ఔషధ మొక్క… గొబ్బి

గొబ్బి 60-100 సెం.మీ. ఎత్తు పెరిగే ఒక పొద. ఆకుల పైభాగం ముదురు ఆకుపచ్చ రంగులో, అడుగుభాగం లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఆకులు అండాకారం నుండి వెడల్పు తక్కువ గుడ్డు ఆకారంలో ఉంటాయి. పూలు సుమారు 5 సెం.మీ. పొడవు కలిగి గరాట ఆకారంలో ఉంటాయి. ఊదారంగు, లేత గులాబి రంగు లేదా తెలుపు రంగులో ఉంటాయి. కాయ 1.5 సెం.మీ. పొడవుండి కోడిగుడ్డు ఆకారంలో చిన్న సంచివలె ఉంటుంది. కాయ ముదిరినపుడు మెరుస్తూ ఉంటుంది.

సాధారణ నామం : హైగ్రోఫిలా/టెంపుల్‌ప్లాంట్/మార్ష్‌బార్బెల్ శాస్త్రీయ నామం : బార్లేరియా క్రిస్టేట కుటుంబం: అకాంథేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • థాయ్‌లాండ్‌లో గొబ్బిని సంప్రదాయ మూలికా సంబంధ మందుగా ఉపయోగిస్తారు. ఇది టానిక్, మూత్ర వర్థకం, మరియు రక్తశుద్దికారిణిగా పనిచేస్తుంది. తమిళనాడులో మహిళలు ఈ పూలను పూల చెండుగా ఉపయోగిస్తుంటారు.
  • దీని ఆకులు, వేర్ల వగరు రసం యాంటిబాక్టీరియల్, స్వేదనకారి, కఫహర లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిని తీవ్ర జలుబు చికిత్సలో ఉపయోగిస్తారు.
  • ఆకులు, వేర్ల కషాయాన్ని ఉడుకు, పుండుపై వాపులను తగ్గించడానికి పూస్తారు. గొబ్బి విత్తనాలను పాముకాటుకు విరుగుడుగా ఉపయోగిస్తారు.
  • ఆకుల మిథనాల్ ద్రావణం వాపు, నొప్పి తగ్గించే చర్యలను ప్రదర్శిస్తుంది. ఈ మొక్కలను అలంకరణ హెడ్ౙిగా పెంచుతారు.
  • ఈ మొక్కకి యాంటి ఆక్సిడెంట్, యాంటి డయాబెటిక్ లక్షణాలున్నాయి. బార్లేరియా ఇమ్‌ప్యూలినా మొక్కకి గాయం నయం చేసే ప్రభావముంది.

వ్యవసాయరంగంలో…

  • బార్లేరియా లాంగిఫోలియా ఇథైల్ ఎసిటేట్ ద్రావణంలోని కౌమారిన్, సపానిన్స్, టానిన్స్, స్టీరాయిడ్స్, స్పోడోప్టెరా లిటూరాపై అధికంగా 79.40% యాంటి ఫీడెంట్ చర్య, 77.36% లార్వానాశక చర్య ప్రదర్శించాయి. హెలికోవర్పా ఆర్మిజరాపై 70.96% యాంటి ఫీడెంట్ చర్య, 68-70% లార్వానాశక చర్య ప్రదర్శించింది. రూపుమారిన లార్వాలు, ప్యూపాలు, పెద్ద పురుగుల శాతం కూడా ఇథైల్ ఎసిటేట్ ద్రావణంలో నమోదైంది. పెద్ద పురుగులు విడుదలయ్యే శాతం కూడా తగ్గింది (చెన్నియన్, అతని అనుచరులు, 2016).
  • బార్లేరియా ప్రయోనిటిస్ యాంటిఆక్సిడెంట్, యాంటిమైక్రోబియల్ చర్యలను ప్రదర్శించింది. దీనిని పాముకాటు చికిత్సలో ఉపయోగిస్తారు (కరుప్పుసామి, 2007)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

పొటాష్‌కు పొగాకు ద్రావణం

మొక్కల ఎదుగుదలలో కీలకపాత్ర పోషించే పొటాషియంను అందించడానికి సులభ రీతిలో పొగాకు ద్రావణాన్ని తయారుచేస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో తయారుచేసే ఈ ద్రావణాలు రైతులకు ఎంతో ఉపయోగకరం.

పొగాకు కాడలను ముక్కలుగా చేసుకుని ఒక కిలో కాడలకు ఏడు లీటర్ల నీటిని కలిపి ఏడు రోజుల పాటు నానబెట్టాలి. దీనివల్ల నీటిలో కరిగే పొటాష్ తయారవుతుంది. అరటి పండు ద్వారా కూడా పొటాష్ ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు.

లీటర్ నీటికి మూడుశాతం ద్రావణాన్ని కలిపి ఇవ్వడం వల్ల మొక్కకు కావలసిన పొటాష్‌తో పాటు తెగుళ్ల బెడద తగ్గుతుంది.

Read More

‘లాబ్’ (లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా)తో లాభాలు

మొక్కలకు కావలసిన పోషకాలను సహజంగా అందించడానికి లాక్టిక్ ఆసిడ్ బాసిల్లస్‌ను (లాబ్) ఉపయోగించాలి.
లాక్టిక్ ఆసిడ్ ద్రావణం తయారీ

ఇందులో ఉపయోగించుచున్న పదార్థాలలో సహజంగా ఉండే ఎన్నో రకాల సూక్ష్మజీవుల వలన శిలీంధ్రాలు మరియు వైరస్ తెగుళ్ళ నియంత్రణలో ఈ ద్రావణం బాగా పనిచేస్తుంది.

కావలసిన పదార్థాలు :
బియ్యపు కడుగు : 5 లీటర్లు
ఆవు పాలు : 10 లీటర్లు
బెల్లం : 1 కిలో

తయారు చేసే పద్ధతి :

  • 5 లీటర్ల బియ్యపు కడుగును ఒక కుండలో పోసి, మూతపెట్టి 7 రోజులు నీడలో ఉంచాలి.
  • 7 రోజుల తరువాత పై ద్రావణానికి 10 లీటర్ల ఆవుపాలను కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని మూతపెట్టి మరలా 7 రోజులు నీడలో ఉంచాలి.
  • ఈ మిశ్రమాన్ని వడపోసి దానికి బెల్లపు పొడిని కలపాలి.
  • మిశ్రమాన్ని కర్రతో బాగా కలియబెట్టాలి.
  • ఈ మిశ్రమాన్ని వడపోసి లీటర్ నీటికి 1 లేదా 2 మి.లీ. ద్రావణాన్ని కలిపి మె°క్కలపై స్ప్రే చేయాలి.

ఉపయోగాలు:

  • ఈ ద్రావణాన్ని అన్ని పంటలలోను, పండ్ల తోటలలోను వాడవచ్చు.
  • పంటకాలంలో 1-2 సార్లు పంటపై పిచికారి చేస్తే సత్ఫలితాలు పొందవచ్చు.
Read More

మొక్కకు పోషకాలనందించే సస్యామృతం

వివిధ రకాల ఔషధ మొక్కలు, ఆవు పేడ ఆవు మూత్రంలో పులియబెట్టడం ద్వారా దీనిని తయారు చేసుకోవచ్చు.

ప్రయోజనాలు : ఇది మొక్కకు పోషకాలను అందించడమే కాకుండా కీటకాలు, తెగుళ్ళను నివారిస్తుంది.

 తయారీకి కావలసిన పదార్థాలు : ఆవు పేడ - 30-40 కి.; ఆవు మూత్రం - 5 లీ.; పాలుకారే మొక్కల (పాలకొడిశ, జిల్లేడు, జట్రోఫా, బొప్పాయి మొదలైనవి) ఆకులు - 5 కి.; ఘాటైన వాసనగల మొక్కల (వయ్యారిభామ, అత్తాకోడలు, తంగేడు తదితరాలు) ఆకులు - 5 కి.; నూనె గింజల చెక్క (వేరుశనగ, ఆముదం, కానుగ, నువ్వులు, వేప) చెక్కలో ఏదైనా - 2 కి.; బెల్లం - 1కి.; నువ్వులు, కంది లేదా పొగాకు కట్టెలు కాల్చిన  బొగ్గు లేదా పిడకబూడిద; నీరు - 100 లీ.; పై పదార్థాలన్నీ పట్టే ప్లాస్టిక్ డ్రమ్ము లేదా తొట్టి. 

తయారీ విధానం :

  • ముందుగా సేకరించిన ఆకులను తరిగి పెట్టుకోవాలి.
  • వీటిని ఆవుపేడ, మూత్రాలతో కలిపి డ్రమ్ములో వేసుకోవాలి.
  • దీనికి నూనె చెక్క బూడిద, బెల్లం కలపాలి.
  • డ్రమ్ములో వేసిన ఈ పదార్థాలను రోజు కలుపుతూ ఉండాలి.
  • తొట్టి లేదా డ్రమ్ము పై గోనె పట్టా కప్పి వుంచాలి.
  • వారం రోజుల్లో పూర్తిగా పులిసిపోయిన తర్వాత తయారైన ద్రావణాన్ని వడపోయాలి. ఆకులు, ఇతర పదార్థాల పిప్పి ఏదైనా మిగిలి వుంటే మొక్కలకు మల్చింగ్గా ఉపయోగించాలి.
  • తయారైన ద్రావణాన్ని ఎకరాకు 200 లీటర్లు డ్రిప్పు ద్వారా లేదా కాలువ ద్వారా పారించాలి.
  • మొక్కల పూత, కాత, గింజకట్టే దశల్లో 5 శాతం ద్రావణాన్ని పిచికారి చేయాలి.
Read More

ఔషధమొక్క… వస

వస మొక్క మంచి సువాసన కలిగి ఉంటుంది. ఇది తేమ ప్రదేశంలో బహువార్షిక మొక్క. ఆకులు దళసరిగా రెండు వరుసలలో అమరి ఉంటాయి. ఈ మొక్క దుంప నేలలో ఉంటుంది. లేత పసుపు రంగు పూవులు ఒక దొప్పలో అమరిఉంటాయి. గోదావరి జిల్లా అటవీ ప్రాంతాలలోను, ఉత్తర కోస్తా మండలంలోని గిరిజనులచే ఇది సాగు చేయబడుతుంది. ఈ మొక్క వేరును వైద్యపరంగా ఉపయోగిస్తారు. ఆకులను, దుంపలను వ్యవసాయంలో కీటకనాశనిగా ఉపయోగించవచ్చు. ఈ మొక్క వేర్లలో ఎకోరిన్, కెలామిన్, యూజినాల్, ఆల్ఫాఎసరోన్ వంటి రసాయనాలు ఉంటాయి.

సాధారణ నామం : స్వీట్ ఫ్లాగ్ శాస్త్రీయ నామం : అకోరస్ కలామస్ కుటుంబం : అకోరేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • వేరును ఆయుర్వేద మందులు తయారీలో ఉపయోగిస్తారు.
  • వ్యవసాయంలో కీటకనాశనిగా, తెగుళ్ళ నివారిణిగా….
  • ఆకులు, వేర్లలో ఉన్న రసాయనాలకు కీటకనాశని లక్షణాలు ఉన్నాయని శాస్త్రపరిశోధనలో తేలింది. పురుగులు, తెగుళ్ళ నివారణలో ఈ రసాయనాలెంతగానో ఉపయోగపడతాయి.

వ్యవసాయరంగంలో …

  • విత్తన నిల్వలలో ఆశించే పురుగులు : విత్తన నిల్వలలో ఆశించే పురుగుల నియంత్రణకు 3 గ్రాముల వస చూర్ణాన్ని ఒక కిలో విత్తనానికి కలిపి ఉంచడం ద్వారా సుమారు 3 నెలల వరకూ విత్తనాలను పురుగులబారినుండి కాపాడుకోవచ్చు. వరి ధాన్యాన్ని ఆశించే ముక్కుపురుగు, పప్పుధాన్యాలను (కంది, పెసర, మినుము, శనగ మొదలైనవి) ఆశించే పుచ్చు పురుగుల నుండి విత్తనాన్ని రక్షించుకోవచ్చు. వస దుంపల పొడికి ఉండే ఘాటైన వాసనకు పురుగులు వికర్షించబడతాయి.
  • పేనుబంక, ఆర్మివర్మ్, కాటన్ స్టెయినర్, పెద్దక్యాబేజి వర్మ్, ఆవాల రంపపు ఈగ, విత్తన నిల్వలో ఆశించే పురుగులను వస దుంప కషాయం నివారిస్తుంది.
  • దుంప కషాయం తయారు చేసే పద్ధతి (శ్రీధర్, అతని అనుచరులు, 2002)
  • ఎండిన దుంపలను దంచి 20 గ్రాముల పొడిని కుండలోని 2 లీటర్ల నీటిలో కలిపి ఒక రోజు నిల్వ ఉంచాలి. తర్వాత వడపోసి 8 మి.లీ. సబ్బు నీరు కలిపి మరుసటి రోజు ఉదయం పంటపై పిచికారి చేయాలి.
  • విత్తన శుద్ధి (విత్తనాల నాశించే పురుగులు, తెగుళ్ళ నివారణ) (విజయలక్ష్మి, ఆమె అనుచరులు, 1998)
  • ఒక మట్టి కుండలో 2.5 లీటర్ల నీరు పోసి మరిగించాలి. చల్లారిన తర్వాత 1 లీటరు ఆవుమూత్రం 50 గ్రా. దుంపపొడి కలిపి కర్రతో త్రిప్పాలి. విత్తనాలను ఈ ద్రావణంలో కలపాలి. పైకి తేలిన విత్తనాలను తొలగించి 15 నిమిషాలు ఉంచి ఆరబెట్టి విత్తాలి.
Read More