వండని వంట… ఎల్లిపాయ కారం
కావలసినవి:
పిడికెడు ఎల్లిపాయలు
తగినంత కారంపొడి.
పోపు కోసం – ఆవాలు, జీలకర్ర, మినప గుళ్ళు, మెంతులు, కరివేపాకు.
ముందుగా ఎల్లిపాయల పొట్టు వొలిచి రోట్లో వేసుకొని, తగినంత గళ్లుప్పు వేసి, కచ్చాపచ్చాగా దంచి, కారం పొడి వేసి ముద్ద అయ్యేలా దంచుకోవాలి. ఎల్లిపాయల నుండి వచ్చే నూనెకు, కారం ముద్దగా అవుతుంది. నీళ్లు కలుపకూడదు.
అంతే, ఎల్లిపాయ కారం రెడీ. అయిదు నిముషాలు పట్టదు చెయ్యడానికి. ఎప్పుడు అవసరం అయితే, అప్పుడు చేసుకోవాలి.
ఘాటైన సువాసనలీనే ఎల్లిపాయ కారాన్ని, వేడి వేడి అన్నం మీద వేసుకుని, దాని మీద కోల్డ్ ప్రెస్డ్ గానుగ నువ్వుల నూనె వేసుకుని తింటే, ఆహా అనాల్సిందే!
జొన్న రొట్టెలు, ఎల్లిపాయ కారం నూనె, రుచికరమైన కాంబినేషన్!
ఘాటైన కారం కనుక, అప్పుడప్పుడు తినడం మంచిది.
ఇష్టం ఉంటే కాస్తా నూనెలో ఆవాలు జీలకర్ర, కరివేపాకు, మినప్పప్పు వేసుకుని పోపు పెట్టుకోవచ్చు.
పోపు లేకున్నా, రుచి సూపర్‌గా ఉంటుంది!
కూరలు తయారు చేసుకునే అవకాశం లేనప్పుడు, అప్పటికప్పుడు ఎల్లిపాయ కారం క్షణాల్లో చేసుకోవచ్చు.
- శ్రీధర్ పోచంపల్లి
” వండని వంటలు ” బుక్ కోసం రైతునేస్తం పబ్లికేషన్స్ సంప్రదించండి 9676797777


