెంటనే రికవరీ చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో వ్యవసాయ సహకారశాఖ కార్యదర్శి రఘునందన్‌ రావు, హార్టికల్చర్‌ డైరెక్టర్‌ శ్రీమతి యాస్మిన్‌ బాషా, సహకార శాఖ డైరెక్టర్‌ ఉదయ్‌ కుమార్‌, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read More

దేశంలో కెల్లా నంబర్‌ 1 స్థానంలో మన వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉండాలి- తుమ్మల నాగేశ్వర రావు

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని దేశంలో నెంబర్‌ 1 స్థానంలో నిలబెట్టడానికి అందరూ కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ప్రధానుల చేతుల మీదుగా 60 ఏళ్ల క్రితం ప్రారంభమైన విశ్వవిద్యాలయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. డిసెంబర్‌లో జరగనున్న విశ్వవిద్యాలయం వజ్రోత్సవ ఉత్సవాలు (డైమండ్‌ జూబ్లీ) ఫ్లయర్‌, లోగోలనీ మంత్రి ఈ ఉదయం సైఫాబాద్‌లో ఉన్న విశ్వవిద్యాలయం కమ్యూనిటీ సైన్స్‌ కళాశాలలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ యం. కోదండ రెడ్డి, తెలంగాణ ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ జి. చిన్నారెడ్డి, పిజెటిఏయు ఉపకులపతి ప్రొఫెసర్‌ అల్థాస్‌ జానయ్య, విశ్వవిద్యాలయ అధికారులు, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. దేశంలోనే మన రాష్ట్రం వ్యవసాయ రంగంలో అగ్రగామిగా ఉందనీ, అలాగే విశ్వవిద్యాలయాన్ని నెంబర్‌ 1 స్థానానికి తీసుకెళ్లాలని తుమ్మల సూచించారు. డైమండ్‌ జూబ్లీ ఉత్సవాలని ఉపయోగించుకొని ఈ లక్ష్యాలని సాధించాలన్నారు. ముఖ్యమంత్రికి వ్యవసాయం అత్యంత ప్రాధాన్యత అంశం అని వివరించారు. అందుకే బడ్జెట్‌లో వ్యవసాయానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. ఈ డైమండ్‌ జూబ్లీ ఉత్సవాలు విశ్వవిద్యాలయం భవిష్యత్తుని నిర్ణయించేలా ఉండాలన్నారు. 60 ఏళ్ల విజయాల గురించి సంతృప్తి చెందకుండా భవిష్యత్‌ ప్రణాళికల్ని రూపొందించాలని సూచించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి సలహాలు, ఆదేశాలు తీసుకొని ముందుకెళ్లాలన్నారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లవేళలా తోడుంటుందని అన్నారు. అదేవిధంగా ఈనెల 30న మహబూబ్‌ నగర్‌ లో రైతు సదస్సు ఉండనుందని.. 28 నుంచే ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. రైతులకి ఆచరణలో ఉపయోగపడేలా ఈ ప్రదర్శనలు ఉండాలన్నారు. చిన్నారెడ్డి, కోదండ రెడ్డిలు నిరంతరము రైతులు, వ్యవసాయ రంగాల గురించే మాట్లాడుతారని వారి సేవలను వ్యవసాయ విశ్వవిద్యాలయం పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.
ఏడాదిగా రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవసాయం, రైతుల సంక్షేమానికి అనేక చర్యలు చేపడుతున్నదని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ యం. కోదండ రెడ్డి అన్నారు. ఈ సమయంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం డైమండ్‌ జూబ్లీ ఉత్సవాలు జరగడం సంతోషదాయకమన్నారు. ఈ సందర్భంగా ఈ వేడుకల ద్వారా రాష్ట్ర వ్యవసాయరంగ భవిష్యత్‌కి సంబంధించి వ్యవసాయ విశ్వవిద్యాలయం మంచి సందేశం ఇవ్వాలని ఆయన సూచించారు. 1971-78 ల మధ్య తాను రాజేంద్రనగర్‌ క్యాంపస్‌ లోనే వ్యవసాయ విద్యన్ని అభ్యసించానని ప్లానింగ్‌ బోర్డ్‌ వైస్‌ చైర్మన్‌ జి. చిన్నారెడ్డి తెలిపారు. ఉత్సాహవంతులైన ఉపకులపతి నేతృత్వంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని పునర్నిర్మించాలని సూచించారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈమధ్య ప్రధాని విడుదల చేసిన వంగడాల్లో తెలంగాణవి లేకపోవడం ఆలోచించవలసిన విషయం అని చిన్నారెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 1964 లో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారని పిజెటిఏయు ఉపకులపతి ప్రొఫెసర్‌ అల్థాస్‌ జానయ్య అన్నారు. 1964లో ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి విశ్వవిద్యాలయాన్ని, 1966 లో పరిపాలన భవనాన్ని ప్రధాని ఇందిరా గాంధీ ప్రారంభించారన్నారు. ఇన్నేళ్ళ విశ్వవిద్యాలయ విజయాలు, సేవల్ని స్మరించుకుంటూ వజ్రోత్సవాలని నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా లోగో, ఫ్లయర్‌ లని విడుదల చేశామన్నారు. డిసెంబర్‌ 20, 21 తేదీల్లో ఉత్సవాల్ని నిర్వహించాలని నిర్ణయించామని, భవిష్యత్తులో తేదీలు మారవచ్చని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, యుజిసి చైర్మన్‌, ఐసిఏఆర్‌ డీజీ, ఇక్రిశాట్‌ డీజీ ఇంకా అనేక మంది ప్రముఖులు, మాజీ ఉపకులపతులు, వ్యవసాయ మంత్రులని ఈ వేడుకలకు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. మహబూబ్‌ నగర్‌ వాసి, విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) చైర్మన్‌ శ్రీనివాసులు శెట్టి కూడా ఈ వేడుకలకు హాజరవుతారని అన్నారు.
రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో వ్యవసాయ కళాశాలలను ప్రారంభించడానికి ముందే తమ ముందస్తు అనుమతి ఉండాలని ఐసిఏఆర్‌ ఈ మధ్య అన్ని రాష్ట్రాల చీఫ్‌ సెక్రటరీ లకి లేఖ రాసిందని జానయ్య తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఈ విషయం గురించి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తానన్నారు. ప్రైవేట్‌ కళాశాలల ప్రలోభాలకు గురికావద్దని ఉపకులపతి సూచించారు.

Read More