ఉద్యాన పంటల్లో చెట్లచుట్టూ కలుపు తీయాలన్నా, పాదులు చేయాలనా రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు, దీనికి ఎక్కువ మంది కూలీలు అవసరం. పంటలకు ధరలున్నప్పుడు రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూలీలను పెట్టుకొని కలుపు తీయడం, పాదులు చేయించడం చేస్తారు. అదే ధరలు లేని సమయంలో ఈ పని తలకు మించిన భారం అవుతుంది. పంట దిగుబడికి ఈ పనులు తప్పనిసరి. అలాగే వదిలేస్తే చెట్లు బ్రతకకుండా ఉండే ప్రమాదం కూడా ఉంది.
ఇలాంటి పరిస్థితుల నుంచి గట్టెక్కిచ్చేందుకు ఒక ప్రత్యామ్నాయ పరికరాన్ని మెకానికల్ అడ్వాంటేజ్ అనే సూత్రం తో తయారు చేసి ఈ పరికారానికి సుదర్శన్ వీడర్ గా పేరు పెట్టారు ప్రొఫెసర్ ముప్పా లక్ష్మణ రావు
ఉద్యానవన పంటల్లో అంతర్ కృషి పరికరం
ఈ పరికరం కోసం ఒక పొడవాటి ఇనుప పైపును తీసుకొని చక్రా కారం లో వంచి కింద బాగాన చిన్న పాటి కర్రులు అమర్చి వెల్డింగ్ ద్వారా అనుసంధానం చేసి పరికరాన్ని తయారు చేశారు, చెట్టు వద్ద 5 నిముషాలలో కలుపు, పాది రెండూ చేసుకోవచ్చు. ఉద్యానవన రైతులకు ఈ పరికరం ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ట్రాక్టర్లు, ఎద్దుల సహాయంతో రైతులు ఉద్యాన పంటల్లో కలుపు తీసే కార్యక్రమం చేస్తుంటారు. అయితే చెట్టు పాది లో అంతర కృషి చేయాలంటే మనుషుల సహాయం అవసరం ఉంటుంది.
ఈ పరికరాన్ని చెట్టుకు అమర్చి ఒక వ్యక్తి చుట్టూ తిరగడం వల్ల గుంటక తరహాలో మడకలు భూమిని చదును చేయడంతో పాటు పాది ఏర్పడుతుంది. దీనివల్ల రైతులకు ఖర్చు మిగులుతుంది. శ్రమ తక్కువగా ఉండటంతో పాటు ఒక్క మనిషి గంట వ్యవధిలోనే అర ఎకరా పొలం పూర్తి చేయవచ్చు.
దీనికి 4 వేల వరకు ఖర్చు వస్తుంది. చెట్టు సైజు ని బట్టి పరికరం ధర మారుతుంది.
రైతుల కోరితే వారికి తయారు చేసి ఇస్తారు. ఈ పరికరానికి పేటంట్ చేయడం జరిగింది. పేటెంట్ నెంబర్ :507641-001
ఈ పరికరం కోసం శ్రీ ఆంజనేయ స్మాల్ అగ్రి టూల్స్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ రైతునేస్తం ముప్పా లక్ష్మణరావు, ఫోన్ : 9849140465 లో సంప్రదించగలరు.
సాధారణ నామం : కొండగన్నేరు / విసాగ్ని శాస్త్రీయ నామం : ఆల్‌స్టోనియా వెనెనేట; కుటుంబం: అపోసైనేసి
తెల్లగన్నేరు సుమారు 6 మీ. ఎత్తు వరకు పెరిగే చిన్న లేదా మధ్య రకం చెట్టు. చెట్టు బెరడు బూడిద రంగుతో కూడిన గోధుమ వర్ణం కలిగి ఉంటుంది. వేరు చిక్కటి పసుపు రంగులో ఉండి గట్టిగా కర్రలాగా ఉంటుంది. ప్రతి కణుపు వద్ద 3-6 ఆకులు చుట్టూ అమరి ఉంటాయి. ఆకులు పలుచగా, బళ్ళెం ఆకారంలో ఉండి, అంచులు అలల్లాగా ఉంటాయి. ఆకు కొనలు సన్నగా మొనదేలి ఉంటాయి. అనేక ఈనెలు దగ్గర దగ్గరగా, సమాంతరంగా ఉండి ఆకుల చివర్ల నుండి పుట్టిన సన్నని దారంలాంటి ఈనెలతో కలపబడి ఉంటాయి. పూలు తెల్లగా ఉండి కొమ్మల చివర్లలో వస్తాయి. కాయలు కాడ కలిగి రెండు చివర్లు కొనదేలి ఉంటాయి. అనేక విత్తనాలు బల్లపరుపుగా, రెండు చివర్లలో వెంట్రుకలు కలిగి ఉంటాయి.
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
తెల్లగన్నేరు వేర్లు, పండ్లు ఔషధాల తయారీలో ఉపయోగించబడుతున్నాయి.
వీటిలో ఇండోల్ ఆల్కలాయిడ్స్ అధికంగాను, ఆల్‌స్టోవినైన్, వినినాటైన్, రిసర్పెåన్ మొదలైన రసాయనాలు ఉంటాయి.
వేర్లను చర్మవ్యాధులు, కుష్టు, చెవిపోటుల చికిత్సలో ఉపయోగిస్తారు.
వీటిని పాము కాటు, ఇతర విషపు పురుగుల కాట్ల చికిత్సలో కూడా ఉపయోగిస్తారు.
మూర్ఛ రోగం, ఆయాసం, జ్వరం మొదలగు వాటి చికిత్సకు, పుండ్లు, సిఫిలిస్, పిచ్చి వంటి జబ్బుల చికిత్సకు ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో …
ఆల్‌స్టోనియా బూనీ ఆకులు మరియు కాండం బెరడు ద్రావణాలు గులాబి రంగు కాండం తొలుచు పురుగు, సెసేమియాకెలామిస్టిస్ లార్వాలపై విషపూరిత చర్యను, పెరుగుదలనరికట్టే చర్యను ప్రదర్శించాయి. వీటిని గులాబి రంగు కాండంతొలుచు పురుగు నివారణకు రసాయన పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. (ఆయిజయాన్‌గ్బె, అతని అనుచరులు, 2007).
ఆల్‌స్టోనియా స్కాలారిస్ కాండం బెరడు మరియు ఆకుల నీటి ద్రావణాలు, పాక్షికంగా శుద్ధి చేసిన ద్రావణాలు లిమ్నేయ అక్యూమినేట (నత్త)పై మొల్లస్కిసైడల్ మరియు యాంటికోలినెస్టరేజ్ చర్యలను ప్రదర్శించాయి. కాండం బెరడు ద్రావణాలు ఆకు ద్రావణాల కన్నా బలమైన మొల్లస్కసైడల్ చర్యను ప్రదర్శించాయి. (సింగ్ అండ్ ఇసంగ్, 2003).
ఆల్‌స్టోనియా స్కాలారిస్ మొక్క అసిటోన్ లేటెక్స్ ద్రావణాలు లాబియో రోహిత (చేప)పై నీటి ద్రావణాలకన్నా 23 రెట్లు అధిక విషపూరిత చర్యను ప్రదర్శించాయి (సింగ్ అండ్ సింగ్, 2010).
ఆల్‌స్టోనియా స్కాలారిస్ ఆకుద్రావణాలు ఈడెస్ ఆల్బోపిక్టస్ 3వ దశ లార్వాలపై లార్విసైడల్ చర్యను ప్రదర్శించాయి.
ఆల్‌స్టోనియా స్కాలారిస్ 100% ఆకుల ద్రావణాన్ని 15 రోజుల వయసు పార్థినియం మొక్కలపై 5 రోజుల వ్యవధిలో పిచికారి చేస్తే, మొదటి పిచికారి చేసిన 15 రోజుల తర్వాత వేర్లు మరియు కాండం జీవపదార్థం గణనీయంగా తగ్గింది. ఆకుల నీటి ద్రావణంలో ఉన్న కలుపు నాశక పదార్థాలు పార్థినియం నివారణకుపయోగిస్తాయి (జావైద్, అతని అనుచరులు, 2010).
ముందుగా ఉల్లిపాయలలోని పోషకాల గురించి తెలుసుకుందాం ! ఉల్లిపాయలలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం, ఐరన్ విటమిన్ ఎ, సి, ఇ, ఇంకా ఎన్నో ఉంటాయి. కేన్సర్ కణాలను నిరోధించటంలో ముఖ్యమైనది ఈ ఉల్లిపాయ. జుట్టు వత్తుగా, నల్లగా పెరగటానికి దోహదం చేస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు రక్తంలో షుగర్ తగ్గించుకునేందుకు ఉల్లిపాయ ఉపయోగకరమైనది. చెడు కొలెష్ట్రాల్‌ని తగ్గించటమే గాక గుండె వ్యాధులను కూడా నిరోధిస్తుందని సంబంధిత నిపుణులు అంటారు.
కావల్సిన దినుసులు: ఎండుమిర్చి, చింతపండు, ఉప్పు, జీలకర్ర, పసుపు, ఒక పెద్ద ఉల్లిపాయ (అన్నీ ఉల్లిపాయకు తగినన్ని)
ముందుగా ఎండుమిర్చి, ఉప్పు, జీలకర్రలని రోట్లో వేసి మెత్తగా దంచుకున్నాక, చింతపండు కూడా వేసి బాగా కలిసేట్లు దంచుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మెత్తగా దంచి, పచ్చడిని గిన్నెలోకి తీసుకోవాలి. మిక్సీలో కంటే రోట్లో చేసిన పచ్చడికి రుచి ఎక్కువ. పచ్చడి చేసేటప్పుడు నీరు తగలకుండా ఉంటే, ఈ పచ్చడి వారమైనా బయట కూడా పాడవదు. ఇది దోశెల్లోకి, అన్నంలోకి, జొన్నరొట్టెల్లోకి చాలా బావుంటుంది. రైస్‌లో తినేటప్పుడు కొంచెం కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనె వేస్తే రుచి పెరుగుతుంది.
రచన : శ్రీమతి కొలను పద్మావతి
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి
గ్రామీణ ప్రాతాలలోని స్త్రీలు నిరక్షరాస్యత, పేదరికానికి తోడు సరైన పోషకాహారం తీసుకోలేక పోవడం వలన అనారోగ్యానికి గురి అవుతున్నారు. వీటిని అధిగమించాలంటే స్వాలంబనతో పాటు సమతుల్య ఆహారం ఎంతో అవసరం. గ్రామాలలోని ప్రజలు అధికంగా బియ్యంను ప్రధాన ఆహారంగా వాడుతారు. వీటిలో పిండి పదార్ధాలు అధికంగాను, మాంసకృత్తులు అత్యల్పంగానూ ఉంటాయి. అందువల్ల గ్రామాల్లోని ప్రజలు మాంసకృత్తుల లోపం మూలంగా సరైన ఎదుగుదల లేక ముఖ్యంగా పెరుగుతున్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు పలు రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీరు సరైన పోషకాహారము తీసుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. అయతే ఈ మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ లవణాలు కోడి గ్రుడ్డులో మరియు కోడి మంసములో పుష్కలంగా ఉన్నాయి. పోషకాహార నిపుణుల సూచన మేరకు కనీసం రెండు రోజులకి ఒక గ్రుడ్డు చొప్పున తింటే ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు. అందువల్ల కోళ్ళ ఉత్పత్తులను గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాలలో అందుబాటులోకి తెస్తే అది వారి ఆహారలో ఒక భాగమై వారి ఆరోగ్యం మరియు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి దోహద పడుతుందున్న ఉద్దేశ్యముతో అధిక గ్రుడ్లు ఉత్పత్తి మరియు నాటు కోడి మాంసం రుచికి సమానంగా అనిపించే వనరాజ, గిరిరాజ, గ్రామ ప్రియ, రాజశ్రీ, శ్రీనిధి, వనశ్రీ మరియు కడక నాథ్ కోళ్ళ జాతులను పెరటిలో పెంచుకోవడానికి అనువైనవిగా గుర్తించి గ్రామీణ ప్రాంత రైతులకు పరిచయం చెయ్యడం జరిగింది.
గ్రామీణ ప్రాంతంలో నాటు కోళ్ళ పెంపకం సర్వసాధారణము. అయితే నాటు కోళ్ళు తక్కువ కోడి గ్రుడ్లు పెడతాయి అలాగే తక్కువ మాంసం దిగుబడి ఇస్తాయి. అలాగే కుక్కలు, నక్కలు కోళ్ళని ఎత్తికొనిపోయి తినేయడం వలన ఎక్కువ నష్టం జరుగుతుంది. ఒక్కోసారి కోళ్ళని దొంగలించడం వలన కూడా నష్టం జరుగును. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్ ని ఈ క్రింద తెలియ చేసిన కొలతల ప్రకారము వ్యవసాయ పరిశోధన కేంద్రం, విజయనగరం వారు రూపొందించడం జరిగింది.
డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్ కొలతలు వివరములు :
పొడవు 87 అంగుళములు, వెడల్పు 46 అంగుళములు, మధ్యలో ఎత్తు 66 అంగుళములు, ఒక ప్రక్క ఎత్తు 42 అంగుళములు మరియు ఇంకో ప్రక్క ఎత్తు 54 అంగుళములు.
పైన రూఫ్ జింక్ షీట్, బాక్స్ చుట్టు మరియు బాక్స్ క్రింద కూడా జింక్ షీట్ తో తయారు చెయ్యడం జరిగింది.
డూప్లెక్స్ బాక్స్ లో క్రింద ఫ్రీగా తిరగడానికి రెండు రకాలైన జింక్ మెష్ లను వేయడం జరిగింది.
మిగిలిన రాడ్స్ అన్నీ ఇనుముతో తయారు చేయడము జరిగింది.
డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో కోళ్ళు క్రింది నుండి బాక్స్ లోనికి వెళ్ళడానికి జింక్ మెస్ మెట్లు లాగ ఏర్పాటు చెయ్యడము జరిగింది.
డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్ లోనికి కోడి పిల్లలు, మేత, నీరు పెట్టడానికి మరియు తీయడానికి చిన్న తలుపు ఏర్పాటు చెయ్యడం జరిగింది.
కోడిపిల్లలను మరియు కోళ్ళను ఎవరు తీయకుండా ఉండుటకు తాళం వేసుకొనే సదుపాయం ఏర్పాటు చెయ్యడం జరిగింది.
ఒక డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్ తయారీ చెయ్యడానికి సుమారుగా 25,000/- (ఇరువైదు వేలు) రూపాయలు అవుతుంది.
ఇలా తయారు చేసిన డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో 16 చదరపు అడుగులు పైన బాక్స్ కోళ్ళు నిద్ర పోవుటకు మరియు గ్రుడ్లు పెట్టటకు ఉపయోగపడుతుంది. ఈ బాక్స్ లో రెండు అంగుళాలు లోతు ఏర్పాటు చేసి బెడ్డింగ్ మెటీరియల్ క్రింద వరి దాన్యం ఊకను రెండు అంగుళాలు నింపాలి.
ఇలా తయారీ చేసిన డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో 32 చదరపు అడుగులు క్రింద బాక్స్ కోళ్ళు ఫ్రీగా తిరగడానికి, మేత టబ్బు, నీళ్ళ టబ్బు పెట్టడానికి ఉపయోగపడుతుంది. పైన తెలిపిన కొలతలతో తయారు అయన డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో మొదట్లో 20-25 కోడిపిల్లలు పెంచుకోవచ్చు. పెద్దవైతే 15-20 కోళ్ళను సులువుగా పెంచుకోవచ్చు.
ఈ డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్ కి తాళం వేసుకొని రైతు ఎక్కడికైనా వెళ్లి వ్యవసాయ పనులు చేసుకోవచ్చు. రోజు ఉదయం మరియు సాయంత్రం కొద్దిగా మేత మరియు నీరు పెట్టుకుంటే సరిపోతుంది.
ఈ విధంగా తయారు చేసిన డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లని ఐ.సి.ఎ.ఆర్. – ఐ.ఐ.యఫ్.యస్.ఆర్. వారి ఆర్ధిక సహాయముతో తయారు చేసి ఉచితముగా సాలూరు మండలంలో గంగాన్నదొరవలస, మెట్టవలస గ్రామాలలో 18 మంది రైతులకు మరియు మక్కువ మండలంలో చిమిడివలస, ఎర్రసామంతులవలస గ్రామాలలో 18 మంది రైతులకు 2020-2021 సంవత్సరములో సరఫరా చేయడం జరిగినది. ఈ డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్ తో పాటు, ఒక మేత పెట్టే టబ్, ఒక నీళ్ళు పెట్టే టబ్ మరియు 10 ఆడ పిల్లలు, 5 మగ పిల్లలు ఇచ్చి పరిశీలించడం జరిగింది. ఇలా రైతులు డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో కోళ్ళ పెంపకం చేపట్టడము వలన టేబుల్లో తెలిపిన విధంగా కోళ్ళు, గ్రుడ్లు విషయములో చాలా లాభాలు నమోదు చెయ్యడం జరిగినది.
రైతులు డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో కోళ్ళ పెంపకం చేపట్టడము వలన 46.67 శాతం కోళ్ళను కుక్కలు, నక్కలు ఎత్తికెల్లి పోకుండా కాపాడటము గమనించడమైనది. అలాగే డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో ఉన్న కోళ్ళు 1247 గ్రుడ్లు పెడితే, సాధారణంగా పెంచే కోళ్ళు 568 గ్రుడ్లను మాత్రమే పెట్టాయి. అలాగే డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో ఉన్న కోళ్ళు 52.50 కిలోలు మాంసం దిగుబడినిస్తే, సాధారణంగా పెంచే కోళ్ళు 22.40 కిలోలు మాంసం దిగుబడినిచ్చాయి. కోళ్ళని డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో పెంచడం వలన సుమారుగా మొత్తం లాభం రూ. 21,985/- వచ్చింది. సాధారణంగా చేపట్టే కోళ్ళ పెంపకములో సుమారుగా మొత్తం లాభం రూ.9,560/- వచ్చింది. కావున కోళ్ళని డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో పెంచడం వలన కోళ్ళను కుక్కలు, నక్కలు ఎత్తికెల్లి పోకుండా కాపాడుకోవడము కాకుండా అదనంగా 54.45 శాతం గ్రుడ్లు మరియు 57.33 శాతం మాంసం వచ్చినట్లు గమనించడమైనది.
డా.ఎం.ఎం.వి. శ్రీనివాసరావు, ప్రధాన శాస్త్రవేత్త(సస్యపోషణ), డా.కె. లక్ష్మణ, ప్రధాన శాస్త్రవేత్త(విస్తరణ), డా.కే. తేజేశ్వర రావు, ప్రధాన శాస్త్రవేత్త(సస్యపోషణ), డా. టి.యస్.యస్.కే. పాత్రో, ప్రధాన శాస్త్రవేత్త(తెగుళ్ళు విభాగం) ఏరువాక కేంద్రం మరియు వ్యవసాయ పరిశోధన స్థానం, విజయనగరం. మొబైల్ నెంబర్ : 9440123223
చేప-బెల్లం ద్రావణంలో ఎన్నో రకాల ‘అమినో యాసిడ్’ లు ఉంటాయి. ఇవి పంటల యొక్క పెరుగుదలకు ఉపయోగపడతాయి.
కావలసిన పదార్థాలు: చేప వ్యర్థాలు : 1 కిలో (ఎముకలు, మొప్పలు, చర్మం మొ॥); బెల్లం : 1 కిలో
తయారు చేయు పద్ధతి (చోహాన్ క్యూ పద్ధతి):
ఒక కిలో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించిన చేపల వ్యర్థ పదార్థాలను, ఒక కిలో బెల్లం పొడిని తీసుకొని బాగా కలిపి ఒక కుండలో నిలువ చేయాలి.
కుండపై మూతపెట్టి 10-12 రోజుల పాటు ఆ మిశ్రమాన్ని పులియబెట్టాలి.
ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ కర్రతో బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని 10-12 రోజుల తర్వాత వడపోసి, ఒక లీటరు మిశ్రమానికి 100 లీటర్ల నీటిని కలిపి (1 శాతం) ఒక ఎకరం పొలంలో పంటపై గానీ, పొలంలోని భూమిపైగానీ, కంపోస్టు గుట్టపైగానీ పిచికారీ చేయాలి. సూచనః
పంటకాలంలో 1-2 సార్లు పంటపై పిచికారి చేస్తే సత్ఫలితాలు పొందవచ్చు.
ఈ ద్రావణాన్ని అన్ని పంటలలో, పండ్ల తోటలలో వాడవచ్చు.
ద్రావణాన్ని తయారు చేసిన వెంటనే ఉపయోగించుకోవాలి. నిల్వ ఉంచరాదు.
రైతునేస్తం ప్రచురణ ‘స్వేద వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి
ఏడాకుల పొన్న 4-10 మీ. ఎత్తు వరకు పెరిగే వృక్షం. ప్రతి కణుపు నుండి 4-7 ఆకులు వస్తాయి. ఆకులు దాదాపు 9-12 x 2.5-3 సెం.మీ. పరిమాణంతో కోలగా ఉన్న దీర్ఘచతురస్రాకారంలో గాని, బళ్ళెం ఆకారంలో గాని ఉంటాయి. ఈనెలు దగ్గర దగ్గరగా ఉంటాయి. ఆకుల అడుగు భాగం పాలిపోయి ఉంటుంది. పూలు తెల్లగా ఉండి కొమ్మల చివర్లలో వస్తాయి. గింజలు ఒంటరిగా లేదా జతగా ఉంటాయి.
సాధారణ నామం : డెవిల్స్‌ట్రీ, సప్తపర్ణి శాస్త్రీయ నామం : ఆల్‌స్టోనియా స్కాలారిస్ / ఆల్‌స్టోనియా బూనీ కుటుంబం: అపోసైనేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
పండ్లు మరియు చెట్టు బెరడుకు ఔషధగుణాలున్నాయి.
దీనిలో ఎఖిటమైన్, వినోటర్పిన్, గ్లూకోసైడ్, డిటేమిన్, ఎఖిటోనైన్, ఎఖిటైన్ అనే రసాయనాలు ఉంటాయి.
బాగా పండిన పండ్లు సిఫిలిస్, మూర్ఛ, పిచ్చి మొదలగు వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయి.
బెరడు కషాయం జ్వరం, శ్వాసకోశవ్యాధులు, కుష్టు మరియు పుండ్లను నివారిస్తుంది.
వ్యవసాయరంగంలో
ఆల్‌స్టోనియా బూనీ ఆకు మరియు కొమ్మ ద్రావణం గులాబి రంగు కాండం తొలుచు పురుగు, సెసేమియా కలామిస్టిస్ పెరుగుదల నిరోధకంగా పనిచేస్తాయి.
ఏడాకుల పొన్న పెట్ ఈథర్ ద్రావణం షిగెల్లా బాయ్‌డీ, విబ్రియో పారాహెమోలైటికస్‌పై కొద్దిపాటి నిరోధక చర్యను ప్రదర్శించింది. కార్బన్ టెట్రాక్లోరైడ్ ద్రావణం విబ్రియో మిమికస్, విబ్రియో పారాహెమోలైటికస్‌లపై బలమైన నిరోధక చర్యను ప్రదర్శించింది. క్లోరోఫాం ద్రావణాలు విబ్రియో పారాహెమోలైటికస్ పెరుగుదలను బలంగా అరికట్టింది. ఎస్కెరిచియా కోలిపై కూడా నిరోధక చర్యను ప్రదర్శించాయి (బెల్లా, అతని అనుచరులు, 2017).
ఈ చెట్లు కాండం బెరడు ద్రావణం నత్త, లిమ్నేయియా అక్యూమినేటపై బలమైన మొల్లస్కసైడల్ చర్యను ప్రదర్శించింది (సింగ్ అండ్ సింగ్, 2003).
ఈ మొక్క ద్రావణం దోమల లార్వాలపై కీటకనాశక చర్యను ప్రదర్శించింది. (జిజి, అతని అనుచరులు, 2012).
ఏడాకుల పొన్న కాండం బెరడు పెట్రోలియం ద్రావణం లిమ్నేయీ అక్యూమినేట, ఇండోప్లానోర్బిస్ ఎక్ౙస్టస్ అను నత్తలపై అధిక విషప్రభావం చూపింది (చౌహాన్ అండ్ సింగ్, 2014).
ఏడాకుల పొన్న మిథనాల్, నీటి ద్రావణాలలో ఉన్న అత్యధిక ఫైటోకెమికల్ సముదాయాలు అత్యుత్తమ యాంటీబాక్టీరియల్ చర్యలను ప్రదర్శించాయి (షకీల్, అతని అనుచరులు, 2014).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి
వండే పని లేకుండా అప్పటికప్పుడు సులభంగా చేసుకునే క్యారెట్ – పచ్చి కొబ్బరి ‘పచ్చి పచ్చడి’ తయారీ విధానం..
కావలసిన పదార్థములు: పచ్చి కొబ్బరి ముక్కలు – ఒక కప్పు క్యారెట్ ముక్కలు – ఒక కప్పు. కొత్తిమీర – అర కప్పు పచ్చిమిరపకాయలు – ఎనిమిది శుభ్రం చేసిన చింతపండు నిమ్మకాయంత! కొంచెం జీలకర్ర, ఒక వెల్లుల్లి రెబ్బ. రుచికి సరిపడినంత ఉప్పు
తయారీ విధానం: క్యారెట్ దుంపలను శుభ్రంగా నీటిలో కడిగి, ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కొబ్బరిని కూడా ముక్కలుగా చేసుకోవాలి.
ముందుగా – కొబ్బరి, క్యారెట్టు ముక్కలను కలిపి, కొంచెం దంచిన తర్వాత మిగిలిన పదార్థాలు వేసుకుని, రోటిలో గాని మిక్సీలో కానీ రుబ్బుకోవడమే! అంతే !!
పొయ్యి మీద పెట్టే పని లేకుండా, సింపుల్‌గా చేసుకునే క్యారెట్ – పచ్చికొబ్బరి పచ్చడి రెడీ!
వేడి వేడి అన్నంలోకే కాదు… కొన్ని టిఫిన్లలోకి కూడా రుచికరంగా ఉంటుంది.
రచన : శాంత కర్రి
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి
భారతీయ వ్యవసాయ రంగంలో నూతన ఒరవడులు సృష్టిస్తూ, మన రైతులు నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు తీస్తున్నారు.
మానవ ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందించడంలో ఆకుకూరలు ప్రథమ స్థానంలో నిలుస్తాయి. విటమిన్లు, ఖనిజ మూలకాలు, పిండి పదార్థాలు, మాంసకృత్తులు మరియు పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆకుకూరలను నిత్యం 125 గ్రాముల చొప్పున తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. కాగా, మార్కెట్లో వీటికి ఉన్న నిరంతర డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, సరైన యాజమాన్య పద్ధతులతో సాగు చేపడితే ఆకుకూరల ద్వారా రైతులకు గరిష్ట లాభాలు లభిస్తాయి.”
ఆకుకూరలు తక్కువ కాలంలో (20-30 రోజులు) మరియు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడినిచ్చే పంటలు. తోటకూర, పాలకూర, గోంగూర, కొత్తిమీర, మెంతికూర వంటివి నేరుగా విత్తనాలు చల్లి అన్ని కాలాల్లోనూ (వారానికి/పదిహేను రోజులకు ఒకసారి విత్తనాలు వేసుకోవడం ద్వారా) విజయవంతంగా సాగు చేయవచ్చు.
గోంగూర సాగు: ఆకుకూరలన్నింటి కంటే గోంగూర రుచి ఎక్కువ. నీరు నిల్వ ఉండని తేలికపాటి గరప నేలలు, ఎర్ర నేలలు మరియు ఒండ్రు నేలలు గోంగూర సాగుకు చాలా అనుకూలం. ఇది ఏడాది పొడవునా సాగు చేసుకోవచ్చు. ఏఎన్‌జిఆర్ఏయూ1 ఇది ఎర్ర గోంగూర రకం. విత్తనాలు నాటిన 30 నుండి 35 రోజులకే పంట కోతకు వస్తుంది. నీటి వసతి కలిగిన భూముల్లో ఒక ఎకరానికి దాదాపు 4 – 6 టన్నుల దిగుబడిని పొందవచ్చు.
పాలకూర: పాలకూర మంచి పోషక విలువలు కలిగిన ఆకుకూర. లేత ఆకులను కాండంతో సహా కూరగా వాడుతారు. ఇందులో అధికంగా విటమిన్ ‘ఎ’, ‘సి’, కాల్షియం మరియు ఇనుము వున్నవి. తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలో మంచి లాభాలను అందించే ఆకుకూర. అన్ని రకాల నేలల్లో సాగుచేయవచ్చు. కాని ఇసుకతో కూడిన ఎర్ర నేలల్లో అధిక దిగుబడినిస్తుంది. ఆల్ గ్రీన్, పూస, అర్క, అనుపమ, రకాలు అనుకూలం. ఎకరానికి 10 – 12 కిలోల విత్తనం అవసరం. మడుల్లో సాలుకు 10 – 20 సెం.మీ దూరం నాటుకోవాలి. 25 – 30 రోజుల్లో కోతకు వస్తుంది. ఆల్‌గ్రీన్ రకం ఆకులు, కాడలు ఆకుపచ్చ రంగులో వుంటాయి. ప్రతి 15-20 రోజులకొక కోత తీసుకోవచ్చు. ఎకరాకు 6-7 కోతలకు 5 టన్నుల దిగుబడి నిస్తుంది.
తోటకూర: తోటకూరను సాగు చేయడానికి ఇసుకతో కూడిన గరప నేలలు అనుకూలంగా ఉంటాయి. వివిధ శీతోష్ణస్థితుల్లో పెంచేందుకు తోటకూర చాలా అనువైంది. నీరు నిలిచే బంకమట్టి, ఇసుక నేలలు దీనికి పనికిరావు. జూన్ నుండి అక్టోబర్ వరకు జనవరి నుండి మే నెల మధ్య విత్తనాలు వేయాలి. అర్క వర్ణ, కో-1, కో-2, కో-3, కో-4, అర్కా సుగుణ వంటి రకాలు ఎంపిక చేయవచ్చు. ఎకరాకు 1 కిలో విత్తనం సరిపోతుంది. విత్తనం వెదజల్లితే ఎకరాకు 2 కిలోల విత్తనం కావాలి. విత్తేటప్పుడు పది రెట్లు ఇసుక కలిపి చల్లాలి. విత్తిన 25 రోజులకు కోత మొదలవుతుంది. మొదటి కోత తర్వాత ప్రతి పది రోజులకు కోత తీయవచ్చు. దిగుబడి 4 నుండి 5 టన్నులు వస్తుంది.
బచ్చలికూర : బచ్చలిని ఇండియన్ స్పినాచ్ లేదా మలబార్ స్పినాచ్ అని పిలుస్తారు. ఈ పంట భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో సాగవుతోంది. బచ్చలి కూర అధిక మోతాదులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఇనుమును సరఫరా చేస్తుంది. అంతేకాకుండా విటమిన్ ‘ఎ’, ‘సి’ లను కలిగి ఉంటుంది. లేత కాడలలో కూడా విటమిన్ ‘ఎ’ ఎక్కువగా ఉంటుంది. బచ్చలి కూరను అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. కాని అధిక దిగుబడి కోసం ఇసుకతో కూడిన గరప నేలలు చాలా అనుకూలమైనవి. ఎకరాకు 5 – 6 కిలోల విత్తనం అవసరం. వర్షాకాలంలో జూన్ నుండి జూలై వరకు నాటుకోవచ్చు. . దిగుబడి 4 నుండి 6 టన్నులు వస్తుంది.
చుక్క కూర: చుక్కకూరలో సమృద్ధిగా ఉండే పీచు పదార్థాలు (ఫైబర్), తిన్న ఆహారం త్వరగా మరియు సులభంగా జీర్ణమవడానికి ఎంతగానో తోడ్పడతాయి. ఏడాది పొడవునా దీన్ని సాగు చేయవచ్చు. నల్లరేగడి భూములు అనుకూలం. ఎకరాకు 6-8 కిలోల విత్తనం అవసరం. విత్తిన నెల తర్వాత కోత కోయవచ్చు. పంటకాలం 3 నుండి 4 నెలలు 20 నుండి 30 – 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.
కొత్తిమీర: కొత్తిమీర ఆకులతో పాటు విత్తనాల (ధనియాలు) ఉత్పత్తి కొరకు సాగయ్యే కొత్తిమీర, వంటల్లో సువాసనను, రుచిని పెంచడానికి అద్భుతంగా తోడ్పడుతుంది. పోషక విలువల పరంగా చూస్తే.. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, సుగంధ తైలాలు, పీచు పదార్థాలు మరియు విటమిన్-కె, ఎ, సి వంటి కీలక విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. జీర్ణక్రియను మెరుగుపరిచే విశేష గుణాలు ఉండటం వల్ల, దీనిని జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలకు ఔషధంగానే కాకుండా వివిధ ఆయుర్వేద చికిత్సల్లోనూ విస్తృతంగా ఉపయోగిస్తారు. కొత్తిమీరను దాదాపు అన్ని రకాల నేలల్లోనూ సాగు చేయవచ్చు. అయితే, వర్షాధార పంటగా పండించేటప్పుడు మాత్రం మురుగునీటి పారుదల సౌకర్యం ఉన్న బంక నేలలు అత్యంత శ్రేష్ఠమైనవి. ఎకరాకు 8 నుండి 10 కిలోల విత్తనాలు అవసరం. సురుచి, సుగుణ, సాధన, సింధు ముఖ్యమైన రకాలు అందుబాటులో ఉంటాయి. విత్తిన నెలకే కోతకు వస్తుంది. ఎకరాకు 15 నుండి 20 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుంది.
పుదీన: పుదీనాను అటు ఆకుకూరగాను, ఇటు సుగంధ తైలం ఉత్పత్తి కొరకు విరివిగా సాగు చేస్తారు. మనదేశంలో జపనీస్ పుదీనాకు ఎక్కువ గిరాకీ ఉంది. దీని నుండి తీసే తైలాన్ని సుగంధ పాన్‌మసాలాల తయారీలోనే కాకుండా.. దగ్గు, జలుబు, నొప్పుల నివారణ ఔషధాలలోనూ విస్తృతంగా ఉపయోగిస్తారు. ఉష్ణ వాతావరణంలో బాగా పెరుగుతుంది. చలి, మంచు అనుకూలించవు. ఎర్రనేలలు మరియు నల్ల నేలలు అనుకూలం. జపాన్ పుదీన, కోసి, హిమాలయ, శివాలిక్ రకాలు అందుబాటులో ఉంటాయి. నాటిన నాలుగు నెలలకు కోత ఆరంభమవుతుంది. ఎకరానికి 12-16 టన్నులు దిగుబడి వస్తుంది.
మెంతి కూర: దీనిని ఆకుకూరగాను, గింజలను పచ్చళ్ళలోను ఉపయోగిస్తారు. సుగంధ ద్రవ్య పంటల్లో ఇదోకటి. ఈ పంట సాగుకు చల్లని వాతావరణం, తక్కువ ఉష్ణోగ్రత మరియు తగినంత తేమ అనుకూలం. వర్షాధారం కింద నల్లరేగడి నేలల్లో, నీటి వసతి కింద గరపనేలలు, ఎర్రనేలలు మరియు ఇతర లేతపాటి నేలల్లో సాగుకు అనుకూలం. విత్తనాల్లో గుజరాత్ మెంతి-1 రకం అనువైనది. ఎకరాకు 6 నుండి 10 కిలోల విత్తనాలు సరిపోతాయి. విత్తిన తర్వాత 25 నుండి 30 రోజుల్లో మొదటి కోత తీసుకోవచ్చు. పక్షం రోజులకొకసారి చొప్పున మూడు సార్లు కోత కోయవచ్చు. ఎకరానికి 4-5 టన్నులు దిగుబడి వస్తుంది.
బి. చంద్ర శేఖర్, నేల (మృత్తికా) శాస్త్ర అధ్యాపకులు, పీజీఐహెచ్ఎస్ (PGIHS), ములుగు, సిద్దిపేట, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (SKLTGHU). Ph: 8374275258
మీనామృతం తయారుచేసి వడపోసేటప్పటికి అందులోని చేప ముక్కలు పూర్తిగా కరగకుండా కొంతమేరకు మిగిలే ఉంటాయి. అటువంటి చేప ముక్కలను పారేయకుండా తిరిగి ఉపయోగించవచ్చు. వీటిలోని ఉపయుక్త సూక్ష్మజీవులు (ఇండిజినెస్ మైక్రో ఆర్గానిజమ్స్ – ఐ.ఎం.ఓ.లు) లేదా మత్స్య సంజీవని నేలను సారవంతం చేస్తుంది. వేరు వ్యవస్థకు రక్షణగా ఉండి వేరుకుళ్లు, ఎండు తెగుళ్లు వంటి వాటి నుంచి వేర్లను కాపాడుతుంది. వేరు వ్యవస్థ ద్వారా సూక్ష్మ, స్థూల పోషకాలను అందిస్తుంది. వ్యాది నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
మత్స్య సంజీవని తయారీకి కావాల్సిన పదార్థాలు చేప ముక్కలు (మీనామృతం తయారీలో మిగిలిన వాటితో పాటు తాజా చేప ముక్కలను కూడా వాడవచ్చు) – కిలో, నల్లబెల్లం – 500 గ్రాములు, దేశీ ఆవు నెయ్యి / వెన్న – 50 గ్రాములు, తాటికల్లు – 1 లీటరు, తేనె – 50 గ్రాములు, కాచి చల్లార్చిన నీరు – 5 లీటర్లు
మత్స్య సంజీవనిని తయారుచేసే పద్ధతి: ఒక మట్టి పాత్రలో 50 గ్రాముల దేశీ ఆవు నెయ్యి లేదా వెన్న వేసి పొయ్యిమీద పెట్టాలి. అందులో కిలో చేప ముక్కలను, అర కిలో బెల్లం ముక్కలను వేసి బాగా ఉడికించాలి. చేప ముక్కలు ఉడుకుతున్నప్పుడు అడుగంటి మాడిపోకుండా తగినంత తాటికల్లు కలుపుతూ ఉండాలి. మరొక పాత్రలో 5 లీటర్ల మంచినీటిని మరిగించి చల్లారనివ్వాలి. ఒక మట్టికుండను తీసుకొని, అందులో కాచి చల్లార్చిన నీటిని, ఉడకబెట్టి చల్లార్చిన చేపముక్కలను వేయాలి. అందులో ఒక లీటరు తాటికల్లు, 50 గ్రాముల తేనె కూడా పోసి ఒక శుభ్రమైన తడిలేని కర్రతో బాగా కలియబెట్టాలి. కుండపై మూత ఉంచి దళసరి గుడ్డను రెండు పొరలుగా తీసుకొని బిగించి కట్టాలి. ఈ కుండను ఎండ తగలని చల్లని ప్రదేశంలో నేలలో గుంత తీసి పూడ్చి పెట్టాలి. 5Ð7 రోజుల తర్వాత కుండను వెలికి తీయాలి. కుండలో ఉపయుక్త సూక్ష్మజీవులు పూత పూసినట్టుగా, తెట్టులా తేలుతూ సాధారణంగా తెలుపు, ఆకుపచ్చ, నలుపు, ఊదా రంగులు కలగలసి ఉంటాయి. మత్స్య సంజీవని వాడే పద్ధతి: వంద కిలోలు బాగా చివికిన పశువుల ఎరువు లేదా వర్మి కంపోస్టుకు ఒక లీటరు చొప్పున మత్స్య సంజీవనిని కలిపి మొక్క పాదుల్లో చల్లాలి. వేప పిండి, ఆముదం చెక్క, గానుగ చెక్క వంటి సేంద్రీయ ఎరువులతో కూడా కలిపి వాడవచ్చు. 120 మైక్రాన్ల మెష్‌తో వడపోసి ఎకరానికి విడతకు 10 లీటర్ల చొప్పున డ్రిప్ ద్వారా అందించవచ్చు. వంద లీటర్ల నీటికి 3 లీటర్ల మత్స్య సంజీవనిని కలిపి మె°క్కలపై పిచికారీ కూడా చేయవచ్చు.
సాధారణ నామం : శ్నాప్ జింజర్/కార్డమం జింజల్ / ఇండియన్ జింజర్ / గులంగాల్ శాస్త్రీయ నామం : ఆల్పినియా కాల్కరేట / ఆల్పినియా గాలంగ కుటుంబం: ఆజింజిబెరేసి.
దుంపరాష్ట్రకం సుమారు 30-50 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. దీని ఆకులు పసుపు ఆకుల కంటే తక్కువ వెడల్పు గలిగి ఉంటాయి. బల్లెం ఆకారంలో సన్నగా ఉంటాయి. దీనిని దుంపల ద్వారా వ్యాప్తి చేయవచ్చు.
ఉపయోగాలు : ఔషధరంగంలో …
వేరు దుంపలను ఔషధంగా ఉపయోగిస్తారు. దుంపలలో సినియోల్, మిథైల్ సిన్నమేట్, కెంపెఫెరిన్ అనే రసాయనాలు ఉంటాయి.
దుంపలు చేదుగా, కారంగా ఉంటాయి. వీటిని వాతం, నొప్పులు, కడుపులో ఉబ్బరం, మలబద్ధకం నివారణకు ఉపయోగిస్తారు.
వీర్యపుష్టి, నడుములకు సత్తువ కలుగజేస్తుంది.
దుంప పొడి (13 గ్రా.)ని శ్వాసకోశసంబంధిత, హృదయ సంబంధిత వ్యాధుల నివారణకుపయోగిస్తారు.
దుంపపొడి జీర్ణశక్తిని కూడా పెంచుతుంది.
వ్యవసాయరంగంలో
దుంపరాష్ట్రకం క్రూడ్ ఇథనాల్ ద్రావణం మరియు నీటిలో కరిగే కారకం నిల్వ ధాన్యంలో ఆశించే పురుగు ట్రైబోలియం కాస్టానియంపై అధిక కీటకనాశక చర్యను ప్రదర్శించింది. (పర్వీన్, అతని అనుచరులు, 2016).
దుంపరాష్ట్రకం ఆకులలోని ఎసెన్షియల్ ఆయిల్ వరి నిల్వధాన్యంలో ఆశించే సైటోఫిలస్ ఒరైజెపై వికర్షక, విషచర్యలను ప్రదర్శించింది (పరనగమ, అతని అనుచరులు, 2004).
ఆల్పినియా గాలంగ ఎసెన్షియల్ ఆయిల్ ఆసియన్ సబ్‌టెర్రీనియన్ చెదలు, కోప్టోటెర్మస్ గెస్ట్రాయ్, కోప్టోటెర్మస్ కర్విగ్నాస్ పై యాంటీ ఫీడెంట్ చర్యను ప్రదర్శించింది (అబ్దుల్లా, అతని అనుచరులు, 2015).
ఆల్పినియా గాలంగ దుంపల నుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్ సిగరెట్ బీటిల్, లాసియోడెర్మా సెర్రికోర్నె పెద్ద పురుగులపై స్పర్శ విషచర్య, ఫ్యూమిగెంట్ విష చర్యను ప్రదర్శించింది (వు, అతని అనుచరులు, 2014).
దుంపరాష్ట్రకం సహజ ఉత్పత్తులు ఎస్కెరిచియా కోలి, స్టెఫైలోకోకస్ ఆరియస్, స్ట్రెప్టోకోకస్ న్యుమోనియె, సూడోమోనాస్ ఈరోజినోసా, ఎంటరోబాక్టర్ ఈరోజినెస్, సాల్మొనెల్ల పారట్రెఫి, విబ్రియో కలరా, బాసిల్లస్ సబ్‌టైలిస్‌పై గణనీయమైన యాంటిమైక్రోబియల్ చర్యను ప్రదర్శించాయి (రాబిన్‌సన్, అతని అనుచరులు, 2009).
ఆల్పినియా గాలంగ హెక్సేన్ క్రూడ్ ద్రావణం బ్రాక్టోసిరా డోర్సాలిస్ పెద్ద పురుగులను అత్యంత సమర్ధవంతంగా నివారించింది (సుకిరన్, అతని అనుచరులు, 2010).
ఆల్పినియా గాలంగ క్యాబేజి డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లా క్ౙెåలోస్టెల్లా మరియు నిల్వ దాన్యంలో ఆశించే కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్ (రియాంటో, అతని అనుచరులు, 1998) మరియు సైటోఫిలస్ జియామెయిస్, ట్రైబోలియం కాస్టానియం (సుతిసట్, అతని అనుచరులు, 2011) నివారణలో ఉపయోగపడుతుంది.
ఆల్పినియా గాలంగ ఇథనాల్ మరియు పెట్రోలియం ద్రావణాలు 95-100% చెదలను (ఒడొంటెటెర్మెస్) చంపాయి (సౌమ్య, ఆమె అనుచరులు, 2016).
దుంపరాష్ట్రకం ఎసెన్షియల్ ఆయిల్ మరియు దానిలోని రసాయనం 1,8 సినియెల్ కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌పై ఫ్యూమిగెంట్ చర్యను, ఫ్యూమిగెంట్ మరియు స్పర్శ విషచర్యను ప్రదర్శించాయి (అబెయ్‌విక్రమ, అతని అనుచరులు, 2006).
ఆల్పినియా గాలంగ దుంపద్రావణం డైమండ్ బ్యాక్‌మాత్, ఫ్లూటెల్లా క్ౙెåలోస్టెల్లా, లార్వాలు మరియు అడ్ౙుకి బీన్ వీవిల్, కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్ పై కీటకనాశక చర్య ప్రదర్శించింది (డండాంగ్, అతని అనుచరులు, 1998).
ఆల్పినియా కంక్లూగెర మొక్కజొన్న నిల్వ ధాన్యంలో ఆశించే సైటోఫిలస్ జియామెయిస్ మరియు కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌పై స్పర్శ మరియు యాంటీఫీడెంట్ చర్యలను ప్రదర్శించింది (సుత్తిసుట్, అతని అనుచరులు, 2011).
ఆల్పినియా గాలంగ దుంప హెక్సేన్ మరియు ఇథనాల్ ద్రావణాలు బాక్ట్రోసిరా డోర్సాలిస్‌ని అత్యంత సమర్ధవంతంగా అరికట్టాయి (సుఖిరన్, అతని అనుచరులు, 2011).