పోలవరం ప్రాజెక్టులో నాణ్యత చాలా ముఖ్యం
ఎదురయ్యే అన్ని సమస్యలను అధిగమిస్తూ… 2028 మార్చి నాటికల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని, త్వరగా పూర్తి చేయడమే కాదు… నాణ్యత కూడా చాలా ముఖ్యం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మంగళవారం వెలగపూడి సచివాలయంలో పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష జరిపిన సందర్భంలో చంద్రబాబు అన్నారు. ఇటీవలవరకూ పోలవరం ఎడమకాలువ పనులు 77 శాతం పూర్తయ్యాయని, రూ. 960 కోట్ల పనులకు టెండర్లు పిలిచామని, అధికారులు చెప్పారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్, సీఎంఓ కార్యదర్శి రాజమౌళి, ఈఎన్సి ఎం. వెంకటేశ్వరరావు, బావర్, మేఘా ప్రతినిధులు, ఇంజనీరింగు అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.


