ఔషధ మొక్క…. దవనం
దవనం ఒక వార్షిక, నిలువుగా పెరిగే, కొమ్మలు కలిగిన సువాసన గల మొక్క. ఇది 40-60 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. ఆకులు నీలిఆకుపచ్చ రంగులో, ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడతాయి. ఆకులు కాడ కలిగి ఉంటాయి. పూలు పసుపు రంగులో ఉంటాయి. దీనిని దక్షిణ భారతదేశంలో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కువగా పెంచుతారు. ప్రపంచ వ్యాప్తంగా దీనిని ‘దవననూనె’ అని పిలుస్తారు..
సాధారణ నామం : దవన శాస్త్రీయ నామం : ఆర్టెమిసియా పాల్లెన్స్ కుటుంబం: ఆస్టరేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
- దవనం ఎసెన్షియల్ ఆయిల్ అనేక ఔషధ లక్షణాలను కలిగి ఉంది.
- వైరల్ రోగాలకి సమర్ధవంతమైన రక్షణ కవచం నిర్మిస్తుంది. శరీర అంతర, బాహ్య గాయాలను మాన్పుతుంది.
- దవనం యొక్క శక్తివంతమైన ఎసెన్షియల్ ఆయిల్ ఇన్ఫెక్షన్స్ కలిగించే బాక్టీరియా, సూక్ష్మజీవులు, శిలీంద్రాలు, వైరస్‌లతో పోరాడి అవి కల్గించే వ్యాధులను నయం చేస్తుంది.
- మహిళలలో రుతుచక్రాలను క్రమబద్ధీకరిస్తుంది. శ్వాస తీసుకోవడాన్ని సులభతరం చేస్తుంది.
- దవనం ఎసెన్షియల్ ఆయిల్ శరీరంలోని కండరాలు, రక్తనాళాలను వదులు చేసి మెదడు, నరాల వ్యవస్థకు కూడా విశ్రాంతినిస్తుంది. తద్వారా ఆందోళన, వత్తిడి, డిప్రెషన్, కోపాన్ని అదుపులో ఉంచుతుంది. దీనివలన మంచి నిద్రపోవచ్చు. గాయాలు త్వరగా మానేలా చేస్తుంది.
వ్యవసాయరంగంలో :
- దవనం (ఆర్టెమిసియా జొడైకా) ఎసెన్షియల్ ఆయిల్ (50%, 40%)తో శుద్ధి చేసిన 72 గంటల తర్వాత కాల్లొసోబ్రూకస్ మాక్యులేటస్ (అలసంద వీవిల్) పెద్ద పురుగులను అతి సమర్ధవంతంగా అరికట్టింది. ఎసెన్షియల్ ఆయిల్‌లోని పైపర్టోన్ (32.4%), కాంఫర్ (20.6%), (ఇ) ఇథైల్‌సిన్నమేట్ కీటకనాశక లక్షణాలు కలిగి ఉన్నాయి. (అబ్డఎలక్షహాడి, 2012).
- దవనం వేర్లలో అనేక ఎలిమెంట్స్ ఉంటాయి.
- దవనం ఎసెన్షియల్ ఆయిల్‌లని పెస్టాసోలైడ్ ‘ఎ’, స్పైరో అజఫిలోన్‌డెరివేటివ్ క్యాండిడా ఆల్బికాన్స్, జియోట్రైకం కాండిడం, ఆస్పర్ౙిల్లస్ ఫ్యూమిగేటస్‌పై శిలీంద్రనాశక చర్యను ప్రదర్శించింది.
- దవనం (ఆర్టెమిసియా హెర్బా ఆల్బా) ఎసెన్షియల్ ఆయిల్ ట్రైబోలియం కాస్టానియం, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్, ప్రత్యేకంగా రైజోపెర్తా డామినిక పురుగులను నివారించే శక్తి కలిగి ఉంది (పరిషియాన్, అతని అనుచరులు, 2012).
- దవనం (ఆర్టెమిసియా వుల్గారిస్) కాండంలోని ఎసెన్షియల్ ఆయిల్ ఈడెన్ ఈజిప్టి దోమ లార్వాలపై లార్వానాశక చర్యను ప్రదర్శించింది. సహజ పురుగు మందులనుపయోగించి వాతావరణ కాలుష్యాన్ని అరికట్టవచ్చు. (సుజాత అండ్ రంచితకుమారి, 2012).
- బ్రిటిష్ కొలంబియాలో కుందేళ్ళు, కోళ్ళనాశించే పరాన్నజీవుల చికిత్సకు దవనం మొక్కనుపయోగిస్తారు (లాన్స్ అండ్ టర్నర్, 2011)
- దవనం (ఆర్టెమిసియా యాన్యువ) ఎండిన ఆకులు (2% పొడి / 250 గ్రా. అలసంద గింజలకు) బ్రూచిడ్, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ పెద్ద పురుగులపై కీటకనాశక చర్యను ప్రదర్శించింది. (బ్రిసిబె, అతని అనుచరులు, 2011).
- దవనం మిథనాల్ ద్రావణం ఆలుగడ్డ దుంపల పొడి కుళ్ళు కల్గించే ఫ్యుజేరియం సొలాని పెరుగుదలనరికట్టి దుంపలను పొడికుళ్ళు ఆశించకుండా కాపాడింది. (జాకర్, 2014).
- దవనం (ఆర్టెమిసియా పార్విఫ్లోరా) క్రూడ్ ద్రావణం సజ్ౙలో వెర్రికంకి తెగులు కల్గించే స్ల్కీరోస్పోరా గ్రామినికోలా శిలీంద్ర బీజాలుండే స్పొరాంజియా ఏర్పడకుండా పూర్తిగా నివారించింది (దీపక్, అతని అనుచరులు, 2007).
దవనం ఎసెన్షియల్ ఆయిల్స్ నివారించే ధాన్యంలో ఆశించే పురుగులు




