తెలంగాణలో కూరగాయల సాగును భారీగా ప్రోత్సహించడానికి ప్రభుత్వం రూ.215 కోట్లను బడ్జెట్లో కేటాయించిందని, కూరగాయల పందిళ్లు, యంత్ర పరికరాలకు సబ్సిడీలు ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తామని రాష్ట్ర ఉద్యాన సంచాలకురాలు యాస్మీన్ బాషా తెలిపారు. రాష్ట్ర ఉద్యానశాఖ, కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన రైతు వాలంటీర్ల శిక్షణ కార్యక్రమానికి గురువారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. “తక్కువ ఉత్పత్తి ఖర్చు, అధిక దిగుబడినిచ్చే పద్ధతులు, మల్టీ లేయర్ ఫామింగ్ను రైతులు చేపట్టాలి. పామఆయిల్ తోటల్లో అంతరపంటలుగా కూరగాయలు పండించాలి. మొక్కలను రైతులే స్వయంగా తయారు చేసుకునేందుకు అవసరమైన శిక్షణనిస్తాం” అని ఆమె తెలిపారు. ఉద్యాన వర్సిటీ వీసీ దండా రాజిరెడ్డి, శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో మాట్లాడారు.

27 Mar, 2026
