34,196 టన్నుల పంట ఉత్పత్తులు కిసాన్ రైళ్ల ద్వారా రవాణా
బుధవారం లోక్సభలో తెదేపా ఎంపీలు కేశినేని శివనాథ్, లావు శ్రీకృష్ణదేవరాయలు, దగ్గుమళ్ల ప్రసాదరావులు అడిగిన ప్రశ్నకు కిసాన్ రైల్ పథకాన్ని 2020 ఆగస్టు 7న ప్రారంభించినప్పటినుంచి ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ నుంచి 116 సర్వీసుల ద్వారా 34,196 టన్నుల పంట ఉత్పత్తులను రవాణా చేసినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అస్సాం, బిహార్, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, త్రిపురలకు అరటి, మామిడి, ఉల్లితోపాటు మరికొన్ని పంట ఉత్పత్తులు రవాణా చేసినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నడిపిన 2,364 కిసాన్ రైళ్ల ద్వారా 7.9 లక్షల టన్నులు రవాణా చేసినట్లు చెప్పారు. ఈ రైలు సేవల ద్వారా రూ.318.68 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.

