‘లాబ్’ (లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా)తో లాభాలు
మొక్కలకు కావలసిన పోషకాలను సహజంగా అందించడానికి లాక్టిక్ ఆసిడ్ బాసిల్లస్ను (లాబ్) ఉపయోగించాలి.
లాక్టిక్ ఆసిడ్ ద్రావణం తయారీ
ఇందులో ఉపయోగించుచున్న పదార్థాలలో సహజంగా ఉండే ఎన్నో రకాల సూక్ష్మజీవుల వలన శిలీంధ్రాలు మరియు వైరస్ తెగుళ్ళ నియంత్రణలో ఈ ద్రావణం బాగా పనిచేస్తుంది.
కావలసిన పదార్థాలు :
బియ్యపు కడుగు : 5 లీటర్లు
ఆవు పాలు : 10 లీటర్లు
బెల్లం : 1 కిలో
తయారు చేసే పద్ధతి :
- 5 లీటర్ల బియ్యపు కడుగును ఒక కుండలో పోసి, మూతపెట్టి 7 రోజులు నీడలో ఉంచాలి.
- 7 రోజుల తరువాత పై ద్రావణానికి 10 లీటర్ల ఆవుపాలను కలపాలి.
- ఈ మిశ్రమాన్ని మూతపెట్టి మరలా 7 రోజులు నీడలో ఉంచాలి.
- ఈ మిశ్రమాన్ని వడపోసి దానికి బెల్లపు పొడిని కలపాలి.
- మిశ్రమాన్ని కర్రతో బాగా కలియబెట్టాలి.
- ఈ మిశ్రమాన్ని వడపోసి లీటర్ నీటికి 1 లేదా 2 మి.లీ. ద్రావణాన్ని కలిపి మె°క్కలపై స్ప్రే చేయాలి.
ఉపయోగాలు:
- ఈ ద్రావణాన్ని అన్ని పంటలలోను, పండ్ల తోటలలోను వాడవచ్చు.
- పంటకాలంలో 1-2 సార్లు పంటపై పిచికారి చేస్తే సత్ఫలితాలు పొందవచ్చు.

