జాతీయ పశు వ్యాధుల నియంత్రణ పథకం కింద పశు ఔషధి కేంద్రాలను కేంద్ర పశుసంవర్ధక-పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ రాష్ట్ర సంచాలకుడు డాక్టర్ టి. దామోదర్ నాయుడు బుధవారం ప్రకటించారు. వీటితో నాణ్యమైన జనరిక్ పశు ఔషధాలు చౌక ధరలకే అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ కేంద్రాలను ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు(పీఎం-కేఎస్‌కేలు), సహకార సంఘాల ద్వారా ఏర్పాటు చేస్తారని, జిల్లా, మండల కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ఆసక్తి ఉన్నవారు https://pashuaushadhi.dahd.gov.in వెబ్‌సైట్‌లో వివరాలు పొందవచ్చు లేదా, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారిని సంప్రదించాలని సూచించారు. ఈ కేంద్రాలకు ఆపరేటింగ్ మార్ౙిన్‌గా 20శాతం ఇస్తారని తెలిపారు.