దేశంలోని జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా పెరిగాయి. గత సంవత్సరం ఇదే సమయంతో పోల్చితే రిజర్వాయర్లలో నీటి నిల్వలు 126 శాతం అధికంగా నమోదైనట్లు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) వెల్లడించింది. పదేళ్ళ సగటుతో పోల్చితే నీటి నిల్వ స్థాయిలు 119 శాతం పెరిగినట్లు వివరించింది. దేశవ్యాప్తంగా ఆగస్టు 29 వరకు రిజర్వాయర్లలో నీటిమట్టం 144.333 బిలియన్ క్యూబిక్ మీటర్ల (బీసీఎం) వద్ద ఉందని, మొత్తం నీటి నిల్వ సామర్థ్యంలో ఇది 80 శాతం అని సీడబ్ల్యూసీ పేర్కొంది. 20 జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు ఉన్న 155 జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 180.852 బీసీఎంలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో కూడిన దక్షిణాదిలోని 43 ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా పెరిగాయి. వీటిల్లో మొత్తం 44.771 బీసీఎంల నిల్వ ఉన్నట్లు సీడబ్ల్యూసీ తెలిపింది. ఈ జలాశయాల్లో 49 శాతం నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇక సాదారణ నిల్వల స్థాయి 63 శాతమే.

1 Sep, 2024
