రూ.2.84 కోట్లు పులిచింతల ప్రాజెక్టు నిర్వహణ పనులకు
ఆంధ్రప్రదేశ్లోని పులిచింతల ప్రాజెక్టులో డీజిల్ జనరేటర్ సెట్ల ఏర్పాటు, కుడివైపున ప్యానెల్ కంట్రోల్ గదిలో అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు, ఇతర నిర్వహణ పనులకు రూ.2.84 కోట్లు ఖర్చు చేసేందుకు వీలుగా ప్రభుత్వం పాలనామోదం ఇచ్చింది. ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు.

