రుణభారం తెలంగాణ రైతులకు తక్కువ
వివిధ రాష్ట్రాల్లో రైతులకు ఉన్న అప్పుల మొత్తంపై తమిళనాడు ఎంపీ ఎ. రాజా లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు వ్యవసాయ ప్రధానమైన కర్ణాటక, తమిళనాడు, ఏపీ లతో పోలిస్తే తెలంగాణలో రైతులకు రుణభారం తక్కువగా ఉందని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ‘2025 డిసెంబరు 31 నాటికి తమిళనాడు రైతులపై రూ.5,06,290.45 కోట్లు, ఏపీ రైతులపై రూ. 3,75,254. 59 కోట్లు, కర్ణాటక రైతులపై రూ.2,10,244.47 కోట్ల అప్పుల భారం ఉందన్నారు. ఇదే సమయంలో తెలంగాణ రైతులపై రూ.1,75,960. 56 కోట్ల అప్పు మాత్రమే ఉందని చెప్పారు. రైతు రుణభారంపై జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) 2025 డిసెంబరు 31 నాటికి కటాఫ్ డేట్‌గా తీసుకొని ఈ వివరాలు అందజేసినట్లు ఆయన వెల్లడించారు.

