సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుతో ఆయిల్‌పామ్‌లో మంచి ఫలితాలు

తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగులో ఆధునిక సాంకేతికతను, పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఇక్రిశాట్‌లో 100 ఎకరాల్లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేసి ఆయిల్‌పామ్‌లో నాణ్యమైన విత్తనాలు, అధిక దిగుబడి రకాల వృద్ధి, హైబ్రిడ్ సృష్టికి ఇందులో పరిశోధనలు జరగనున్నాయి. ఈ మేరకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనిపై వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఉద్యాన శాఖ, కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయాలను ఆదేశించారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కోసం భారత్ ఆయిల్‌పామ్ పరిశోధన సంస్థ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్) ని సైతం భాగస్వామిగా చేర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దాంతో సంప్రదింపులు జరుపుతోంది. రాష్ట్రంలో 2.91 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగవుతోంది. ఏటా రెండు లక్షల ఎకరాల పెంపుదలను ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ప్రభుత్వ రంగంలో ఆయిల్‌ఫెడ్, ప్రైవేటు రంగంలో 14 కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆయిల్‌పామ్ సాగుకు సబ్సిడీలను ఇస్తోంది. ఇంత చేస్తున్నా ఆశించిన స్థాయిలో సాగు పెరగడంలేదు. ఈ నేపథ్యంలో ఆయిల్షామ్ సాగుకు ఏర్పడుతున్న అడ్డంకులను ప్రభుత్వం అధ్యయనం చేయించి, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.

Read More

ఆయిల్‌పామ్‌ ధరలు గత రెండేళ్లకు నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌కు సంబంధించి ప్రభుత్వం గత రెండేళ్లకు ధరలు నిర్ణయించింది. 2023-24 సంవత్సరానికి 2023 నవంబరు 1 నుంచి 2024 అక్టోబరు 31 వరకు ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ రేషియో పర్సంటేజి(ఓఈఆర్‌) 19.17%, గింజలకు 10. 25% చొప్పున ఇవ్వనున్నారు. 2024-25 సంవత్సరంలో ఇదే కాలానికి (ఓఈఆర్‌)19.42%, గింజలకు 10.15% చొప్పున చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. వ్యవసాయ, సహకారశాఖ ఎక్స్‌అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ సోమవారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.

Read More

మూడు విడతల్లో అన్నదాత సుఖీభవ సాయం

21న తొలి విడత చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి

అన్నదాత సుఖీభవ సాయాన్ని రైతులకు మూడు విడతల్లో అందజేస్తామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పీఎం కిసాన్‌ కింద కేంద్రమిచ్చే రూ.2 వేలు, రాష్ట్రం వాటా రూ.5 వేలు కలిపి ఈ నెల 21న తొలివిడతలో రూ.7 వేలు జమ చేస్తామన్నారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం వంగూరులో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏరువాక పౌర్ణమిని ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ఇటీవల గుంటూరు నుంచి ఎగుమతి అయిన మిర్చిలో పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని కొన్ని కంటెయినర్లను చైనా అధికారులు తిరస్కరించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన పంటను ఉత్పత్తి చేయాలి” అని వెల్లడించారు.

కోకో రైతులకు న్యాయం చేస్తాం
పెదవేగిలో సాగవుతున్న కోకో, పామాయిల్‌ పంటలను మంత్రి పరిశీలించి రైతులు, కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. పామాయిల్‌ తరహాలోనే కోకో గింజల కొనుగోలుకు విధాన నిర్ణయం తీసుకుంటామన్నారు. సరకు నాణ్యతతోనే గిట్టుబాటు ధరలు సాధ్యమవుతాయని స్పష్టంచేశారు. కంపెనీలు సాగు సమయంలో చెప్పే మాటలు ఆచరణలో విస్మరిస్తున్నాయని రైతులు మంత్రికి మొర పెట్టుకున్నారు. ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు రాయితీపై పరికరాలివ్వాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కోరారు. ఏలూరు మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన 50 కిలోవాట్ల సోలార్‌ రూఫ్‌ టాప్‌ ప్లాంట్‌ను మంత్రి ప్రారంభించారు.

Read More