గుమ్మాలకు కట్టుకోవడంతోపాటు శుభకార్యాల్లో అలంకరణగా, బహుమతులుగా ఇచ్చేందుకు ధాన్యం కుచ్చులు తయారు చేసి విక్రయించడాన్ని ఉపాధిగా మలిచారు నిర్మల్‌ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిణి (డీఆర్డీవో) విజయలక్ష్మి. మూడేళ్ల క్రితం 50 కుచ్చులతో ప్రారంభించి, గతేడాది 400 వరకు వాటిని తయారుచేసి విక్రయించారు. ఈ ఏడాది గ్రామ సమాఖ్యల ఆధ్వర్యంలో సుమారు వెయ్యికిపైగా కుచ్చుల తయారీకి నిర్ణయించారు. కొద్దిగా పచ్చగా ఉన్నప్పుడే దొడ్డురకం వరిని కోసుకొచ్చి.. ఒక్కో కర్రను తీసుకుని.. అందులో ధాన్యం కలిగిన దాని వెన్నును తీస్తారు. అలా తీసిన వెన్నును దారంకు అల్లుతారు. ఇలా కుచ్చును తీర్చిదిద్ది ఒక్కో దానిని రూ.300 చొప్పున విక్రయిస్తున్నారు.