ప్రకృతి వ్యవసాయంకు రూ. 422.96 కోట్లు
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు 43,402 కోట్లతో అగ్రికల్చర్ బడ్జెట్‌ను అసెంబ్లీలో ఈరోజు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 62 శాతం జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి ఉందని, కూటమి ప్రభుత్వం హయాంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి పెద్దపీట వేయడం జరిగిందని చెప్పారు. కేటాయింపులు ఇలా….
రాయితీ విత్తనాలకు రూ.240 కోట్లు
అన్నదాత సుఖీభవకు రూ.4,500 కోట్లు
భూసార పరీక్షలకు రూ.38.88 కోట్లు
విత్తనాల పంపిణీకి రూ.240 కోట్లు
ఎరువుల సరఫరాకు రూ.40 కోట్లు
పొలం పిలుస్తోంది రూ.11.31 కోట్లు
ప్రకృతి వ్యవసాయంకు రూ.422.96 కోట్లు
డిజిటల్ వ్యవసాయంకు రూ.44.77 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణకు రూ.187.68 కోట్లు
వడ్డీ లేని రుణాలకు రూ.628 కోట్లు
రైతు సేవా కేంద్రాలకు రూ.26.92 కోట్లు
ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ రూ.44.03 కోట్లు
పంటల బీమా పథకానికి రూ.1,023 కోట్లు
వ్యవసాయ శాఖ రూ.8,564.37 కోట్లు
ఉద్యావన శాఖ రూ.3469.47 కోట్లు
పట్టుపరిశ్రమ రూ.108.4429 కోట్లు
వ్యవసాయ మార్కెటింగ్ రూ.314.80 కోట్లు
సహకార శాఖ రూ.308.26 కోట్లు
ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంకు రూ.507.038 కోట్లు
ఉద్యాన విశ్వవిద్యాలయంకు రూ.102.227 కోట్లు
శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయంకు రూ.171.72 కోట్లు
మత్స్య విశ్వవిద్యాలయంకు రూ.38 కోట్లు
పశుసంవర్ధక శాఖకు రూ.1,095.71 కోట్లు
మత్స్య రంగం అభివృద్ధి కోసం రూ.521.34 కోట్లు
ఉచిత వ్యవసాయ విద్యుత్‌కు రూ.7241.30 కోట్లు
ఉపాధి హామీ అనుసంధానంకు రూ.5,150 కోట్లు
ఎన్టీఆర్ జలసిరికి రూ.50 కోట్లు
నీరుపారుదల ప్రాజెక్టుల నిర్వహణకు రూ.14,637.03 కోట్లు


