2025-26 విద్యాసంవత్సరం నుంచి తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం బీఎస్సీ(అగ్రి), బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల్లో రైతు కూలీల పిల్లలకు 15 శాతం ప్రత్యేక కోటాను అమలు చేయనుంది. దీనికి ఎవరు అర్హులనే దానిపై అగ్రివర్సిటీ ఆదివారం మార్గదర్శకాలను విడుదల చేసింది.
- విద్యార్థులు 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యాభ్యాసంలో కనీసం నాలుగేళ్లు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివి ఉండాలి.
- విద్యార్థి లేదా అతడి తల్లితండ్రులు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం(జాబ్) కార్డును కలిగి ఉండాలి. జాబ్ కార్డు లేని పక్షంలో వారు ఎకరం లోపు భూమిని కలిగి ఉండాలి.

