నల్ల బర్లీ పొగాకు రైతులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అండగా నిలిచింది. మద్దతు ధర కల్పిస్తూ.. మార్క్‌ ఫెడ్‌ ద్వారా కొనుగోళ్లు ప్రారంభించింది. ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో 7 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. సాగుదారులు తమ వివరాలను సీఎం యాప్‌లో నమోదు చేసుకొని, ఉత్పత్తిని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తున్నారు. అక్కడ మార్క్‌ ఫెడ్‌ సిబ్బంది రైతు, సరకు ఫొటోలను ఆన్‌లైన్‌లో అప్లోడ్‌ చేసి… నాణ్యతను బట్టి ధర నిర్ణయించి యాప్‌లో నమోదు చేస్తున్నారు. కొద్ది రోజుల్లోనే ఆ మొత్తం రైతు ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లపల్లి కేంద్రంలో కొనుగోలు ప్రక్రియను చిత్రాల్లో చూడొచ్చు.