71.86 లక్షల టన్నుల ధాన్యం సేకరణ
తెలంగాణాలో ఖరీఫ్ 2025-26 సీజన్‌లో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మొత్తం 71.86 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇందులో సన్నధాన్యం 39.08 లక్షల టన్నులు కాగా, దొడ్డు ధాన్యం 32.78 లక్షల టన్నులు. సన్న ధాన్యం రైతులకు క్వింటాకు రూ.500 అదనంగా చెల్లించారు. కొనుగోళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 8,448 కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. సాగు పెరగడంతో పాటు ఇటు పీపీసీలకు సన్నాలు భారీగా వచ్ౘ్ాయి. సేకరించిన ధాన్యంలో 71.83 లక్షల టన్నుల్ని పౌరసరఫరాల సంస్థ రైస్ మిల్లులకు తరలించింది. 0.03 లక్షల టన్నుల ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 7.49 లక్షల మంది రైతులు సన్న ధాన్యాన్ని విక్రయించగా.. ఇందులో 99.25% మంది అన్న దాతలకు ప్రభుత్వం సోమవారం నాటికి రూ.1,939.58 కోట్లను బోనస్‌గా అందించింది. మరో రూ.14.62 కోట్లు చెల్లించాల్సి ఉంది.


