వండని వంట… బూడిద గుమ్మడికాయ జ్యూస్

కావాల్సిన పదార్థాలు

  • బూడిద గుమ్మడికాయ ముక్కలు – మనకు అవసరమైనన్ని
  • నిమ్మ రసం – రుచికి సరిపడా
  • మజ్జిగ – కొంచెం (కావాలంటే వేసుకోవచ్చు)
  • అల్లం-చిన్న ముక్క

తయారుచేయు విధానం: ఒక గ్లాసు జ్యూస్‌కు పెద్ద కప్పు ముక్కలు సరిపోతాయి. గుమ్మడికాయను దాని పైనున్న బూడిద పోయేలాగా బాగా కడగాలి. తర్వాత మనకు కావలసినన్ని ముక్కలు కోసుకోవాలి. కాయ పైనున్న చెక్కు, లోపల గింజలు తీయనవసరం లేదు. అన్ని వేసుకోవచ్చు. దీనిలో చిన్న గ్లాసు మజ్జిగ కానీ, నాలుగు స్పూన్ల పెరుగు కానీ వేసుకోవాలి. పెరుగు లేదా మజ్జిగ వద్దనుకుంటే కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు. గుమ్మడికాయలోనే నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అల్లం చిన్నముక్క తీసుకుని కట్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపి మిక్సీలో కానీ జ్యూసర్‌లో కానీ వేసుకుని జ్యూస్ తయారు చేసుకోవాలి. జ్యూస్ తయారయిన తర్వాత మిక్సీలో వేసుకున్న జ్యూస్‌ను వడకట్టుకోవాలి. జ్యూసర్‌లో అయితే వడగట్టనవసరం లేదు. దీనిలో నిమ్మరసం రుచికి తగినంత కలపాలి.

ఇప్పుడు కొంతమంది జ్యూస్ షాపుల వారు కూడా బూడిద గుమ్మడికాయ జ్యూస్ తయారు చేస్తున్నారు.
  • రచన : లతా కృష్ణమూర్తి, కుషాయిగూడ, హైదరాబాద్, తెలంగాణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… జ్యూస్

వేసవిలో శరీరంలో వేడి తగ్గించి శరీరానికి చలవచేసి అధిక దాహం తగ్గించే జ్యూస్ తయారీ…

కావలసిన పదార్థాలు: కర్బూజా పండు, గోండ్ కటోరా, సబ్జా గింజలు

తయారు చేయు విధానం: సబ్జా గింజలు, బాదం కటోరాలను రాత్రి నానబెట్టి ఉంచుకోవాలి.

కర్బూజా పండును తొక్క తీసి, ముక్కలు చేసుకుని జ్యూస్ చేసుకోవాలి.

గ్లాస్ జ్యూస్‌కి ఒక స్పూను సబ్జా గింజలు,

ఒక స్పూను బాదం కటోరా కలుపుకొని త్రాగడమే!

ఎంతో రుచికరంగా చల్లగా ఉంటుంది.

రచన: శాంత కర్రి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More