వరికి బదులు పామాయిల్, అంతర పంటలను ప్రోత్సహించాలి – మంత్రి తుమ్మల
అధికారులు, ఉద్యోగులు ఎప్పటికప్పుడు రైతులను చైతన్య పరచాలని, వరికి బదులు పామా యిల్ వంటి లాభదాయక, అంతర పంటలను ప్రోత్సహించేందుకు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఆదివారం జరిగిన తెలంగాణ వ్యవసాయ అధికారుల ఆత్మీయ సమ్మేళనంలో జరిగింది. మంత్రి పాల్గొని మాట్లాడుతూ చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా పరికరాలను అందజేస్తామన్నారు. సమావేశంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యకక్షుడు చిన్నా రెడ్డి, తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం రాష్ట్ర చైర్మన్ బి. కృపాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి. కృపాకర్రెడ్డి ఇతర అధికారులు అనురాధ, రవీందర్, శశిధర్ రెడ్డి, మానస, వీణ తదితరులు పాల్గొన్నారు. మామిడిసాగుకు ఉత్తరప్రదేశ్ తరహా విధానాలు మామిడిసాగులో దేశంలో అగ్రస్థానంలో ఉన్న ఉత్తర్ ప్రదేశ్ తరహా విధానాలను తెలంగాణలో అమలు చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. యూపీ ఉద్యాన సహకార మార్కెటింగ్ సమాఖ్య ఎండీ వినయ్ కుమార్ ఆదివారం మంత్రిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వినయ్ యూపీలో మామిడి సాగు విధానాలను వివరించారు. ఆయన వెంట తెలంగాణ ఉద్యాన సంయుక్త సంచాలకుడు బి. బాబు ఉన్నారు. అంతకుముందు యూపీ ఉద్యానవన సహకార సమాఖ్య ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఉద్యాన శిక్షణ సంస్థలో కొనుగోలు, అమ్మకందారుల సదస్సు నిర్వహించారు. తెలంగాణ ఉద్యాన సంచాలకురాలు యాస్మీన్ బాషా, ఇతర అధికారులు హాజరై వివిధ అంశాలపై చర్చించారు.






