తోటకూర మొక్కకున్న లేత ఆకులు తెంపుకొని.. గింజ థకు రాగానే తొలగించేస్తాం. కానీ, గింజలే అసలైన పోషకాల గనులంటున్నారు.. శాస్త్రవేత్తలు. బియ్యం, గోధుమలకు ప్రత్యామ్నాయంగా మన మెనూలో తోటకూర ధాన్యం చేర్చాలంటున్నారు. ఇలా చేస్తే పోష కాహార లోపం, అధిక బరువు వంటి సమస్యలు తప్పుతాయని ప్రకాశం జిల్లా దర్శిలోని ఉద్యాన పరిశోధనా స్థాన శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. సుపరిచితమైన తోటకూర గింజల(కింగ్ సీడ్) పై ఇక్కడి శాస్త్రవేత్తలు ఏడాదిగా పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో వీటిని సాగుచేస్తూ, ఆహారంగా తీసుకుంటున్నారని గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో సాగుకు అనువైన రకాలు ఎంపిక చేసే పనిలోపడ్డారు. గింజల ప్రాధాన్యంపై ప్రజలకు అవగాహన కల్పించి, సాగుకు ప్రణాళికలు వేస్తున్నారు. ”బియ్యం, మొక్కజొన్న, గోధుమల మాదిరిగానే తోటకూర గింజల్లో 14-16% ప్రొటీన్లు ఉంటాయి. నాణ్యమైన లైసిన్లు, అమైనోయాసిడ్స్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, బీటా కెరోటిన్కు కొదవలేదు. వీటితో ఐరన్, విటమిన్-ఏ లోపాన్ని అధిగమించవచ్చు. గింజలను వేయించి పొడిగా మార్చి లడ్డూ, చిక్కీలు, పిండి వంటలతోపాటు బేకరీ ఉత్పత్తులు చేయొచ్చు. త్వరగా జీర్ణం అవుతాయి. మెక్సికన్ సంప్రదాయ మిఠాయి అలెగ్రియా ఈ పొడితోనే చేస్తారు” అని సీనియర్ శాస్త్రవేత్త మువ్వ రవీంద్రబాబు వివరించారు.

7 Jun, 2025
