కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రైతులకు మరింత రుణ సదుపాయం
కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ)ల ద్వారా ప్రస్తుతం రైతులకు వ్యవసాయం, పశుపోషణ, పాడి పరిశ్రమ, మత్స్య సంపద, పట్టు పరిశ్రమ, తేనెటీగల పెంపకం కోసం రుణాలు ఇస్తుండగా… ఇకపై భూసార పరీక్షలు, వాతావరణ అంచనా సమాచార లభ్యత, సేంద్రియ ధ్రువీకరణ పొందేందుకు సైతం రుణాలు అందించేందుకు ఆర్బీఐ సంకల్పించి సంబంధిత ముసాయిదా మార్గదర్శకాలను గురువారం బ్యాంకులకు జారీచేసింది. వీటితోపాటు మరిన్ని మార్పుల కోసం రైతులు, ఇతర వినియోగదారులు మార్చి 6వ తేదీలోగా ఆన్‌లైన్‌లో ఆర్బీఐ వెబ్‌సైట్ ద్వారా తమ అభిప్రాయాలు చెప్పాలని కోరింది. దేశవ్యాప్తంగా 7.75 కోట్ల మంది రైతులకు ప్రస్తుతం కేసీసీలున్నాయి. మొత్తం 11 కోట్ల మంది రైతులకు ఈ కార్డులు ఇవ్వాలన్న కేంద్రం నిర్ణయానికి అనుగుణంగా ఆర్బీఐ తాజాగా నిబంధనల్లో మార్పులు చేసింది.


