వైఎస్సార్ కడప జిల్లా యోగి వేమన విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్థులు నారింజ రంగులోని ఈ పుట్టగొడుగులను గుర్తించారు. ఏపీలో మొదటిసారి తమ వర్సిటీలో గుర్తించినట్లు వైవీయూ వృక్షశాస్త్ర ఆచార్యులు మధుసూదన్‌రెడ్డి తెలిపారు. వీటిని కేశర పుట్టగొడుగులు అంటారని, తినడానికి పనికిరావని చెప్పారు. మొదట శ్రీలంకలో, ఆ తర్వాత ఖమ్మం, వరంగల్ అటవీ ప్రాంతాల్లో వీటిని కనుగొన్నారని పేర్కొన్నారు. రాలిపోయిన ఆకులు, కలప దుంగలపై పెరిగే ఈ పుట్టగొడుగులు వాటిని త్వరగా కుళ్లిపోయేలా చేసి మట్టిలో కలిపేస్తాయని వివరించారు. భూమిని గుల్లబరచడంలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు.

24 Sep, 2025
