1) వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన అధీకృత డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి.
2) రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన సందర్భంలో, నిర్ణీత ఫార్మాట్‌లో ఉన్న బిల్లు (రసీదు) అనగా దుకాణదారుని పేరు, అడ్రస్, సీడ్ లైసెన్స్ నంబరు, స్త్రఐఊ నంబరు మొదలగునవి ఉన్న రసీదును మాత్రమే అంగీకరించాలి.
3) రసీదుపై విత్తన కంపెనీ పేరు, విత్తన రకం పేరు, లాట్ నెంబరు, గడువు తేదీ మరియు డీలర్ సంతకము తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
4) కొనుగోలు చేసిన విత్తన ప్యాకెట్, సంచి, డబ్బాలపై సీలు ఉందా లేదా అని సరిచూసుకోవాలి. విత్తన ప్యాకెట్లపై ముద్రించిన సమాచారాన్ని బిల్లులో ఉన్న వివరాలతో సరిచూసుకోవాలి.
5) కొనుగోలు చేసిన దుకాణం నుంచి రసీదును తప్పనిసరిగా తీసుకోవాలి.
6) విత్తన ప్యాకెట్ మరియు బిల్లును పంట కాలం పూర్తయ్యే వరకు భద్రంగా దాచుకోవడం తద్వారా జన్యు స్వచ్ఛత లోపాల వల్ల లేదా మొలక శాతం తక్కువైనప్పుడు తగిన పరిహారం కోరే హక్కు రైతుకు ఉంటుంది.
7) లూజుగా ఉన్న సంచులు మరియు పగిలిన ప్యాకెట్లు, డబ్బాల్లో ఉన్న విత్తనాలను కొనుగోలు చేయరాదు.
8) గడువు దాటిన విత్తనాలను ఎట్టి పరిస్థితులలో కొనరాదు.
9) బిజి-3 పేరుతో చలామణి అవుతున్న HT విత్తనాలకు జిఇఏసి (GEAC) అనుమతి లేనందున ఈ రకం విత్తనాలను కొనడం, అమ్మడం మరియు సాగు చేయడం నేరము.
10) బీటీ కాటన్ విత్తన ప్యాకెట్లపై జి ఇ ఏ సి అప్రూవల్ నెంబర్ తేదీ, సదరన్ జోన్ అనగా తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయుటకు అనువైనదో కాదో విత్తన ప్యాకెట్‌పై ఉన్న సమాచారంతో సరి చూసుకోవాలి.
11) గ్రామాల్లో రాత్రికి రాత్రి వచ్చి అనధికారికంగా విక్రయించే నకిలీ విక్రయదారుల నుండి ఎట్టి పరిస్థితుల్లో విత్తనాలు కొనుగోలు చేయరాదు.
12) అనధికారికంగా, బిల్లు లేకుండా కలుపు మందును తట్టుకొనే H.T. (B.T.) ప్రత్తి విత్తనాలు అమ్ముతున్నట్లయితే సంబంధిత మండల వ్యవసాయ అధికారి లేదా జిల్లా వ్యవసాయ తనిఖీ బృందంకు ఫిర్యాదు చేయవలెను.
13) కలుపు మందును తట్టుకొనే బి టి (B.T.) ప్రత్తి పంట సాగుకు మన దేశంలో ప్రభుత్వ అనుమతి లేదు. స్త్రజూజ్పు అనుమతి లేని కలుపు మందు తట్టుకొనే ప్రత్తి విత్తనాలు సాగు చేసినా, అమ్మినా చట్టరీత్యా నేరము.
14) కలుపు మందును తట్టుకొనే ప్రత్తి విత్తనాలు ఉత్పత్తి చేసిన మరియు రైతులు పంట పొలాల్లో సాగు చేసినా, విత్తన చట్టం 1966, పర్యావరణ పరిరక్షణ చట్టం (జూఆజు) 1986 ప్రకారము నేరము.
15) అటువంటి వ్యక్తులపై చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకొనబడును. మన రాష్ట్ర ప్రభుత్వము ఆ.ఈ. యాక్ట్ ప్రకారం సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకొనబడుతున్నవి. కనుక రైతు సోదరులు ఇటువంటి ప్రత్తి విత్తనాలు సాగు చేయకూడదని కోరుచున్నాను.
16) నకిలీ విత్తనాలు / నకిలీ ప్రత్తి విత్తనాలు / కలుపు మందును తట్టుకొనే బి.టి. విత్తనాలు మరియు లూజు విత్తనాలను అమ్ముతున్నట్లు నమ్మశక్యమైన సమాచారం తెలపడము ప్రతి ఒక్కరి బాధ్యత మరియ వారి వివరాలు గోప్యంగా ఉంచబడును.
17) ఇట్టి సమాచారాన్ని మండల / డివిజన్ / జిల్లా వ్యవసాయాధికారికి తెలియచేయండి. – వ్యవసాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం