బహిరంగ మార్కెట్లో పత్తి ధరలు తక్కువగా ఉన్నందున.. కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా భారత పత్తి సంస్థ (సీసీఐ) ఆధ్వర్యంలో 30 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ఇందులో 12 మార్కెట్ యార్డులు కాగా.. మిగిలినవి జిన్నింగ్ మిల్లులు. ఈ సీజన్లో క్వింటా పత్తి మద్దతు ధర రూ. 8,110గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది రాష్ట్రంలో 4,56,107 హెక్టార్లలో పత్తి సాగు చేయగా.. 8 లక్షల టన్నుల దిగుబడి రావొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పత్తి సేకరణలో భాగస్వాములయ్యే అధికారులందరికీ బుధవారం గుంటూరులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతులు తమ సందేహాల నివృత్తికి కాల్ సెంటర్ 76599 54529 నంబరులో సంప్రదించాలని అధికారులు కోరారు.

23 Oct, 2025
