ఎగుమతులు లేక మిర్చి ధరలు తగ్గుదల

మన దేశం నుంచి మిరప ఎగుమతుల్లో చైనా వాటా 30-35 శాతం మధ్య ఉంటుంది. 2020-21 సంవత్సరంలో 1.80 లక్షల టన్నులు, 2021-22లో 1.91 లక్షల టన్నులు, 2022-23లో 1.58 లక్షల టన్నులు, 2023-24లో 1.80 లక్షల టన్నులు చైనాకు ఎగుమతయ్యాయి. ఈ ఏడాది మరింత తగ్గాయి. ఎగుమతులు లేకపోవడమే మిర్చి ధరల పతనానికి ప్రధాన కారణమని వ్యాపారులు వివరిస్తున్నారు.
ఎగుమతికి అనుకూలమైన మిరప ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోనే లభిస్తుంది. ఇందులో అధిక శాతం చైనాకు ఎగుమతి అవుతుంది. మిరప అనుబంధ ఉత్పత్తులకు ఆశించిన స్థాయిలో ఎగుమతులు లేకపోవడంతో చైనాతోపాటు ఇతర దేశాల వద్ద నిల్వలు తరగడం లేదు. యూరప్‌, అమెరికాల్లో ఆర్థిక ఒడుదొడుకులే దీనికి కారణం. ఘాటు ఉండే మిరపకాయలను చైనాలో పండిస్తుడటంతో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎగుమతి అయ్యే తేజ రకానికి పోటీ వాతావరణం ఏర్పడింది.
బంగ్లాదేశ్‌, శ్రీలంక, సింగపూర్‌లకు ఎగుమతులు ఆశాజనకంగా ఉండటం కొంత ఉపశమనం కలిగిస్తోంది. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌లో పచ్చిమిర్చికి ఎక్కువగా కోయడం, ఎండుమిర్చి నాణ్యత దెబ్బతినడంతో అక్కడి నుంచి మన మార్కెట్‌కు పోటీ లేదు. ఆంధ్రప్రదేశ్‌లోనూ సాధారణ విస్తీర్ణం కంటే సాగు సుమారు 2 లక్షల ఎకరాలు తగ్గింది. ఉత్పత్తి తగ్గితే… ధరలు పెరగొచ్చనే ఆశలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.
గుంటూరు మార్కెట్‌కే…
గుంటూరు మిర్చియార్డుకు సగటున 40-45 వేల బస్తాలు వస్తున్నాయి. గుంటూరు మినహా ఇతర ప్రాంతాల్లో అమ్మకాలు ఆశాజనకంగా లేకపోవడంతో సరకు మొత్తం ఇక్కడికే వస్తోంది. వారం రోజుల నుంచి కొత్త పంట అమ్మకాలు మొదలయ్యాయి. ఎమ్మిగనూరు, నంద్యాల, కర్నూలు, ఆదోని తదితర ప్రాంతాల నుంచి 4-5 వేల బస్తాలు వస్తుండగా, క్వింటాకు గరిష్టంగా రూ. 14 వేల ధర మాత్రమే లభిస్తోంది.

Read More

పత్తి రైతులకు మద్దతు ధర ఇవ్వాలి

సీసీఐని కోరిన ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు

పత్తి కొనుగోళ్ళలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, రైతులకు కనీస మద్దతు ధర అందించాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి సచివాలయంలో సీసీఐ, మార్కెటింగ్‌ శాఖ అధికారులతో పత్తి కొనుగోళ్ళపై గురువారం జరిపిన సమీక్షలో సీసీఐని కోరారు. ప్రభుత్వం నిర్ణయించిన 11 యార్డులు, 60 జిన్నింగ్‌ మిల్లుల్లో విధిగా పత్తి కొనుగోళ్ళు జరిగేలా చూడాలని, తేమ శాతం విషయంలో సరళీకృతంగా వ్యవహించాలని అధికారులను ఆదేశించారు. పత్తిని ఆరబెట్టి, నాణ్యత ఉండేలా చూసుకుని, ప్లాస్టిక్‌ సంచుల్లో కాకుండా గన్నీ బ్యాగ్స్‌లో తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో సీసీఐ సీజీఎం పాణిగ్రహీ, జీఎం అమరనాథ్‌రెడ్డి, మార్కెటింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Read More

ప్రకృతి వ్యవసాయంకు రూ. 422.96 కోట్లు

ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు 43,402 కోట్లతో అగ్రికల్చర్‌ బడ్జెట్‌ను అసెంబ్లీలో ఈరోజు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 62 శాతం జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి ఉందని, కూటమి ప్రభుత్వం హయాంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి పెద్దపీట వేయడం జరిగిందని చెప్పారు. కేటాయింపులు ఇలా….
రాయితీ విత్తనాలకు రూ.240 కోట్లు
అన్నదాత సుఖీభవకు రూ.4,500 కోట్లు
భూసార పరీక్షలకు రూ.38.88 కోట్లు
విత్తనాల పంపిణీకి రూ.240 కోట్లు
ఎరువుల సరఫరాకు రూ.40 కోట్లు
పొలం పిలుస్తోంది రూ.11.31 కోట్లు
ప్రకృతి వ్యవసాయంకు రూ.422.96 కోట్లు
డిజిటల్‌ వ్యవసాయంకు రూ.44.77 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణకు రూ.187.68 కోట్లు
వడ్డీ లేని రుణాలకు రూ.628 కోట్లు
రైతు సేవా కేంద్రాలకు రూ.26.92 కోట్లు
ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్స్‌ రూ.44.03 కోట్లు
పంటల బీమా పథకానికి రూ.1,023 కోట్లు
వ్యవసాయ శాఖ రూ.8,564.37 కోట్లు
ఉద్యావన శాఖ రూ.3469.47 కోట్లు
పట్టుపరిశ్రమ రూ.108.4429 కోట్లు
వ్యవసాయ మార్కెటింగ్‌ రూ.314.80 కోట్లు
సహకార శాఖ రూ.308.26 కోట్లు
ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంకు రూ.507.038 కోట్లు
ఉద్యాన విశ్వవిద్యాలయంకు రూ.102.227 కోట్లు
శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయంకు రూ.171.72 కోట్లు
మత్స్య విశ్వవిద్యాలయంకు రూ.38 కోట్లు
పశుసంవర్ధక శాఖకు రూ.1,095.71 కోట్లు
మత్స్య రంగం అభివృద్ధి కోసం రూ.521.34 కోట్లు
ఉచిత వ్యవసాయ విద్యుత్‌కు రూ.7241.30 కోట్లు
ఉపాధి హామీ అనుసంధానంకు రూ.5,150 కోట్లు
ఎన్టీఆర్‌ జలసిరికి రూ.50 కోట్లు
నీరుపారుదల ప్రాజెక్టుల నిర్వహణకు రూ.14,637.03 కోట్లు

Read More
  • 1
  • 2