తెలంగాణ రాష్ట్రంలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు మొత్తం 321కి గాను సోమవారం వరకు 251 కేంద్రాలే ఏర్పాటు కావడంతో అరకొరగా కొనుగోళ్లు జరుగుతాయని, మరో 70 కేంద్రాలు ఏర్పాటు చేయిస్తేనే పూర్తిస్థాయిలో కొనుగోళ్లు జరుగుతాయని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం నివేదిక అందజేసింది. 45.32 లక్షల ఎకరాల్లో 28.29లక్షల టన్నుల పత్తి పండగా.. సోమవారం వరకు 36,567.38 టన్నుల మేరకు కొనుగోళ్లు జరిగాయని తెలిపింది. మొత్తం 42 లక్షల మంది రైతుల్లో 19,922 మంది మాత్రమే పత్తిని విక్రయించారని పేర్కొంది. మార్క్‌ఫెడ్ ద్వారా 129 కేంద్రాల్లో 12,025 మంది రైతుల నుంచి 38,648.90 టన్నుల మొక్కజొన్న. 38 కేంద్రాల్లో 1,884మంది రైతుల నుంచి 3,438 టన్నుల సోయాబీన్‌ను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది.

11 Nov, 2025
