తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం 11-12-2018 నుంచి 9-12-2023 మధ్య తీసుకున్న అప్పులకే రుణమాఫీ వస్తుందని తెలంగాణ రైతుసంఘం ఉపాధ్యకక్షులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. కాబట్టి బ్యాంకర్లు రైతులను అప్పులు చెల్లించాలని, రెన్యూవల్ చేసుకోవాలని, బుక్ అడ్జెస్ట్‌మెంట్ చేసుకోవాలని రైతులపై వత్తిడి తేవద్దు అని బ్యాంకర్లకు మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 15 లోపు ఏ ఒక్క రైతూ బ్యాంకు రుణాలను చెల్లించవద్దు. ఒకవేళ చెల్లించి మరలా రుణం తీసుకుంటే అవి కొత్త రుణాలుగా మారతాయి. కాబట్టి కొత్త రుణాలకు రుణమాఫీ వర్తించదు కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలని బ్యాంకర్లు పెట్టే ఒత్తిడిని పట్టించుకోవద్దని మల్లారెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు.

4 Jul, 2024
