ప్రజా ప్రయోజనాల కోసమే కేవీకేలు పని చేస్తున్నాయి
ఆదివారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికిలోని ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండే షన్ కృషి విజ్ఞాన కేంద్రంలో రైతు వసతి గృహాన్ని, విలువ ఆధారిత ఉత్పత్తుల ఆహార శుద్ధి ప్రయోగశాలను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. అన్నదాతలు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందే విధంగా కేవీకేలు కృషి చేస్తున్నాయన్నారు. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ.. ప్రజాప్రయోజనాల కోసమే కేవీకేలు పనిచేస్తున్నాయని, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని కోరారు. జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి డీజీ మంగీలాల్ ఝాట్, అటార్నీ డైరెక్టర్ షేఖ్ ఎన్‌మీరా, అఖిల భారతీయ కార్యకారిణి సదస్య బాగయ్య తదితరులు మాట్లాడారు. అంతర్ౙాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తునికి సర్పంచి ధనలక్ష్మిని కేంద్ర మంత్రి సంజయ్ సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్ తదితరులు పాల్గొన్నారు.

