తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రాణహిత-చేవెళ్ళ సుజల స్రవంతి ఎత్తిపోతలను తిరిగి నిర్మించాలని నిర్ణయించింది. నాటి కాలువలను వినియోగించి ఆయకట్టుకు సాగునీరు అందించాలని నిర్ణయించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొదలుకొని 7 ఉమ్మడి జిల్లాలలోని 16.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందివ్వాలని ఈ ఎత్తిపోతలను చేపట్టారు. వివిధ కారణాలతో ప్రాజెక్టు పునరాకృతిలో భాగంగా కాళేశ్వరం ఎత్తిపోతలగా మారిన విషయం తెలిసిందే. పాత ప్రాజెక్టుకు బదులుగా డా. బి.ఆర్. అంబేద్కర్ వార్థా ప్రాజెక్టు నిర్మించి ఆదిలాబాద్ జిల్లాకు నీరందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.


