కొన్ని సాంకేతిక కారణాల వలన 30 వేల ఖాతాలలో రుణమాఫీ డబ్బులు జమకాలేదు. పొరపాట్లు సరిచేసి గత ఐదేళ్ళలో రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తాము కాబట్టి రుణమాఫీ కాకపోయినా ఆందోళన చెందవద్దు అని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆగస్టు 15న రెండు లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని వైరాలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రారంభిస్తారు. ఎన్ని కష్టాలున్నా అర్హులందరికీ రుణమాఫీ చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం అని రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు.