ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికెట్ పాలకూ తప్పనిసరి

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కల్తీ పాల సంఘటనలు చోటు చేసుకోవడంతో రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ఫుడ్ కమిషనర్లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ సూచనలు జారీ చేసింది. పాల సహకార సంఘాల సభ్యులు మినహా పాల ఉత్పత్తిదార్లు, విక్రయదార్లందరూ తప్పకుండా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సూచించింది. అంటే ఇకపై ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికెట్ లేకుంటే వీళ్లు పాల వ్యాపారాలను నిర్వహించొద్దు. ‘ఇటీవల కొన్ని చోట్ల పాలల్లో కల్తీ జరిగి నట్లు వార్తలు వచ్ౘ్ిన దృష్ట్యా… రిజిస్ట్రేషన్/ లైసెన్సింగ్ నిబంధనలు పాటింపులో కఠినంగా వ్యవహరించాల’ని వారికి ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. ఆహార ఉత్పత్తుల వ్యాపారాల కోసం రిజిస్ట్రేషన్ లేదా లైసెన్సు తీసుకోకుండానే కొందరు పాల విక్రయదార్లు, ఉత్పత్తిదార్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పేర్కొంది. అందువల్ల పాల ఉత్పత్తిదార్లు, విక్రయదార్ల దగ్గర నిర్దిష్ట రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్/లైసెన్సు ఉందా? అని పరిశీలించాల్సిందిగా కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన అధికారులకు ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. నిల్వ ఉష్ణోగ్రతల నిర్వహణలో నిబంధనలను సరిగ్గా పాటిస్తున్నారా? లేదా అని మిల్క్ చిల్లర్స్‌ను కూడా పరిశీలించాల్సిందిగా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

Read More

పంట ఉత్పత్తుల అమ్మకపు లేబుళ్లపై క్యూఆర్ కోడ్లు

వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంపై నమ్మకాన్ని పెంపొందించడానికిగాను మొక్కల ఆధారిత ఆహార తయారీదార్లు తమ ఉత్పత్తి లేబుళ్లపై క్యూఆర్ కోడ్లు వినియోగించాలని ఆహార భద్రతా ప్రాధికార సంస్థ FSSAI బుధవారం కోరింది. ప్రస్తుతం వాడుతున్న లేబుళ్లపై వివరాలను వినియోగదార్లు చదవడానికి ఇబ్బందిగా ఉన్నాయని పేర్కొంది. మొక్కల ఆధారిత ఆహార పదార్థాల సమ్మిట్‌లో FSSAI చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి రజిత్ పున్హాని మాట్లాడుతూ, క్యూఆర్ కోడ్లను తప్పనిసరి చేయాలని తాము చూడటం లేదన్నారు. కానీ కంపెనీలు స్వచ్ఛందంగా ఈ సాంకేతికతను స్వీకరించాలని కోరుకుంటున్నామన్నారు. తద్వారా యువ వినియోగదార్లు పదార్థాల జాబితాలను, పోషకాలను క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ధ్రువీకరించుకో గలుగుతారని తెలిపారు. ప్రస్తుత లేబుళ్లు చాలా చిన్నవిగా, చదవడానికి అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్నాయని పున్హాని వెల్లడించారు. ముఖ్యంగా జెన్‌జీ వినియోగదార్లు రోజువారీ పోషక అవసరాలను తనిఖీ చేయడానికి కోడ్లను స్కాన్ చేసుకుంటారని వివరించారు.

Read More