హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) శాస్త్రవేత్త జూకంటి అరవింద్‌కుమార్ ప్రపంచ మొక్కల జీవ, వృక్ష శాస్త్రం పరిశోధకుల్లో స్థానం సంపాదించారు. ప్రపంచ జాబితాలో దేశంలోని ఐకార్ నుంచి 22 మందికి అవకాశం దక్కగా అందులో అరవింద్‌కుమార్ ఒకరు. అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ వర్సిటీ వ్యవసాయ విభాగాధపతి జాన్ పీఏ అయోడినిస్ నేతృత్వంలో ఈ పరిశోధనలు సాగాయి. 2023-24లో చేసిన పలు అధ్యయనాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. నారాయణఖేడ్‌కు చెందిన అరవింద్‌కుమార్ 2012లో ఐకార్‌లో చేరారు 2017 నుంచి రాజేంద్రనగర్‌లోని వరి పరిశోధన సంస్థలో ఆయన పనిచేస్తున్నారు. జాబితాలో చోటు లభించడంపై శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఆయనకు అభినందనలు తెలిపారు.