అంధ్రర్రాష్ట్రంలో కొబ్బరి ఆధారిత ఉత్పత్తులు, కొబ్బరి పీచు, నార, ఇతర అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై కాయర్ బోర్డు, సెర్ప్, ఎంఎస్ఎంఈ, ఉద్యానశాఖ అదికారులతో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. ‘కోనసీమ జిల్లాలో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్నందున ఆ జిల్లాలో కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటుకు అవ కాశముంది. కొబ్బరి ఉత్పత్తుల నాణ్యత పెంచి దేశీయంగా.. అంతర్జాతీయంగా ఎగుమతులను ప్రోత్సహించాలి. రైతులకు అదనపు ఆదాయం కల్పించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలి. కొబ్బరి పంట సాగు, ఉత్పత్తి, అనుబంధ పరిశ్రమల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సిద్ధం చేయాలి’ అని అదికారులను ఆదేశించారు. సమావేశంలో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈవో శేఖర్ బాబు, సెర్ప్ డైరెక్టర్ శంకర్ ప్రసాద్ పాల్గొన్నారు.

13 May, 2026
