బాలానగర్ సీతాఫలానికి భౌగోళిక గుర్తింపునివ్వాలి!ఉద్యాన వర్సిటీ దరఖాస్తు
దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పాలమూరు బాలానగర్ సీతాఫలానికి భౌగోళిక గుర్తింపు ఇవ్వాలని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం దరఖాస్తు చేసింది. చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ (జీఐఆర్) కార్యాలయంలో మూడు రైతు ఉత్పత్తి సంస్థల పేరిట విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త, ప్రాజెక్టు ప్రధాన శాస్త్రవేత్త పిడిగం సైదయ్య, జీఐ ప్రాక్టీషనర్ సుభాజిత్ సాహాతో కలిసి దరఖాస్తును సమర్పించారు. దీనిపై త్వరలో జీఐఆర్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరతారు. అభ్యంతరాలేమీ రాని పక్షంలో బాలానగర్ సీతాఫలానికి జీఐ గుర్తింపును మంజూరు చేస్తారు.

