పంట నష్ట అంచనాను పారదర్శకంగా చేపట్టాలి
ఆంధ్రప్రదేశ్లో మొంథా తుపాను వల్ల జరిగిన పంట నష్టం అంచనాను పారదర్శకంగా చేపట్టాలని, ఏపీ ఎయిమ్స్ పంట నమోదు యాప్ ద్వారా మాత్రమే పంట నష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ తెలిపారు. పంట నష్ట నమోదు నుంచి జియో కోఆర్డినేట్, క్షేత్రస్థాయి ఫొటోలు అప్లోడ్ను ప్రభుత్వం మినహాయించినట్లు ఆయన చెప్పారు. ఈ-పంటలో నమోదైన వాస్తవ సాగుదారులనే నమోదు చేయాలన్నారు.

