వండని వంట… పుట్నాల పప్పు పచ్చడి
పుట్నాలపప్పు ఒక కప్పు, పదిహేను ఎండుమిర్చి, (మీ కారానికి తగ్గట్టు వేసుకోండి) కారానికి సరిపడా రాళ్ళ ఉప్పు, జీలకర్ర, చింతపండు, వెల్లుల్లి.
వెల్లుల్లిని ఇష్టపడనివాళ్ళు, ఇంగువ వేసుకోండి. లేదా మీ ఇష్టం!
మీకు ఇష్టమైతే, ఇందులో రెండురెబ్బల కరివేపాకు కూడా జోడించవచ్చు.
పైన చెప్పినవన్నీ తీసుకుని, తగినంత నీరు పోసి రోట్లో రుబ్బుకోవడమో, మిక్సీలో రుబ్బుకోవడమో మీ ఇష్టం.
అంతే, పప్పు పచ్చడి సిద్దం. పోపు, తాలింపు ఏమీ అవసరం లేదు.
వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటుంటే, దీని రుచి అమోఘం. మేము ఎక్కువగా సాయంత్రాలు, చారు కాంబినేషన్‌తో కాని, పచ్చిపులుసుతో కానీ తింటుంటాం.
కొంచెం పెరుగుతో పల్ౘ్న చేసుకుని, ఇడ్లీ, దోశెల్లోకి తిన్నా ఈ పచ్చడి రుచిగా ఉంటుంది.
(గమనికః శనగలను వేపితేనే, పుట్నాలు అవుతాయి. వేపినవి కద, పుట్నాలు వద్దు అనుకుంటే, శనగపప్పును నానబెట్టి, పుట్నాలకు బదులుగా వాడుకోవచ్చు)
రచన: శ్రీమతి పద్మావతి కొలను
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి


