రిజిస్ట్రార్ డాక్టర్ జి.ఇ.సిహెచ్. విద్యాసాగర్
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం 55వ స్నాతకోత్సవాన్ని జూలై 31వ తేదీ బదులుగా ఆగస్టు 2వ తేదీ (శనివారం) నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ జి.ఇ.సిహెచ్. విద్యాసాగర్ తెలిపారు. రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈ స్నాతకోత్సవం జరగనుందని అయన వివరించారు.
స్నాతకోత్సవానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సూచనలు, అడ్మిట్ కార్డు, డ్రెస్ కోడ్ తదితర వివరాలు త్వరలో విశ్వ విద్యాలయ వెబ్‌సైట్ www.pjtau.edu.in లో అందుబాటులో ఉంచనున్నట్లు విద్యాసాగర్ పేర్కొన్నారు.

