చౌడును తట్టుకునే వరి విత్తనం
మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా స్థానం తాజాగా ఎంసీఎం-125 అనే వరి రకాన్ని అందుబాటులోకి తెచ్ౘ్ింది. ఇటీవల దీనికి అనుమతులు లభించడంతో శాస్త్రవేత్తలు రైతులకు విత్తనాలను విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఎంటీయూ 1042, ఎంటీయూ 1061 విత్తనాలను సంకరం చేసి ఎంసీఎం-125 విత్తనాన్ని రూపొందించారు. ఇది ఖరీఫ్‌కు అనువైన రకమని, పంట కాలం 145 రోజులు ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రకం కొంతవరకు దోమపోటు, అగ్గి తెగులు, మెడవిరుపు తెగులును కూడా తట్టుకుంటుంది. మొక్క 110 నుంచి 115 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. ఎకరానికి.. చౌడు నేలల్లో 30 బస్తాలు, సాధారణ భూముల్లో 40 బస్తాల వరకు దిగుబడి ఇస్తుంది.
ఎంటీయూ-1061, బీపీటీ 5204 రకాలకు ప్రత్యామ్నాయంగా ఎంసీఎం-125 రకాన్ని చౌడు, సాధారణ భూముల్లో సాగు చేసుకోవచ్ౘ్ని పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కె. నాగేంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో కోస్తా ప్రాంతాల్లోని చౌడు భూములకు అనువైన వంగడమని చెప్పారు. రైతులకు విత్తనాలు అందుబాటులో ఉన్నందున వినియోగించుకోవాలని కోరారు.

