దోమను తట్టుకునే వరి రకాలను ఎంపిక చేసేందుకు పశ్చిమ గోదావరి జిల్లాలోని మార్టేరు వ్యవసాయ పరిశోధనా స్థానం కీటకశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బారియర్ తెర పద్ధతిని వినియోగిస్తున్నారు. ఈ ప్రక్రియలో ఎంపిక చేసిన వరి రకాలను ముందుగా నాటి, వాటితో పాటే సుడిదోమను ఆకర్షించే టీఎన1 వంటి రకాలనూ నాటుతారు. నాట్లు వేసిన 25 రోజుల తర్వాత 100 సెం.మీ. ఎత్తుండే పాలిథీన్ కవరును తెరలా కట్టి తేమశాతం అధికంగా ఉండేలా చూస్తారు. దోమల ఉద్ధృతిని పెంచే డెల్టా మెత్రిన్ను పిచికారీ చేస్తారు. తద్వారా దోమ వ్యాప్తి చెంది పంట ఎండిపోతుంది. ఈ ప్రక్రియను రెండు మూడు దశల్లో నిర్వహించి ఎంపిక చేసిన వరి రకాల్లో ఏదైతే దోమను తట్టుకొని ఆరోగ్యంగా పచ్చగా ఉంటుందో దానిని బ్రీడింగ్కు పంపిస్తామని కీటక శాస్త్రవేత్త ఆనందకుమార్ తెలిపారు.

27 Mar, 2026
