తెలంగాణా బడ్జెట్లో వ్యవసాయ రంగానికి భారీగా నిధులు
2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను తెలంగాణ డిప్యూటీ సి.యం. మరియు రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఈరోజు వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ వాల్యూ 2,91,159 లక్షల కోట్లు కాగా అందులో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తూ మొత్తం రూ. 72,659 కోట్ల రూపాయలు రైతాంగానికి కేటాయించింది. రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలకు ఈ నిధులను వినియోగించనుంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యాన పంటలు, ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు సిద్ధమయ్యి వరికి క్వింటాలుకి రూ. 500/-లు ఇవ్వనున్నట్లు, అదీను ఈ పంట నుంచే అమలులోకి వస్తుందని డిప్యూటీ సి.యం. భట్టివిక్రమార్క తెలిపారు.

