ఔషధ మొక్క…. బిళ్ల గన్నేరు
సాధారణ నామం : మడగాస్కర్ పెరివింకిల్ / రోజ్‌పెరివింకిల్ శాస్త్రీయ నామం : కాథరాంథస్ రోసియస్ కుటుంబం: అపొసైనేసి²
బిళ్లగన్నేరు దీర్ఘకాలం జీవించే చిన్న పొద లేదా హెర్బల్ మొక్క. ఇది నిలువుగా 30-100 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. మొక్క మొదలు చెక్కలాగా ఉంటుంది. కొన్నిసార్లు ప్రాకుతుంది. తెల్లని పాలు కలిగి ఉంటుంది. కాండం గుండ్రంగా నిలువు బోదెలు కలిగి ఉంటుంది. ఆకుపచ్చ లేదా ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. ఆకులు ఎదురెదురుగా చిన్న ఆకు కాడపై ఏర్పడతాయి. ఆకు కాడలు 2.5 నుండి 9.0 సెం.మీ. పొడవుంటాయి. ఆకులు గుడ్డు ఆకారంలో ఉంటాయి కాని మొదలువైపు సన్నగా ఉంటుంది. ఆకులు ఆకుపచ్చ రంగులో పాలిపోయిన ఈనెలు కలిగి ఉంటాయి. ఆకు చివర గుండ్రంగా ఉంటుంది. కాండం, ఆకులు నూగు కలిగి ఉంటాయి. కొన్నిసార్లు నూగు ఉండదు. పూలు ఆకు మొదలులో ఏర్పడతాయి. ఇవి ఒకటిగా లేదా జంటలుగా అతి చిన్న కాడలపై ఏర్పడతాయి. కాయ 2.0 నుండి 4.7 సెం.మీ. పొడవుండి అనేక గింజలు కలిగి ఉంటుంది.

ఉపయోగాలు : ఔషధరంగంలో …
- మొక్క సమూలంగా ఔషధగుణాలు కలిగి ఉంటుంది. దీని ఆకులు క్యాన్సర్‌ని తగ్గించే విన్‌క్రిస్టిన్, విన్‌బ్లాస్టిన్ అనే ఆల్కలాయిడ్లను కలిగి ఉంటాయి. దీనిలో 70 రకాల ఇండోల్ ఆల్కలాయిడ్లు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి అజ్మొలిన్, విన్‌బ్లాస్టిన్, విన్‌క్రిస్టిన్, ఆల్‌స్టోనైన్, అజ్మాలినిన్, రెసెర్పిన్. దీనిని కడుపు నొప్పికి, కందిరీగ, తేనెటీగల కాట్లకి, స్త్రీలలో ఋతుసంబంధ నొప్పులకి, నిద్రకలిగించడానికి కూడా ఉపయోగిస్తారు.
- బిళ్ల గన్నేరు మొక్కని చిరకాలంగా ఆయుర్వేద, యునాని వైద్యంలో ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఈ మొక్కలో ఆల్కలాయిడ్స్, టానిన్స్ అనే రెండు రిసెర్పిన్ రకాల చురుకైన రసాయన మిశ్రమాలు ఉన్నాయి. ఈ మొక్కలో రెసెర్పిన్ ఉంది. బిళ్ల గన్నేరు రక్తపోటుని తగ్గిస్తుంది. రక్తపోటు తగ్గడానికి అర్ౙున్ క్యాప్సూల్స్ వాడాలి.
- ఈ మొక్క యాంటిడయాబెటిక్ అని రుజువైంది. హెల్త్‌విట్ జామున్ రసం తీసుకుంటే డయాబెటిస్ బాగవుతుంది. ఈ మొక్క యాంటిక్యాన్సర్ ఏజెంట్‌గా ఉపయోగపడుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సలో అతి సమర్ధవంతమైనది.
- దీనిని ల్యుకేమియా చికిత్సలో ఉపయోగిస్తారు. ఇది యాంటి బాక్టీరియల్, యాంటివైరల్ లక్షణాలను కలిగి ఉంది. ఈ మొక్క ద్రావణం డీసెంట్రి, డయేరియా చికిత్సలో ఉపయోగిస్తారు.
- దీనికి సహజంగా వాపు, నొప్పి తగ్గించే గుణముంది. బిళ్లగన్నేరు మొక్కలోని ఆల్కలాయిడ్ నుండి తయారు చేసిన ఔషధం పిల్ల…లో హోడ్గ్‌కిన్ లింఫోయా చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ పూవు పుష్పదళాలు, గింజలు యాంటిఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటాయి
- ఇది ముఖం మీద చిన్న మొటిమలు, ఎక్ౙిమ, డెర్మటైటిస్ వంటి అనేక చర్మ వ్యాధులను నయం చేస్తుంది. దీనిని ముక్కు నుండి రక్త స్రావం, చిగుళ్ళ నుండి రక్తస్రావం, రక్తం స్రవించే మూల వ్యాధి చికిత్సలో ఉపయోగపడుతుంది.
- ఈ మొక్క కషాయం కంటి ఇన్‌ఫెక్షన్, కళ్ల ఇర్రిటేషన్‌కి కూడా ఉపయోగిస్తుంది. మహిళలలో రక్తస్రావ సమస్యను క్రమబద్ధీకరిస్తుంది.
- ఈ మొక్కని నోటిలో అల్సర్ చికిత్సకు కూడా ఉపయోగిస్తారు. డిప్రెషన్, తొలనొప్పి, నాసియా, అలుపు సమయంలో ఈ మొక్క ద్రావణం ఊరడింపునిస్తుంది. బిళ్లగన్నేరు మలేరియా చికిత్సలో కూడా ఉపయోగపడుతుంది.
- ఆస్త్మా చికిత్సలో కూడా ఈ మొక్క చాలా ఉపయోగకరం. గాయం నుండి నేరుగా రక్తస్రావాన్ని కూడా ఆపుతుంది. బిళ్లగన్నేరు ఇన్ఫెక్షన్, వాపు నుండి కూడా ఊరడింపు కల్గిస్తుంది. పురుగు కాట్లకు కూడా ఈ మొక్కని ఉపయోగిస్తారు. బిళ్ల గన్నేరు సహజంగా మూత్రవర్థకం, మూత్రాన్ని పెంచుతుంది
వ్యవసాయరంగంలో
- బిళ్ళగన్నేరు ఆకుల నీటి ద్రావణాలు (1000 పిపియం) హెలికోవర్పా ఆర్మిజరా ।, ॥, ॥।, IV, V, V।వ దశ లార్వాలపై 2.60, 3.94, 7.75, 30.83, 38.53, 63.34% లార్విసైడల్ చర్యలను ప్రదర్శించాయి. బిళ్ళగన్నేరు ఆకుల ద్రావణాన్ని హెలికోవర్ప ఆర్మిజరా యాజమాన్యంలో జీవ పురుగు మందుగా ఉపయోగించవచ్చు. (అలగుచామి అండ్ దేవేంద్రన్, 2016).
- బిళ్ళగన్నేరు ఆకుల ఇథైల్ అసిటేట్ ద్రావణాలు హెలికోవర్పా ఆర్మిజరా ।, ॥, ॥।, ।V, V, V।వ దశ లార్వాలపై లార్విసైడల్ చర్యను ప్రదర్శించాయి. ఇథైల్ అసిటేట్ ఫ్రాక్షన్ ఆకు ద్రావణాన్ని హెలికోవర్పా యాజమాన్యంలో శక్తివంతమైన జీవ పురుగు మందుగా ఉపయోగించవచ్చు. (రమ్య, ఆమె అనుచరులు, 2008).
- పొగాకు లద్దె పురుగు, స్పోడోప్టెరా లిటూర 4వ దశ లార్వాలపై బిళ్ళగన్నేరు ద్రావణం మరియు బాసిల్లస్ తురింజెన్సిస్‌లను పర్యావరణహిత పురుగు మందులుగా ఉపయోగించవచ్చు. (పన్నీర్ సెల్వం, అతని అనుచరులు, 2013).
- బిళ్ళగన్నేరు ద్రావణం (0.5%) స్పోడోప్టెరా లిటూర లార్వాలపై పెరుగుదల క్రమబద్దీకరణ ప్రభావం అధికంగా చూపింది (సమ్మర్‌వార్ అండ్ పాండె, 2018).
- బిళ్ళగన్నేరు, ఆముదం, బొప్పాయి, సీతాఫలం సేంద్రియ పురుగుమందుల ఆకు ద్రావణాలు తెగులు కారక శిలీంద్రాలయిన ఆస్పర్ౙిల్లస్ నైగర్, ట్రైకోడెర్మా రీసీ, పెనిసిలియం ఫ్యూమిక్సులోసమ్‌లను సమర్ధవంతంగా అరికట్టాయి. కాని వీటిలో బిళ్ళగన్నేరు ద్రావణం గణనీయమైన యాంటిఫంగల్ చర్యను ప్రదర్శించింది (కునావత్, అతని అనుచరులు, 2016).
- బిళ్ళగన్నేరు నీటి ద్రావణం క్యూలెక్స్ క్వింక్విఫాసియేటస్, ఈడెన్ ఈజిప్టిలార్వాలను పర్యావరణహిత పద్ధతిలో నివారించే సామర్థ్యం కలిగి ఉంది (కామాచి, అతని అనుచరులు, 2016).
- బిళ్ళగన్నేరు వేరు మరియు ఆకు ద్రావణాలు అనేక లార్వాలపై కీటకనాశక, యాంటిఫీడెంట్ మరియు పెరుగుదలను విచ్ఛిన్నం చేసే లక్షణాలను కలిగి ఉన్నాయి. ఈ ద్రావణాలు వరిలో పసుపు రంగు కాండంతొలుచు పురుగును, ప్రత్తి పంటలో నల్లి (బగ్) పురుగులను చంపాయి (రిచర్డ్ విలియం హేప్లూక్, 1999).
- బిళ్ళగన్నేరు ఆకుల ద్రావణం (2.0%) స్పోడోప్టెరా లిటూర 6వ దశ లార్వాల ప్యూపాలను 73.33% చంపింది (శాండీ అండ్ సమ్మర్‌వార్, 2016).
- సమగ్ర సస్యరక్షణ పథకంలో మొక్క నుండి వేరుచేసిన ఇన్‌సెక్ట్ గ్రోత్ రెగ్యులేటర్ (ఐజిఆర్) మానవులకు, పర్యావరణానికి సురక్షితం. స్సోడోప్టెరా లిటూర లార్వాలపై బిళ్ళగన్నేరు అసిటోన్ ద్రావణం 84.21% ఐజిఆర్ చర్యను ప్రదర్శించింది. అదే ద్రావణం హెలికోవర్పా ఆర్మిజరాపై 57.14% ఐజిఆర్ చర్యను ప్రదర్శించింది (నెమోలియా, అతని అనుచరులు, 2003).
- బిళ్ళగన్నేరు నుండి వేరు చేసిన రెండు సిస్టాటిన్స్ ఎస్కెరిచియా కోలి, స్టెఫైలోకోకస్ ఆరియస్‌పై యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించాయి (శర్మ, అతని అనుచరులు, 2011).
- బిళ్ళగన్నేరు ద్రావణం హిస్పిన్‌బీటిల్, బ్రోంటిస్పా లాంగిస్సిమాపై ప్రయోగశాలలో అధిక యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది. సెమీఫీల్డ్‌ట్రయల్‌లో ఈ ద్రావణం పురుగుల సంఖ్యను తగ్గించింది (చాయోజున్, అతని అనుచరులు, 2012).
- బిళ్ళ గన్నేరు ద్రావణం కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌పై 50% కి పైగా తక్కువ గాఢత వద్ద గుడ్లు పెట్టడాన్ని నిరోధించే చర్యను ప్రదర్శించింది (వన్మతి, ఆమె అనుచరులు, 2010)
- బిళ్ళగన్నేరు, తులసి ద్రావణాలు డిస్టెర్కస్ కోయెనిగీపై కీటకనాశక చర్యను ప్రదర్శించాయి (కాయెస్థ్ అండ్ గుప్తా, 2015).
- బిళ్ళగన్నేరు పూల మిథనాల్, నీటి ద్రావణాలు సెంటెల్లా మొక్కలలో బాక్టీరియా ఆకుమచ్చ కల్గించే జాంతోమోనాస్ క్యాంపెస్ట్రిస్ పాథోవర్ సెంటెల్లే పెరుగుదలను గణనీయంగా అరికట్టాయి (గ్రాసెలిన్, అతని అనుచరులు, 2011).
- బిళ్ళ గన్నేరు మిథనాల్ (92.33%), ఇథైల్ అసిటేట్ (91.33%), బెంజీన్ (98.33%), అసిటోన్ (0.44%), క్లోరోఫాం (92.33%) ద్రావణాలు టమాట ఎండుతెగులు శిలీంద్రకారకం, ఫ్యుజేరియం ఆక్సిస్పోరం పెరుగుదల నరికట్టాయి. (చౌగులె అండ్ అండోజి, 2016).
- బిళ్ల గన్నేరు, తులసి ఆకు ద్రావణాలు పొగాకు లద్దె పురుగు, స్పోడోప్టెరా లిటూర 4వ దశ లార్వాలపై యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించాయి. తులసి ఆకు ద్రావణం బిళ్లగన్నేరు ఆకు ద్రావణం కన్నా అధిక యాంటి ఫీడెంట్ చర్యను ప్రదర్శించింది (సుధ సమ్మర్ వార్ అండ్ జ్యోత్స్న పాండె, 2015).
- బిళ్ల గన్నేరు ఆకుల క్రూడ్ ద్రావణం బెండకాండం, కాయతొలుచు పురుగు, ఈరియాస్ విట్టెల్లాపై యాంటి ఫీడెంట్ చర్యను ప్రదర్శించింది. దీనిని జీవపురుగు మందుగా ఉపయోగించవచ్చు. (పవన్‌రాజ్, అతని అనుచరులు, 2016).
- బిళ్ల గన్నేరు ఆకుల నీటి, మిథనాల్ ద్రావణాలు మలేరియా వాహకం అనాఫెలిస్ స్టెఫిన్సి, బోదకాలు వాహకం, క్యులెక్స్ క్వింక్విఫాసియేటస్‌లను లార్విసైడల్, ప్యూపిసైడల్ చర్యల ద్వారా నియంత్రించే అద్భుత శక్తి కలిగి ఉన్నాయి (సెల్లాదురై సుబారాణి, ఆమె అనుచరులు, 2013).
- బిళ్లగన్నేరు సేంద్రియ ద్రావణం ట్రైకోడెర్మా రీసీ, పెనిసిలియం ఫ్యూమిక్యులోసం శిలీంద్రాలపై గణనీయమైన యాంటి ఫంగల్ చర్యను ప్రదర్శించింది (కుమవట్, అతని అనుచరులు, 2016).
- బిళ్లగన్నేరు పెట్రోలియం ఈదర్ ద్రావణం, బాసిల్లస్ తురింజన్సిస్, అనోఫెలస్ స్టెఫెన్సి వాహకాల నియంత్రణ కార్యక్రమంలో పర్యావరణహిత కారకాలుగా ఉపయోగించడానికి సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఈ రెండింటిని కలిపిన మిశ్రమం అనోఫెలిస్‌స్టెఫెన్సిపై అద్భుత లార్విసైడల్ చర్యను ప్రదర్శించింది (పన్నీర్ సెల్వం, అతని అనుచరులు, 2013).
- బిళ్ల గన్నేరు, బంతి, క్లీరోడెండ్రాన్ ఫిల్లోమెడిస్ ద్రావణాల మిశ్రమం డెంగ్యు వాహకం స్టెగోమియ ఈజిప్టీని సమర్ధవంతంగా నివారించింది. (కోకిల, ఆమె అనుచరులు, 2016).
- బిళ్ల గన్నేరు పూల ద్రావణం అనోఫెలిస్‌స్టెఫెన్సి (మలేరియా వాహకం) లార్వాలను సమర్ధవంతంగా చంపాయి. బిళ్లగన్నేరు పూల ద్రావణాన్ని సమగ్ర పురుగు యాజమాన్య కార్యక్రమంలో ఉపయోగించవచ్ౘ్ు (ప్రసాద్, అతని అనుచరులు, 2014).
- బిళ్లగన్నేరు కాండం ద్రావణం జీవ సేంద్రియ శిలీంద్రనాశినిగా మిరప నారు మొక్కల నాశించే ఫ్యుజేరియం ఆక్సిస్పోరమ్ పెరుగుదల నరికట్టింది. ఈ ద్రావణం గ్రీన్‌హౌస్‌లో మిరపనారు మొక్కలను ఫ్యుజేరియం ఆక్సిస్పరం ఆశించి నష్టపరచకుండా కాపాడింది. ఇది పర్యావరణ హిత పద్ధతి (జహారి అండ్ హలిమూన్, 2014).
- బిళ్లగన్నేరు వేరు, ఆకు ద్రావణాలు అనేక లార్వాలపై కీటకనాశక, యాంటిఫీడెంట్, పెరుగుదల నరికట్టే లక్షణాలను ప్రదర్శించాయి. ఈ ద్రావణాలు వరిలో పసుపు రంగు కాండంతొలుచు పురుగుని, ప్రత్తినాశించే నల్లి పురుగులను చంపుతుంది (ఫ్లూక్, అతని అనుచరులు, 2001).
- బిళ్లగన్నేరు, తులసి, లాంటానా ఇథనాల్ ద్రావణాల ప్రభావాన్ని ప్రత్తి పంటనాశించు రెడ్ కాటన్ బగ్, డిస్టెర్కస్ కోయినిగిపై “సీడ్‌డిప్ పద్ధతి” ద్వారా పరీక్షించారు. తులసి, లాంటానా ద్రావణాలు బిళ్లగన్నేరు ద్రావణం కంటే అధిక యాంటి ఫీడెంట్ చర్యను ప్రదర్శించాయి. 5వ దశ పురుగులను తులసి, లాంటానా ద్రావణాల కన్నా బిళ్లగన్నేరు ద్రావణం ఎక్కువగా చంపింది (కాయెస్థ్ అండ్ గుప్తా, 2016).
- బిళ్లగన్నేరు మొక్కని “సేంద్రియ సాధారణ బహుళ పంటల వ్యవసాయ పురుగుమందు” తయారీలో ఉపయోగిస్తారు.

కావలసిన పదార్థాలు :
- పసుపు, వేప, మిరప, అల్లం, వెల్లుల్లి, జిల్లేడు (కెలాట్రోపిస్ జైగాంటియా), జిల్లేడు (కెలోట్రాపిస్‌ప్రోసెర), బొప్పాయి, దానిమ్మ, తులసి, పొగాకు, లాంటానా, ఉమ్మెత్త, నిమ్మగడ్డి, అకలైఫా ఇండిక, ఆముదం, బిళ్లగన్నేరు, గన్నేరు, వావిలాకు, ఉల్లి, నల్ల మిరియాలు, సీతాఫలం, టేకు, వస, నీలగిరి, జట్రోఫా, పుదీన, గరిక, గోమూత్రం, గోమయం.
ప్రయోజనాలు :
- అన్ని రకాల పంటలకు అతి శక్తివంతమైన పురుగుమందు / కీటకనాశినిగా పనిచేస్తుంది. మొక్కలకు బాక్టీరియా, శిలీంద్రాలు, వైరస్‌లను తట్టుకునే శక్తినిస్తుంది. హానికర సూక్ష్మ జీవులను నాశనం చేస్తుంది. అనేక పురుగులను వికర్షిస్తుంది. ఫంగిసైడ్, లార్విసైడ్, జెర్మిసైడ్, వర్మిసైడ్, బాక్టీరిసైడ్, నెమటిసైడ్, మొల్లస్కిసైడ్‌గా పని చేస్తుంది. ఇది అన్ని పంటలలో సంపూర్ణ పురుగు మందు. దీనినుపయోగిస్తే ఏ ఇతర పురుగు మందును వాడనవసరం లేదు.
మోతాదు : 3% (30 మి.లీ. / 1 లీ. నీటిలో) ద్రావణం పిచికారి చేయాలి. ఒక ఎకరంలోని పంటపై ఒకసారి పిచికారి చేయడానికి 35 లీ. అవసరం.
నిల్వ : 36 నెలలు (శ్రీగోమాత గాయత్రి ఆర్గానిక్స్). - బిళ్లగన్నేరు ఆకు ద్రావణం (0.5%) 44.16% స్పోడోప్టెరా లిటూర రెండవ దశ లార్వాలను చంపింది (సుధ సుమ్మర్వార్ అండ్ జ్యోత్స్న పాండె, 2015).
- బిళ్లగన్నేరు ఆకు ద్రావణం కొల్లెటోట్రైకం గ్లియోస్పోరియాయిడిస్ (72.5), ఫ్యుజేరియం మొనిలిఫార్మె (70.1), ఆల్టర్నేరియా ఆల్టర్నేట (73.0) లపై బలమైన శిలీంద్రనాశక చర్యను ప్రదర్శించింది.
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.











