‘అగ్రి’ డిప్లొమా కోర్సులకు 8 నుంచి కౌన్సెలింగ్
ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ‘అగ్రి’ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 8 నుంచి 11 వరకు వర్సిటీ ఆడిటోరియంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ విద్యాసాగర్ తెలిపారు. ”ర్యాంకులు, రిజర్వేషన్ల నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియ కొనసాగుతుంది. అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఫీజు మొత్తం తీసుకురావాలి. కౌన్సెలింగ్ తేదీల వారీగా ర్యాంకులు, ఇతర వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ www.pjtau.edu.in ను సందర్శించండి” అని స్పష్టం చేశారు.

