సాయిల్ హెల్త్ పాలసీపై మేథోమథనం
దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న నేలల సమస్యలను గుర్తించి వాటిని అధికమించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఈరోజు కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధనా సంస్థ, సంతోష్‌నగర్, హైదరాబాద్‌లో జరిగిన భారత్ సాయిల్ హెల్త్ పాలసీపై జరిగిన వర్క్‌షాప్‌లో రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ప, ద్మశ్రీ పురస్కార గ్రహీత డా. యడ్లపల్లి వేంకటేశ్వరరావు అన్నారు. నేలలో సేంద్రియ కర్బనం పెరగడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పచ్చిరొట్ట పైర్ల గురించి విస్తృతంగా ప్రచారం చేయడం, జీవామృతం, సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడేటట్లు చేయడం, పంట మార్పిడి విధానాలు అమలు చేయడం, మిశ్రమ సాగు పంటలను ప్రోత్సహించడం విధిగా చేయాలని వేంకటేశ్వరరావు తెలియచేశారు ఈ సదస్సులో దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు, రైతులు, భారత వ్యవసాయ పరిశోధనా మండలి శాస్త్రవేత్తలు పాల్గొని నేలల సమస్యలు, తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.





