ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నదిపై నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్ట్‌ జాతీయ ప్రాజెక్ట్‌ కాబట్టి 2014లో చేసుకున్న ఒప్పందం ప్రకారం దాని భాద్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. పోలవరం ప్రాజెక్ట్‌పై పెట్టే ఖర్చంతా కేంద్ర ప్రభుత్వానిదే అని వాగ్ధానం చేశారు. అంతేకాకుండా అమరావతి నిర్మాణాలకు 15 వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు, ఇతర సంస్థలతో ఇప్పిస్తామని కూడా వాగ్ధానం చేశారు. ఈ పరిణామాలతో పోలవరం ఆయకట్టు రైతుల, రాజధాని రైతుల భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది.