ఔషధ మొక్క… కసివింద
కసివింద ఎక్కువగా ఎర్రనేలలు, గరువు భూములు, రోడ్ల ప్రక్కన, కొండల దిగువ భాగంలో గట్ల మీద ఉంటుంది. సుమారు 60-90 సెం.మీ. ఎత్తు పెరిగి బలమైన వేర్లతో పొదవలే వ్యాపించి ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో ఈ మొక్కలు విపరీతంగా వ్యాప్తి చెంది ఇతర మొక్కలను రాకుండా చేస్తాయి. ఆకులు బలిష్టంగా చింతాకుల వలె ఉంటాయి. పూవులు పసుపు పచ్ౘ్రంగులో కొమ్మల సందులలో గుచ్ఛాలు వలె ఉంటాయి. వీటి విత్తనాలకు మొలకెత్తే శక్తి చాలా కాలం వరకు ఉంటుంది. ఇది విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది.
సాధారణ నామం : కాఫీసెన్న శాస్త్రీయ నామం : క్యాసియా ఆక్సిడెంటాలిస్ కుటుంబం: ఫాబేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
- ఆకులు, వేర్లు, గింజలు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. వీటిలో సెన్నోసైడ్లు, నాఫ్తలిన్ గ్లెåకోసైడ్లు, ఫ్లేవనాయిడ్లు, ఆవిరయ్యే నూనె, క్రైసోఫినాల్, ఎమోడిన్, క్రూడ్‌ఫైబర్, కాల్షియం, ఇనుము, నియోసిన్ మొదలగునవి ఉంటాయి.
- ఈ మొక్క వేరును మిరియాలతో కలిపి పాముకాటుకు విరుగుడుగా ఉపయోగిస్తారు. దీని వేర్ల కషాయం కుష్టువ్యాధి చికిత్సకు కూడా ఉపయోగపడుతుంది.
- మొక్క సమూలంగా కోరింత దగ్గు, వ్రణాలు, బొల్లి, మూత్రకోశ వ్యాధులు, మూర్ఛవ్యాధి, హిస్టీరియా వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది.
వ్యవసాయరంగంలో
- కసివింద పెట్రోలియం ఈదర్ మరియు ఎన్‌బ్యుటనాల్ ద్రావణాలు (200 మరియు 300 పిపియం) క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్ లార్వాలను 100% చంపాయి. దీనిని రసాయన పురుగుమందులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. (దీపక్ కుమార్, అతని అనుచరులు, 2014).
- కసివింద ఆకుల క్రూడ్ ఇథనాలిక్ ద్రావణం 80 మైక్రోగ్రాములు / మి.లీ. మోతాదుకు పైన రైపిసిఫాలస్ మాన్యులేటస్ గుడ్లు పొదగడాన్ని అకారిసైడల్ చర్య ద్వారా పూర్తిగా నివారించింది. (సునీల్, అతని అనుచరులు, 2012).
- కసివింద జీవపురుగుమందు మొక్కజొన్న పంటలో అత్యధిక పెరుగుదలనిచ్చింది. (పంగ్నాకోర్న్, అతని అనుచరులు, 1999). అదనంగా కసివింద మొక్కజొన్న పంటనాశించే పేనుబంక, రొఫాలోసైఫం మెయిడిస్, మొక్కజొన్న తొలుచు పురుగు, ఆస్ట్రినియా ఫ్యూమకాలిస్, ఆర్మివర్మ్, మితిమ్న సపరేటస్‌లను అత్యంత సమర్ధవంతంగా నివారించింది.
- కసివింద ఎసెన్షియల్ ఆయిల్ రైజోపెర్తా డామినిక, ట్రైబోలియం కాస్టానియం, క్రిప్టోలెస్టెస్ ఫెర్రుజినియస్, లైపోసెలిస్ పీటాపై కీటకనాశక చర్యను ప్రదర్శించింది (వాకిల్, అతని అనుచరులు, 2012).
- కసివింద ఆకుల నీటి ద్రావణం పునరుత్పత్తి చర్యను, చన్న పంక్టేటస్ చేపలలో యాంటిఇన్‌ఫ్లమేటరి చర్యను ప్రదర్శిస్తుంది. (మనె, అతని అనుచరులు, 2012).
- కసివింద ద్రావణం గోధుమ గింజలనాశించే ట్రోగోడెర్మా గ్రానేరియం పురుగు చావు మరియు పెద్ద పురుగుల సంతతిపై అధిక సామర్థ్యాన్ని ప్రదర్శించింది (దెర్బాలా, 2012).
- మొక్క రక్షణ వ్యవస్థలో ప్లాంట్ ప్రోటియేజ్ ఇన్హిబిటర్ (పిపిఐ) ఒక ముఖ్యభాగం. పిపిఐ మొక్కలనాశించే పురుగులు, సూక్ష్మజీవులపై చురుకుగా పనిచేస్తుంది. క్యాసియా స్పీసీస్ యాంటి ఇన్‌సెక్టిసైడల్ మరియు యాంటిమైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. కసివింద ఆకుల నుండి ఫిస్టులన్ అనే పిపిఐని వేరు చేశారు. ఈ పిపిఐ స్టెఫైలోకోకస్ ఆరియస్, ఎస్కెరిచియాకోలి, బాసిల్లస్ సబ్‌టైలిస్, క్లెబ్సియెల్లా న్యుమోనియాలను స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్‌కి సమానంగా అరికట్టింది (అరుల్ పాండి అండ్ సంగీత, 2012).
- కసివింద పూల ఇథైల్ అసిటేట్ ద్రావణం నుండి వేరు చేసిన రీన్ (1,8డైహైడ్రాక్సిఆంత్రాక్వినోన3కార్బాక్సిలిక్ యాసిడ్) 1000 పిపియం హెలికోవర్పా ఆర్మిజెరాపై 76.13% యాంటి ఫీడెంట్ చర్యను ప్రదర్శించింది. రీన్ హెలికోవర్పా ఆర్మిజెరా (67.5%), స్పోడోప్టెరా లిటోర (36.25)లపై లార్విసైడల్ చర్యను ప్రదర్శించింది. బ్రతికిన లార్వాలు రూపం మారిన పెద్ద పురుగులనుత్పత్తి చేశాయి (దురైపాండియన్, అతని అనుచరులు, 2010).
- క్యాసియాపెన్నా ద్రావణం అత్యంత సమర్ధవంతంగా గోధుమ గింజల నాశించే ట్రోగోడెర్మా గ్రానేరియంని అరికట్టింది. ఈ ద్రావణంలో కీటకనాశక చర్యగల వివిధ జీవ చర్యలు గల కాంపౌండ్స్ ఉన్నాయి. ఈ ద్రావణాన్ని గోధుమగింజలను ఈ పురుగు నుండి కాపాడటానికి రసాయన పురుగుమందులకు ఒక సురక్షిత ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. (దెర్బలా, 2017).
- చక్రపాణి మిశ్రా విశ్వవల్లభ (అధ్యాయం 8, శ్లోకం 39)లో పురుగుల నివారణకు కసివింద, శాపిండస్ ఎమార్ౙినేటస్, కానుగ, ఆల్‌స్టోనియా స్కాలరిస్, ఎంబెలియా రైబ్స్ బెరడు పొడిని ఆవుమూత్రంలో రాత్రంతా నానబెట్టి చెట్లలో ఆశించిన భాగాలపై పేస్టుగా పూయాలని సిఫారసు చేశారు (సాథేల్, 2004)
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.



