ఎల్‌నినో ప్రారంభమైంది

ఈ ఏడాది ఏప్రిల్ వరకు తటస్థ పరిస్థితులు ఉండగా తాజాగా తూర్పు, మధ్య పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పుల నేపథ్యంలో ఎల్‌నినో ప్రారంభమైందని ఇన్‌కాయిస్ ప్రకటించింది. ప్రస్తుత మే నుంచి 2027 జనవరి వరకు ఈ పరిస్థితులు కొనసాగుతాయని ఇన్‌కాయిస్ మంగళవారం ఓ బులెటిన్‌లో స్పష్టం చేసింది. ఇన్‌కాయిస్ ప్రత్యేకంగా రూపొందించిన బేయేసియన్ కన్వల్యూషనల్ న్యూరల్ నెట్‌వర్క్ (బీసీఎనఎన్) అనే డీప్ లెర్నింగ్ మోడల్ ద్వారా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను విశ్లేషించి అంచనాలను రూపొందించినట్లు పేర్కొంది. దీనిద్వారా భవిష్యత్తులో వచ్చే ఎల్‌నినో లేదా లానినా పరిస్థితులను 24 నెలల ముందస్తుగా అంచనా వేసే అవకాశం ఉందని తెలిపింది. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో పరిస్థితులు నెలకొనడం వల్ల భారత వేసవి రుతుపవన వర్షపాతంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్‌నినో వల్ల ఉత్తర హిందూ మహాసముద్రంలో బలమైన, సుదీర్ఘ సముద్రపు వేడిగాలులు ఏర్పడుతున్నాయని, ఇవి పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్నాయని వెల్లడించింది.

Read More

ఆంధ్రప్రదేశ్‌లో 4 రోజులు వర్షాలు..!

ఆంధ్ర రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు కురవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. గంటకు గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయొచ్చని తెలిపింది. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

Read More