వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ ఛైర్మన్
హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల సమావేశం
వ్యవసాయ పంటల ఉత్పత్తిలో ప్రస్తుతం 2 శాతం మాత్రమే ప్రైవేటు భాగస్వామ్యం ఉందని, దానిని మరింత పెంచే దిశగా ప్రభుత్వాలు చొరవ చూపాలని వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (సీఏసీపీ) చైర్మన్ విజయ్‌పాల్ శర్మ సూచించారు. సాంకేతికత సహాయంతో పంట ఉత్పత్తులను పెంచుకోవాలన్నారు. 2024-26 మార్కెటింగ్ సీజన్‌కు మద్దతు ధరల విధానం ఖరారుపై శుక్రవారం హైదరాబాద్‌లో దక్షిణ భారత రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంత అధికారులు, రైతు ప్రతినిధులతో కమిషన్ సమావేశం నిర్వహించింది. కమిషన్ సభ్యులు, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు, సంచాలకుడు గోపి, మార్కెటింగ్ సంచాలకుడు సురేంద్రమోహన్, ఇతర రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్‌పాల్ మాట్లాడుతూ ”స్థానిక అవసరాల మేరకు పంట నిల్వలకు సరిపడా గోదాములు నిర్మించడం ద్వారా రైతులకు పెట్టుబడి, వినియోగదారులకు కొనుగోలు భారాన్ని తగ్గించవచ్చు. తద్వారా సరసమైన కనీస మద్దతు ధరలు నిర్ధారణ సులభతరం అవుతుంది. దక్షిణ రాష్ట్రాల్లో నేలలు, వాతావరణ అనుకూలతలతో పాటు తక్కువ నీటితో పండే శనగలు, కుసుమలకు రానున్న రోజుల్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఆ పంటలను

